నీ ఊపిరి సాక్షిగా-16

మహాన్ గార్డెన్ వైపు వస్తూ మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే చుట్టూ చీకటిగా ఉన్న ప్లేస్ ను చూసి ఇంత చీకటిగా ఉంది ఇది అసలు ఎలా ఉంది ఇక్కడ….. ?? అసలేం చేస్తుంది ఇది అని అనుకుంటూ గార్డెన్ లోకి ఒక్కో అడుగు వేస్తున్న మహాన్ కి వాచ్ మెన్ పిలుపు వినిపించి అటు వైపు చూస్తాడు….. !!

మహాన్ బాబు మీరేంటి ఇక్కడ….. ?? నేను మెయిన్ స్విచ్ బోర్డ్ మొత్తం చెక్ చేసాను బాబు ఫ్యూజ్ పోవడమే కాకుండా వైర్స్ కూడా అన్ని డిస్మాచ్ అయ్యాయి….. !! అవన్నీ సెట్ చేయాలంటే ఎలెక్ట్రీషియన్ రాక తప్పదు & తనకు చేయడానికి ట్రై చేసాను బట్ మా మొబైల్స్ ఎవరివి వర్క్ అవ్వట్లేదు….. !!

ఆల్ ఆఫ్ సడెన్ ఈ గోల ఏంటి….. ?? అలా ఎలా పోయాయి అంత నెగ్లిజెన్స్ గా ఉన్నారా మీరు….. ?? మీకు వేలకు వేలు సాలరీస్ ఇచ్చేది దేనికి….. ?? ఇది కూడా మేమే చూడాలా ఇడియట్స్….. ?? ఎప్పుడు ఇలా జరగలేదు & అందరి మొబైల్స్ వర్క్ చేయకపోవడం ఏంటి అని ఇరిటేట్ అవుతూ తెల్లారే సరికి ఆ ఎలక్ట్రీషియన్ నా ముందు ఉండాలి గెట్ అవుట్ అంటూ అరుస్తున్న మహాన్ నం చూసి భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాచ్ మెన్…… !!

మహాన్ వాచ్ మెన్ ను అరుస్తూ ఉన్నప్పుడే మహాన్ ను అక్కడ చూసిన రాజ్ ఎయిర్ బెడ్ ను డిఫ్లేట్ చేసి మొత్తం అన్ని ప్యాక్ చేసి బ్యాగ్స్ లో సర్దేసి కానిస్టేబుల్స్ ను తీసుకుని వెళ్ళి మహాన్ తమను చూడకుండా & ఎవరికి కనిపించకుండా ఆ గార్డెన్ లోనే హైడ్ అవుతారు….. !!

✨✨✨✨✨✨✨✨✨

 

రాజ్ వెళ్ళాక మహాన్ అడుగుల చప్పుడు తనకు దగ్గరగా వినిపిస్తూ ఉండడం తో అక్కడే గ్రీన్ టర్ఫ్ గ్రాస్ మీద మోచేతి మీద పడుకుని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ కళ్ళు మూసేస్తుంది….. !! భూమి ను వెతుకుతూ వచ్చిన మహాన్ కి భూమి గ్రాస్ మీదనే పడుకుని కనిపించడం ఫ్లాష్ లైట్ లో చూసి భూమి ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన వైపు చూస్తాడు….. !!

గార్డెన్ మొత్తం చాలా నిశబ్దంగా ఉంది…. !! చుట్టూ చీకటి ఎదురుగా చందమామ లా ఉన్న భూమి….. !! చల్లని గాలి మేనిని తాకుతూ ఉంటే అప్పటి వరకు తనలో ఉన్న చిరాకు, విసుగు భూమి మొహం చూసే సరికి తన మనసంతా తెలియని ప్రశాంతత….. !! నాకు నిద్రలేకుండా చేసి ఇది మాత్రం ప్రశాంతంగా ఎలా నిద్రపోతుంది అని తనకే తెలియకుండా భూమి సుతారమైన చంపను తన ముని వేళ్ళతో తాకుతూ చిరు నవ్వుతో చూస్తూ ఉన్నాడు మహాన్…. !!

అందమైన జాబిలి లాంటి భూమి మొహాన్ని కనిపించకుండా దాచేస్తున్న భూమి హెయిర్ తన మొహం మీద పడి అల్లరి చేస్తూ ఉంటే వాటిని భూమి చెవి వెనుక పెడుతూ తనకే తెలియకుండా మెల్లగా భూమి తల నిమురుతూ ఉన్నాడు…. !! భూమి తీసుకునే శ్వాస కూడా మహాన్ కి చాలా మధురంగా అనిపిస్తుంది ….. !!

నిన్ను ఎంతలా లవ్ చేశానో తెలుసా భూమి నీ పెదవుల్లో చిరు నవ్వు చూస్తే చాలు ఈ లోకాన్ని గెలిచినంత హ్యాపీగా అనిపించేది & నీ హ్యాపీనెస్ కోసం ఏదైనా & ఎంత దూరం అయినా వెళ్ళాలి అనుకునే వాడిని ….. !! అలాంటి నన్ను ఇలా రాక్షసుడి లా మార్చేసింది నువ్వే ….. !!

 

యస్ నేను నా ప్రేమ ఎదీ అబద్ధం కాదు ఇదిగో ఇప్పుడు నువ్వు చూస్తున్నావ్ కదా ఇదే నిజం ఈ నిశబ్దం & ఈ క్షణం నా ప్రేమకు సాక్షాలు….. !! నీ మీద పెంచుకున్న నా ప్రేమ ఎంత నిజమో నా పగ కూడా అంతే నిజం అని అప్పటి దాకా భూమి వైపు ప్రేమగా చూసిన మహాన్ కళ్ళు సడెన్ గా ఎర్రగా మారుతాయి….. !!

మహాన్ సడెన్ గా తన చేతిని భూమి మీద నుండి తీసుకుని తన వైపు కోపంగా చూస్తూ ఐ హేట్ యూ భూమి నువ్వు ఎప్పుడు నన్ను చేరుకోలేవు…. !! నిన్ను నేను చేసుకుంది కేవలం నిన్ను ఏడిపించడం కోసమే అని చెప్తూ భూమి నుండి దూరం జరిగి రాత్రి మొత్తం ఇలానే పడుకుని చావ్….. !! నీ గురించి ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు అని కళ్ళు మూసుకుని పడుకున్న భూమి వైపు చూస్తూ అక్కడి నుంచి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు….. !!

మెయిన్ డోర్ క్లోజ్ చేసిన సౌండ్ కి కళ్ళు తెరచిన భూమి లేచి కూర్చుంటూ మహాన్ వెళ్లిన వైపే చూస్తూ నువ్వు నీ ప్రేమ ఏవీ అబద్దం కావు మహాన్….. !! నా సూర్యకాంతం వల్లే నువ్విలా మారిపోయావు ఇప్పటికీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావ్ బట్ చేయనట్టు యాక్ట్ చేస్తున్నావ్….. !!

నీలో దాగున్న నా మీద ప్రేమ ను ఎలా బయటకు తీసుకు రావాలో నాకు తెలుసు అని మహాన్ వెళ్లిన వైపే చూస్తూ ఉన్న భూమి తల మీద చిన్నగా మొట్టిన రాజ్ వైపు చూస్తూ అబ్బా ….. !! ఏంట్రా అలా కొట్టావ్ అని తల రుద్దుకుంటూ అడుగుతుంది…. !!

వాడు వెళ్ళి చాలా సేపైంది కానీ తల తిప్పు అని సీరియస్ గా చూస్తూ నువ్వు ఇక్కడికి వచ్చింది మావయ్య కోసం అది మర్చిపోకు….. !! 3 మంత్స్ లో నువ్వు అనుకున్నట్టు మావయ్య ను ఆవిడ ను కలిపినా కలపకపోయినా నిన్ను మన ఇంటికి తీసుకు వెళ్తాను అర్థం అవుతుందా…. !!

వాడు నీ లైఫ్ లో ఉండడు కాబట్టి ఆ కళ్ళు, నోరు మూసి పడుకో అని అప్పటికే సెట్ చేసిన బెడ్ మీద కూర్చుంటూ భూమి ను తల ను వొళ్ళో పెట్టుకుని భూమి ను జో కొడుతూ ఉంటే …… !! భూమి రాజ్ వడిలో తెలియని హాయి కలుగుతూ ఉంటే మహాన్ గురించి ఆలోచిస్తూ రాజ్ తో మాట్లాడుతూనే అన్ని సమస్యలను మర్చిపోయి కాసేపటికే ఆన్న వడిలో పసి పాప లా నిద్రలోకి జారుకుంటుంది ……. !!

భూమి నిద్రపోయాక ఆ మహాన్ పాము లాంటి వాడు భూమి దాన్ని మనం ఎంత బాగా చూసుకున్నా అది మన మీద విషాన్నే చిమ్ముతుంది…… !! వీడు అంతే అని భూమి తల నిమురుతూ తను నిద్ర పోయింది అని కన్ఫర్మ్ చేసుకుని మెల్లగా భూమి తలను డిస్టర్బ్ అవ్వకుండా ….. !! నెమ్మదిగా పిల్లో మీదకు షిఫ్ట్ చేసి బెడ్ షీట్ కప్పుతూ ఫ్యాన్ సెట్ చేసి ప్రేమగా నుదుటిన ముద్దు పెడతాడు…. !!

ఎయిర్ బెడ్ మీద నుండి లేచి కాస్త దూరం లో ఉన్న కానిస్టేబుల్స్ ను పిలిచి నేను చెప్పినవి అన్నీ తీసుకుని రమ్మన్నా తెచ్చారా….. ?? యస్ సర్ అన్నీ తెచ్చాం అని బ్యాగ్ పట్టుకుని ఏమేం తెచ్చారో చూస్తున్న తన కానిస్టేబుల్స్ వైపు చూసి గుడ్ ఇంకెందుకు లేట్ కమాన్ గెట్ అప్ చేంజ్….. !!

పదిహెను నిమిషాల తరువాత ముగ్గురూ లాంగ్ వైట్ గౌన్ & వైట్ గ్లోవ్స్ & వైట్ షూస్ మెడలో ఏవేవో భయంకరమైన ఘోస్ట్ ఆర్నిమెంట్స్ వేసుకుని మొహానికి గ్యాప్ లేకుండా పౌడర్ రాసుకుని….. !! కళ్ళ కింద కాటుకతో నల్లగా రాసుకుని & బుగ్గ మీద అటు ఎర్రగా కత్తి తో కోసినట్టు గాట్లు పెట్టుకుని లిప్స్ మీద రెడ్ & వైట్ లిప్స్టిక్ వేసుకుని మొత్తానికి ముగ్గురు దెయ్యం గెట్ అప్స్ లో పర్ఫెక్ట్ గా రెడీ అవుతారు….. !!

సర్ మేము ఎప్పుడూ ఇలా డెవిల్ గెటప్స్ వేసుకోలేదు & వుయ్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ అని చెప్తున్న ఇద్దరి కానిస్టేబుల్స్ వైపు సీరియస్ లుక్స్ ఇస్తూ మీ ఓవర్ ఎక్స్ట్మెంట్ తో ఓవర్ యాక్షన్ చేస్తే షూట్ చేసి పారేస్తా ….. !! నోరు మూసి నేను ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయ్యి నేను చెప్పింది చెప్పినట్టు చేయండి చాలు….. !! ఆ శంకిని కి ఇవాళ ముప్పు తిప్పలు పెట్టి మూసి నది నీళ్లు తాగించాలి అర్థం అవుతుందా….. ??

యస్ సర్ అంటూ ఇద్దరూ తమ ఓవర్ యాక్షన్ తగ్గించి స్టిఫ్ గా నుంచోగానే….. !! మీరు దెయ్యాలయ్యా బాబు ఆ బాడీ లాంగ్వేజ్ మెయిన్ టెయిన్ చేయండి & మిగిలిన ప్రాపర్టీస్ తీసుకుని రండి అది ఇవాళ మనల్ని చూసి చుచ్చు పోసుకోవాలి అని నవ్వుకుంటూ వాళ్ళను తీసుకుని నిద్రపోయిన భూమి ను చూసి బ్యాక్ సైడ్ నుండి ఇంట్లోకి వెళతారు….. !!

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

భూమి దగ్గర నుంచి తన రూమ్ కి వచ్చిన మహాన్ రూమ్ డోర్ లాక్ చేసి బెడ్ మీద విసుగ్గా కూర్చుంటాడు …… !! తన మనసంతా భూమి జ్ఞాపకాలతో నిండిపోవడం తో కోపంగా పైకి లేచి తన వాడ్రాబ్ నుండి స్కాచ్ బాటిల్ తీసుకుని ఓపెన్ చేసి కూల్ డ్రింక్ లా మొత్తం దించకుండా తాగేసి ఆఆ….. !! అని అరుస్తూ ఆ బాటిల్ ను నేల మీదకు విసిరేయగాని అది ముక్కలు ముక్కలు అవుతుంది….. !!

ఈ బాటిల్ లానే నా మనసును కూడా ముక్కలు చేసి నన్ను మనసు లేని మనిషిని చేసావ్ కదే….. !! ఎంత ప్రేమించానే నిన్ను అలాంటి నన్ను…. నన్ను మోసం చేయాలని చూస్తావా….. ?? నిన్ను చూసిన ప్రతీ సారి నాలో నేనే చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యే వాడిని ఇంత మంచి అమ్మాయి నా లైఫ్ లోకి వచ్చిందని… ?? బట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్ నన్ను నా ఫ్యామిలీ కి దూరం చేయాలి అనుకున్న నిన్ను నీ ఫ్యామిలీ కి దూరం చేసి నా కాళ్ళ కింద ఉండేలా చేసాను…. !!

ఐ హేట్ యూ భూమి నాకు నువ్వొద్దు….. !! నువ్వు రోజు నా కళ్ళ ముందు ఏడుస్తూనే ఉండాలి అప్పుడే నా పెయిన్ తగ్గుతుంది….. !! ఐ హేట్ యూ…. ఐ హేట్ అంటూ మత్తుగా కళ్ళు మూసుకుని బెడ్ మీద స్కాచ్ మత్తుకు నిద్రలోకి జారుకుంటాడు మహాన్….. !!

💔💔💔💔💔💔💔💔💔

 

పవర్ వస్తుందా రాదా…… ?? ఛా ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలో ఏంటో నాకు ఏ. సీ లేకపోతే నిద్ర వచ్చి చావదు అంతా నా కర్మ….. !! తన రూమ్ లో చిన్నగా వెలుగుతున్న క్యాండిల్స్ ను చూస్తు ఇవి ఉన్నంత వరకూ నాకేం భయం లేదు అనుకుని ఈ భూమి కి సడెన్ గా ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కావడం లేదు….. ?? ఈ అన్నా చెల్లెళ్ళు నాకే వార్నింగ్ ఇస్తారా అందుకే కదా అన్నయ్య దగ్గర కావాలని ఏడ్చి దాన్ని బయట పడుకునేలా చేసాను….. !!

అది గార్డెన్ లో కూర్చుని ఈ పాటికి ఏడుస్తూ ఉంటుంది & ఆ రాజ్ కూడా నేను పంపిన పిక్ చూసి చెల్లెలి గురించి వాడు ఏడుస్తుంటాడు లేకపోతే నాతోనే పెట్టుకుంటారా అని నవ్వుకుంటున్న శ్లోక కి క్యాండిల్స్ ఒక్క సారిగా ఆరిపోవడం & సడెన్ గా రూమ్ లో ఉన్న కర్టెన్స్ గాలికి ఎగురుతూ విండోస్ గాలికి టపా….. టపా కొట్టుకుంటూ శ్లోక లో కంగారు & భయం పుట్టిస్తుంది….. !!

 

ఇదేంటి దెయ్యం సినిమా లో సడెన్ గా ఇలా అవుతుంది అని బెడ్ మీద నుండి నెమ్మదిగా కాళ్ళు కింద పెడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ విండోస్ దగ్గరకు వెళ్ళి వాటికి ఉన్న బోల్ట్ పెడుతూ వాటిని క్లోజ్ చేసి మళ్ళీ బెడ్ మీద కూర్చుంటూ ఉండగా విండోస్ మళ్ళీ కొట్టుకోవడం చూసి శ్లోక కి చమటలు పడతాయి…. !! బోల్ట్ పెట్టున్న విండోస్ ఎలా ఓపెన్ అయ్యాయి అని భయపడుతూ చుట్టు చూస్తున్న శ్లోక కి ఒక్క సారిగా ఆరిపోయిన క్యాండిల్స్ అన్ని ఆన్ అవ్వగానే ఆ ఆ ఆ మమ్మీ అంటూ భయం తో గట్టిగా అరుస్తుంది….. !!

శ్లోక ఎంత అరుస్తున్నా & ఇంట్లో అందరినీ పిలుస్తున్నా ఎవరికీ తన ఏడుపు వినిపించదు….. !! శ్లోక ఏడుస్తూనే డోర్ వైపు వెళ్తూ ఉంటే డోర్ దగ్గర నుండి పొగ వస్తూ ఉండడం చూసి శ్లోక కాళ్ళు వణుకుతూ ఉంటాయి దాంతో ఒక్కో అడుగు వెనక్కి వేసి బయంగా బెడ్ ఎక్కేస్తుంది …… !! ( మన పోలీస్ బాబు డోర్ బయట స్మోక్ ఎఫెక్ట్ పెట్టుంటాడు 😁 అందుకే పొగ వదులుతూ ఉంటుంది రూమ్ లో అది చూసే మన శ్లోక పాప ఏడుస్తుంది పాపం 😌😎)

ఏ….. ఏ….. ఎవరు…… ?? అని వణుకుతున్న గొంతు తో భయంకరంగా వినిపిస్తున్న అడుగుల చప్పుడు కి ఏడుస్తూ పిలుస్తున్న శ్లోక కి ఒక్క సారిగా తలుపులు ఓపెన్ అవ్వగానే బయటకు పరుగు తీయబోతున్న తనకు ఏదో తెల్లటి రూపం రూమ్ లోకి అడుగు పెట్టడం & డోర్ వెంటనే లాక్ అవ్వడం చూసి చలి జ్వరం తెచ్చుకుని వణుకుతూ ఉంటుంది….. !!

ను….. నువ్వు ఎవరు….. ?? ఇక్కడికి ఎలా వచ్చావ్ అని అడుగుతున్న శ్లోక వైపు చూస్తూ గంభీరమైన గొంతు తో చీకటి నా ఊపిరి….. !! నిశబ్దం నా మార్గం…. !! చావు నా జ్ఞానం & జీవితం నా శాపం….. !! ఓం త్రినేత్రాయ నమః చావు ద్వారం తెరుచుకో అనగానే డోర్స్, విండోస్ ఒక్క సారిగా ఓపెన్ అవ్వగానే శ్లోక భయం తో గట్టిగా ఆ…. !! అంటూ అరుస్తూ వాష్ రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడుస్తూ వణుకుతూ ఉంటుంది అప్పుడే తనకు వెనుక నుండి…. ??

ఆ…. !! ఆశ దోస తర్వాత ఎమ్ జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం 😎 ….. !! మన పోలీస్ బాబు శ్లోక పాప ను మామూలుగా ఆదుకోవట్లేదు కదా 😁🤭……. !! మీకు పోలీస్ బాబు రివెంజ్ ఎలా అనిపించిందో చెప్పండి….. ?? మహాన్ ను భూమి మోసం చేయాలి అనుకుందా….. ?? ఎంటా మోసం అసలు వీళ్ళ లైఫ్ లో ఎమ్ జరిగింది….. ?? ఇవన్నీ తెలియాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే 😌 స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి ❤️….. !! మీరు ఇచ్చే చిన్న లైక్, కామెంట్ & హైప్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply