శ్లోక సడెన్ గా తన రూమ్ లోకి వచ్చిన పర్సన్ & అతని నుండి వస్తున్న గంభీరమైన వాయిస్ కి ఆ ఆ…. !! అని భయంగా చూస్తూ ఏడుస్తూ వెళ్ళి వాష్ రూమ్ డోర్ లాక్ చేసుకుని డోర్ కి ఆనుకుని టెన్షన్ గా అదురుతున్న గుండెను గట్టిగా చేత్తో పట్టుకుని చూస్తున్న శ్లోక కి …… !! వెనుక నుండి ఈ అమావాస్య నిషిలో నేను నీ కోసమే నీ జాడ కోసమే వెతుకున్నా శ్లోక …… !!
నేను చచ్చిన రోజే నీ మొహం లో నవ్వు ఆగిపోవాలి అనుకున్నా కానీ నువ్వు ఇంకా నవ్వుతూనే ఉన్నావ్ … !! అది నాకు ఏమాత్రం నచ్చడం లేదు అందుకే ఆ నవ్వు కోసమే & ఆ నవ్వును నాతో తీసుకుని వెళ్లాలనే మళ్ళీ నీ కోసం ఇలా వచ్చేశా శ్లోక అని లో వాయిస్ లో గంభీరంగా వినిపించిన వాయిస్ కి శ్లోక మోహం భయం తో తడిచిపోతుంది….. !!
మెల్లగా తన మెడ తిప్పి వెనక్కి చూసిన శ్లోక కి అతి దగ్గరగా కూర్చున్న రెండు దెయ్యాలను అవి నాలుక తెరచి తమ పెద్ద పెద్ద గోర్లతో శ్లోక గొంతు మీద పొడవడానికి వస్తూ ఉంటాయి….. !! అది చూసిన శ్లోక నో….. నన్ను చంపద్దు అని గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తిన శ్లోక కి ఎదురుగా కనిపిస్తాడు దెయ్యం గెట్ అప్ లో ఉన్న రాజ్ 😎…… !!
రాజ్ ను దెయ్యం అనుకున్న శ్లోక ఏడుస్తూ మీ…. మీ…..మీరంతా ఎవరు …… ?? ఇక్కడేం చేస్తున్నారు & నన్ను ఎందుకు టార్గెట్ చేసారు…… ?? ప్లీస్ నన్ను వదిలేయండి నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ గోడకు బల్లి లా అతుక్కుపోయి….. !! గొంతు లో నుండి మాట బయటకు రాకుంటే ఒక్కో మాట కష్టంగా పలుకుతూ చెప్తుంది…. !!
రాజ్ గట్టిగా నవ్వుతూ నువ్వు ఇంకా నన్ను గుర్తు పట్టలేదా శ్లోక నీకున్న తల పొగరుతో ఎంతో ఆనందంగా గడపాల్సిన నా జీవితాన్ని లాగేసుకుని నన్ను చెట్టుకు ఉరేసుకుని చచ్చేలా చేసావ్ గుర్తొచ్చానా అని అడుగుతూ శ్లోక ఎటు వెళ్లకుండా తన రెండు చేతులతో లాక్ చేస్తాడు…. !!
నా వల్ల నువ్వు చ…. చనిపోవడం ఏంటి….. ?? నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు ప్లీస్ నన్ను వదిలేయ్….. !!
రాజ్ కోపంగా శ్లోక గొంతు పట్టుకుని నిన్ను అంత సులువుగా ఎలా వదిలేస్తాను శ్లోక…… !! నీకున్న తల పొగరుతో డబ్బు లేని వాళ్ళను మనుషుల్లా చూసావా….. ?? నీ కంటే పెద్ద వాళ్లకు ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇచ్చావా…. ?? నీ లాంటి బ్రతికే అర్హత లేదు అందుకే నిన్ను కూడా నాతో తీసుకునే వెళ్తాను…. !! అంటూ గట్టి గట్టిగా నవ్వుతున్న రాజ్ వాయిస్ కి శ్లోక కి కాళ్ళల్లో వణుకు మొదలవుతుంది….. !!
ఇంకెప్పుడూ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడను ప్లీస్ వదిలేయ్ అంటూ ఏడుస్తున్న శ్లోక ను చూసి ఇంకా బయటపెడితే ఎక్కడ భయం తో చచ్చుద్ధో అని హ్మ్మ్….. !! ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఇంకో సారి ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వకుండా బిహేవ్ చేశావో నెక్స్ట్ మినిట్ నీ ముందు నేనుంటా….. !! అంటూ శ్లోక మెడ దగ్గర నుండి చేతిని వెనక్కి తీసుకుని కొంచెం దూరం లో నుంచుంటాడు….. !!
శ్లోక మెడ దగ్గర తడుముకుంటూ రాజ్ వైపు భయంగా చూస్తూ ఉంటే వెళ్ళి పడుకో నువ్వు నిద్రపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే ఫాస్ట్ గా బెడ్ మీద కు వెళ్ళి ఫుల్ బెడ్ షీట్ కప్పుకుని గట్టిగా కళ్ళు మూసుకుని శ్రీ ఆంజనేయం…. శ్రీ ఆంజనేయం అంటూ దేవుడి మంత్రం జపిస్తూ ఉంటుంది….. !!
శ్లోక ను అలా చూసిన రాజ్ నవ్వుకుంటూ కానిస్టేబుల్స్ కి సైగ చేయగానే ముగ్గురూ ఆ రూమ్ నుండి క్షణాల్లో వెళ్ళిపోతారు….. !! వెళ్ళిపోయాడా లేదా అని తన మొహం మీద నుండి బెడ్ షీట్ నెమ్మదిగా 20 నిమిషాల తరువాత తెరుస్తూ చూసిన శ్లోక కి రూమ్ మొత్తం ఎంప్టీ గా కనిపించడం తో …… !! ఫాస్ట్ గా బెడ్ దిగి రూమ్ మొత్తం చూసిన శ్లోక కి రూమ్ లో తను తప్పా ఎవరు కనిపించరు…… !!
రూమ్ ముందు లాగే ఉంది ఇంతకు ముందు కొట్టుకుంటున్నట్టు కర్టెన్స్, విండోస్ గాలికి కొట్టుకోవడం లేదు….. !! క్యాండిల్స్ కూడా ఇందాక చూసినట్టు ఎక్కువగా లేవు కేవలం 2 మాత్రమే ఉన్నాయి…. !! ఏంటిది ఏం అర్థం కావడం లేదు….. ?? ఇదంతా నా ఇమాజినేషన్ ఆ…. ?? లేక నిజంగా జరిగిందా అంటూ తల పట్టుకుని ఆలోచిస్తూ నిద్ర కు దూరం అవుతుంది….. !!
✨✨✨✨✨✨✨✨✨✨
రాజ్ గార్డెన్ లోకి వెళ్ళాక ఫాస్ట్ గా తాను వేసుకున్న మేక్ అప్ & దెయ్యం అవుట్ ఫిట్ తీసి నార్మల్ డ్రెస్ లోకి చేంజ్ అయ్యాక అవి మొత్తం ఒక బ్యాగ్ లో పెట్టేసి కానిస్టేబుల్స్ కి ఇస్తూ…… !! మీరు కూడా ఇవన్నీ తీసి ఎవరు చూడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోండి బట్ కేర్ఫుల్ ఎవరు మిమ్మల్ని చూడకుండా వెళ్ళాలి…… !! ఎవరైనా ఇక్కడ మనల్ని చూస్తే భూమి కి ప్రాబ్లెమ్ అని చెప్పడం తో కానిస్టేబుల్స్ ఒకే సర్ టేక్ కేర్ అంటూ ఇద్దరూ కూడా ఆ దెయ్యం గెట్ అప్ నుండి నార్మల్ గా చేంజ్ అయ్యి అక్కడి నుంచి డౌట్ రాకుండా వెళ్ళిపోతారు…… !!
జై వాళ్ళు వెళ్ళాక భూమి నిద్ర పోతున్న ప్లేస్ కి వచ్చి చూడగా భూమి పసి పాప లా నిద్రపోతూ కనిపించడం తో నవ్వుతూ భూమి పక్కన కూర్చుని తన తల నిమురుతూ ఉంటాడు… !! ముందుకు వంగి భూమి నుదుటిన ప్రేమగా ముద్దాడి ఈ సమస్య కి పరిష్కారం ఎన్టీ ……. ?? అని అలోచిస్తూ ఉన్న తనకు మానస నుండి కాల్ రావడం తో భూమి డిస్టర్బ్ అవ్వకుండా లిఫ్ట్ చేసి లో వాయిస్ తో మాట్లాడుతాడు …… !!
( రాజ్ ఇంట్లోకి కి ఎంటర్ అయ్యే ముందే మొబైల్ సైలెంట్ లో పెట్టేసి ఉంటాడు అందుకే రాజ్ కి కాల్ వచ్చినా భూమి కి డిస్ట్రబ్ అవ్వదు)
హెలో మామ్ చెప్పు ఎన్టీ కాల్ చేశావ్ ….. ??
కాల్ ఎందుకు చేశావ్ అంటావేంటి రాజ్ …… ?? ఎక్కడున్నావ్ టైమ్ 11 అవుతున్నా ఇంకా ఇంటికి రాక పోయేసరికి కాల్ చేశాను ……. !! మావయ్య కూడా వచ్చేశాడు అందరం భోజనం చేయకుండా నీ కోసం చూస్తూ కూర్చున్నాం …… !! ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలి రాజ్….. !! అంటూ అసహనంగా అడుగుతుంది
మానస ….. !
సారి మామ్ నాకు అర్జెంట్ వర్క్ ఉంది అందుకే కమీష్ణర్ అఫీస్ కి వెళ్తున్నా …… !! మే బీ ఈ నైట్ కుదరదు నేను రావడానికి ….. !! మీరు నా గురించి వెయిట్ చేయకుండా తిని పడుకోండి …… !!
అదేంట్రా ఎంత లేట్ అయినా పర్లేదు ఇంటికి రా ఇంతకీ తిన్నావా …… ??
అమ్మా చెప్పాను కదా కమిష్మెర్ అఫీస్ కి వెళ్తున్నా అని …. !! అక్కడ ఏ టైమ్ అవుతుందో చెప్పడానికి అదేమైనా నా అత్తగారి ఇల్లా…… !! నేను ఇవాళ నా ఫ్లాట్ లో ఉంటాను ….. !! డిన్నర్ కూడా ఇప్పుడే తిని స్టార్ట్ అయ్యాను…… !! నువ్వు మావయ్య కి ఫోన్ ఇవ్వు నేను కొంచెం మాట్లాడాలి ….. !!
ముక్కు మీదే ఉంటుంది రా కోపం నీకు ఎవరి పోలికలు వచ్చాయో ఎంటో …. ?? ( ఇంకెవరికి అత్త పోలికలే ఎమ్ అంటారు గాయ్స్ 😜) అని విసుక్కుంటూ ఆన్నయ్య రాజ్ అంటూ మొబైల్ కార్తికేయ కి ఇచ్చి అనసూయ పక్కన కూర్చుంటుంది …… !!
ఏమైందీ మానస ఏమన్నాడు వాడు ఎప్పుడు వస్తాడు అట …… ?? ఇక్కడ నేను బీ. పీ. టాబ్లెట్ వేసుకుని రెండు గంటల సేపు అవుతుంది …… !? ఇంకా ఎంత సేపు త్వరగా రమ్మని చెప్పు నాకు ఆకలిగా ఉంది….. !! టాబ్లెట్స్ వేసుకుని అంత సేపు తినకుండా ఉండకూడదు…… !!
అమ్మా నేను అప్పుడే చెప్పా రాజ్ ఏ టైం కి వస్తాడో చెప్పలేను తిను అని విన్నావా నా మాట….. !! వాడు రావడం లేదు కానీ పదమ్మా నీకు వడ్డిస్తాను …… !! రాజ్ కి ఎదో అర్జెంట్ వర్క్ ఉందట …… !! అందుకే ఈరోజు తన ఫ్లాట్ లోనే పడుకుంటాను అన్నాడు ….. !!
కనీసం వచ్చి తినమని చెప్పాల్సింది కదా మానస వర్క్ లో పడితే రాజ్ కూడా కార్తికేయ లానే తిండిని నెగ్లెట్ చేస్తాడు….. !!
నన్ను మాట్లాడనిస్తున్నాడా అసలు నీ మనవడు ….. ?? ముక్కు మీదే ఉంటుంది అయ్యగారికి కోపం ….. !! వాడికి ఎవరి పోలికలు వచ్చాయో కానీ వచ్చే అమ్మాయి మాత్రం వీడితో మూడు రోజులు కుడా ఉండదు ఎలా వేగుతుందో ఎంటో….. ??
ఇంకెవరి పోలికలు వాడి అత్త పోలికలే కనిపిస్తున్నాయి …… !! ఆవిడ కూడా అంతే చీటికి మాటికి ఇలా చిరుబుర్రులాడుతూ ఉండేది …… !!
ఆపుతారా మీ గోల…… !! నాకు ఇష్టం లేని మనిషి పేరు ఈ ఇంట్లో వినిపించకూడదు అన్నాను కదా …… !! మరో సారి దాని పేరు నాకు వినిపించకూడదు ……. !! అర్థం అవుతుందా అని సీరియస్ గా చెప్పి పిస్ఫుల్ గా కాల్ కూడా మాట్లాడనివ్వరు అని ఇరిటేట్ అవుతూ హెలో రాజ్ చెప్పరా ఎక్కడున్నావ్ …… ?? అని మాట్లాడుతూ అక్కడి నుండి గార్డెన్ లోకి వెళతాడు కార్తికేయ…… !!
అన్నయ్య ముందు ఎందుకమ్మా వదిన ను తీసుకొస్తావ్ ….. !! ఆన్నయ్య కి ఆవిడ పేరు వినడం కూడా ఇష్టం వుండదు అని తెలుసు కదా నీకు…… !!
అలా తెస్తేనే కదా మీ అన్నయ్య మనసులో మీ వదిన స్థానం ఎంటో తెలిసేది ….. !! సర్లే ముందు పదా నాకు బాగా ఆకలిగా ఉంది…… !! అంటూ మానస ను తీసుకుని డైనింగ్ ఏరియా లోకి వెళ్తుంది అనసూయ…… !!
మావయ్య నేను భూమి దగ్గర వున్నాను అని భూమి గార్డెన్ లో ఉండడం దగ్గర నుంచి ఫుడ్ తినిపించడం వరకూ చెప్పి …… !! నీకు తెలుసు కదా మావయ్య భూమి కి చీకటి అంటే కొంచెం బయమని ……. !! భూమి ఇలా ఒంటరిగా గార్డెన్ లో పడుకుని ఉంటే నేను ప్రశాంతంగా ఏ.సి వేసుకుని ఎలా పడుకుంటాను…… ?? అందుకే తెల్లారే వరకూ తనకు తోడుగా ఇక్కడే ఉంటాను ……. !! నువ్వు అమ్మ, అమ్మమ్మ లకి డౌట్ రాకుండా మ్యానేజ్ చెయ్ …… !!
వాళ్ళు భూమి ను మార్నింగ్ నుండి ఎమ్ తిననివ్వలేదా …… ?? ఛీ ఎమ్ మనుషులు రా వాళ్లు…… ?? నా దృష్టిలో వాళ్లు మనుషులే కాదు భూమి వాళ్ళని మార్చాలి అంటుంది …… !! కానీ వాళ్ళు మనుషులు అయితే కదా మారడానికి …… !! నా మాట విని నిద్రపోతున్న భూమి ను అలాగే ఎత్తుకుని మన విల్లా కి తీసుకుని వచ్చేయ్ …… !! ఆ తర్వాత భూమి తో నేను మాట్లాడతాను …….. !!
భూమి ను ఆ నరకం లో ఉంచి మనం కూడా ఇక్కడ ప్రశాంతంగా కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదు …… !! అదే భూమి మన కళ్ళ ముందే ఉంటే భూమి ను మహారాణి లా చూసుకోవచ్చు …… !! కొద్ది రోజులు బాధ పడ్డా తర్వాత భూమి అర్తం చేసుకుంటుంది ……. !! ఆ ఇంటి మనుషుల నీడ కూడా భూమి మీద పడ్డానికి వీల్లేదు ……. !!
కానీ మావయ్య భూమి నిన్ను ఆవిడ ను ఎలాగైనా కలపాలి …… !! అలా అయినా మన రెండు కుటుంబాలు కలుస్తాయి …… !! ఆన్న ఆశ తోనే ఇక్కడ వీళ్ళు ఎంత టార్చర్ పెడుతున్న మీ కోసం బరిస్తుంది …… !! ఇప్పుడు నేను తీసుకుని వచ్చినా భూమి ఇక్కడికే వచ్చేస్తుంది అంత దాక ఎందుకు నువ్వు పిలిచినా రాలేదు అంటే తనను మనం ఆపగలమా మావయ్య ……. ??
అదంతా నేను చూసుకుంటాను ముందు తనను తీసుకుని రా …… !! వచ్చిన తర్వాత ఎమ్ చేయాలో ఆలోచిద్దాం …… ?? నన్ను దాటి ఎవడు నా బంగారు తల్లిని తీసుకుని వెళ్తారో నేను చూస్తాను …… !! అంటూ మహాన్ గుర్తు రావడం తో పిడికిలి బిగించి కోపంగా అంటాడు ……. !!
మన భూమి ను అలా బలవంతంగా తీసుకుని రావడం ఎందుకు మావయ్య….. ?? 3 మంత్స్ ఆగండి భూమి ఇష్టంగానే మన ఇంటికి వచ్చేస్తుంది…… !! ఇపుడు నేను భూమి ను తీసుకుని వచ్చినా అది కచ్చితంగా మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుంది….. !! నీకు తెలుసు కదా మావయ్య భూమి మొండితనం గురించి మీరేం వర్రీ అవ్వకండి మన భూమి అందరూ అనుకుంటున్నట్టు ఇన్నోసెంట్ ఏం కాదు….. !! ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసింది అని రాజ్ ధైర్యం చెప్పడం తో కార్తికేయ మనసు కొంచెం కుదుట పడుతుంది…… !!
రాజ్ తో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసిన కార్తికేయ ఏదో తినాలి అంటే తినాలి అని కాస్త తిని తన రూమ్ కి వెళ్ళిపోతాడు….. !! రూమ్ ఓపెన్ చేయగానే భూమి అందమైన ఫోటో నవ్వుతూ కనిపిస్తుంది….. !! అది కార్తికేయ కి ఇష్టమైన ఫోటో అందుకే తన రూమ్ లో వాల్ కి ఎన్లార్జ్ చేయించి పెట్టుకున్నాడు…… !!
రోజూ ఉదయాన్నే భూమి ఫోటో చూస్తూ తన డే స్టార్ట్ చేస్తాడు కార్తికేయ….. !! ఇప్పుడు కూడా భూమి ఫోటో ను ప్రేమగా తడుముతూ ఎలా ఉన్నావ్…. ?? చిట్టి తల్లీ నిన్ను నేను బాగా మిస్ అవుతున్నా త్వరగా వచ్చెయ్ బంగారం అని అనుకుంటూ బెడ్ మీద కూర్చున్న తనకు ఏవేవో జ్ఞాపకాలు మెదడును తొనిచేస్తూ ఉంటాయి….. !!
కార్తిక్ నేను నీతో మాట్లాడాలి అని అంటున్న నందన ను చూసి నాతోనా?? ఎమ్ మాట్లాడాలి నందన అయినా కొత్తగా ఈ కార్తీక్ ఏంటి….. ?? అంటూ తన వైపు సూటిగా చూస్తూ అడుగుతాడు….. !!
నువ్వే చెప్పావ్ కదా నువ్వంటే ఇష్టం ఉన్న వాళ్ళు నిన్ను కార్తీక్ అంటారని అందుకే నేను కూడా కార్తీక్ అనే పిలవాలని డిసైడ్ అయ్యాను…… !!
కార్తికేయ నందన వైపు కళ్ళు చిన్నగా చేసి చూస్తూ ఏదో మాట్లాడాలి అన్నావ్….. ?? అదేంటో చెప్తే నేను వెళ్ళాలి నాకు టైమ్ అవుతోంది అని వాచ్ వైపు చూస్తూ టెర్రస్ మొత్తం చూస్తూ ఉంటాడు….. !!
నీతో ఎప్పటి నుంచో చెప్పాలి అని చెప్పలేక పోతున్నా బట్ ఆ టైం ఇపుడు వచ్చింది …… !! అని సిగ్గుతో తల దించేస్తూ నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు కార్తీక్ కానీ నాకు ఎవరు నచ్చలేదు నువ్వు తప్పా….. !! ఎందుకో నువ్వంటే నాకు ఇష్టం అది ప్రేమ అని లేట్ గా తెలుసుకున్నా ఐ లవ్ యూ కార్తీక్ ❤️
జోక్ చేస్తున్నావా….. ?? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి నందన….. !! ఐ ఆమ్ సారి నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు…… !!
సీరియస్ గానే చెప్తున్నా కార్తీక్ నువ్వంటే నాకు చాలా ఇష్టం & నాకు నో చెప్పడానికి రీసన్ ఏముంది….. ?? చదువు,డబ్బు, అందం & తెలివి అన్నీ ఉన్నాయి…… !! నాలో నచ్చక పోవడానికి ఏమున్నాయి కార్తీక్….. ??
చాలానే ఉన్నాయి నందన ఇపుడు చెప్పావే డబ్బు అని అదే మెయిన్ ప్రాబ్లెమ్….. !! నెక్స్ట్ నీ అహంకారం….. !! అయినా అబ్బాయిలకి అమ్మాయిలు నచ్చుతారు నీలాంటి తల పొగరు ఉన్న వాళ్ళు కాదు….. !! నాకు నీకు ఎప్పటికీ సెట్ అవ్వదు అని అక్కడి నుండి వెళ్లబోతున్న కార్తికేయ ను చూసి కోపంగా కార్తీక్ అని పిలవగానే ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు….. !!
నువ్వు నన్ను నా ప్రేమను కాదని ఒక్క అడుగు ముందుకు వేసిన ఈ బిల్డింగ్ నుండి దూకి చచ్చిపోతాను ….. !!
నీ బెదిరింపులకు నేను భయపడను బెస్ట్ ఆఫ్ లక్ అంటూ వెళ్ళిపోతున్న కార్తికేయ ను చూసి నందన బిల్డింగ్ నుండి దూకేస్తుంది….. !!
నందు అంటూ ఒక్కసారిగా బెడ్ మీద నుండి లేచి కూర్చుంటాడు కార్తికేయ….. ??
శ్లోక ను మన పోలీస్ బాబు బానే బయటపెట్టాడు కదా….. !! తనను బయటపెట్టింది రాజ్ అని శ్లోక కి తెలిస్తే….. ?? మహాన్ కి భూమి మీద ఉన్నది ప్రేమ….?? కోపమా….. ?? కార్తికేయ గతం లో ఎమ్ జరిగింది….. ?? నందన కార్తికేయ కోసం సూసైడ్ వరకూ వెళ్లిందా… ?? అసలు వీళ్ళ పెళ్ళి ఇష్టంగానే జరిగిందా…… ?? కార్తికేయ కి నందన అంటే ఎందుకంత కోపం….. ??