భూమి గడ్డం కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ నా ప్లాన్ ఎలా స్టార్ట్ చేయాలి….. ?? నేను ఎమ్ చేయాలి అన్నా ముందు ఇంట్లోకి వెళ్ళాలి కానీ మహాన్ ఇవాళ ఇంట్లోకి రావద్దు అని చెప్పాడు తన మాట కాదు అని వెళ్తే మహాన్ నే కాదు నా సూర్యకాంతం అత్త కూడా ఊరుకోదు…… !! మరిప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్న భూమి కి ఎందుకో బాగా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు…… !!
అమ్మ, అమ్మమ్మ & మావయ్యా ఎలా వున్నారో పోని అమ్మ కి కాల్ చేస్తే …… ?? అని మొబైల్ చేతిలోకి తీసుకుంటూ ఆగి లేదు అమ్మ కన్నీళ్లను నేను చూడలేను …… !! అలా అని నీతో మాట్లాడకుండా ఉండడం కూడా నా వల్ల అవ్వటం లేదమ్మా…… !! అన్నయ్య ఈ పాటికి ఇక్కడ పరిస్థితి గురించి ఇంట్లో చెప్పి పెద్ద గొడవే చేసుంటాడు ….. !! నా గురించి అమ్మా, అమ్మమ్మ ఎంతలా ఏడుస్తున్నారో ఎంటో …… !! నేను మాట్లాడితే కొంతలో కొంతైనా వాల్ల బాధ తగ్గుతుంది ….. !! అని ఆలోచిస్తున్న భూమి దగ్గరకు వస్తుంది రేణుక …… !!
రేణుక ను చూసిన భూమి ఏంటి అక్క అని అడగ్గా భూమి నిన్ను నందన అమ్మ గారు పిలుస్తున్నారు ….. !! చాలా కోపంగా ఉన్నారు నాకు కంగారుగా ఉంది భూమి మళ్ళీ నిన్ను బాధ పెట్టడానికే పిలుస్తున్నారు అనుకుంటా….. ??
భూమి బెంచ్ మీద నుండి లేచి నుంచుని చిన్నగా నవ్వుతూ టెన్షన్ పడకు అక్కా ఇవాల్టి నుండి ఎవరి ఆటలు సాగనివ్వను….. !! వాళ్ళు నా మీద ఎలాంటి ప్లాన్ చేసినా దాన్ని అట్టర్ ఫ్లాప్ చేసే బాధ్యత నాది….. !! నువ్వు నా గురించి అసలు వర్రీ అవ్వకు అంటూ నవ్వుతూ తన ముందు నుండి వెళ్తున్న భూమి ని అయోమయంగా చూస్తూ ఏంటిది నేను చూస్తుంది భూమి నేనా….. ??
సడెన్ గా భూమి లో ఇంత మార్పు ఏంటి….. ?? ఎప్పుడు వాళ్ళు భూమిని టార్చర్ చేయడం & భూమి వాటిని ఓపికగా భరిస్తూ ఉండడమే చూసాను కానీ భూమి లో ఈ మార్పు ను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చూద్దాం ఏం జరుగుతుందో అని రేణుక కూడా భూమి వెనుకే వెళ్తుంది…… !!
నందన భూమి దగ్గరకు గార్డెన్ లోకి వెళ్తూ ఆగి అయినా నేను దాని దగ్గరకు వెళ్ళడం ఏంటి….. ?? అదే నా దగ్గరకు వచ్చేలా చేయాలి అని హాల్ లో ఉన్న సోఫా లో కూర్చుని వర్క్ చేసుకుంటున్న రేణుక ను పిలిచి భూమి ను పిలుచుకుని రమ్మని చెప్పి స్టైల్ గా కూర్చుంటుంది….. !!
అబ్బో నా అత్త మామూలుగా ఇవ్వట్లేదు గా పోజ్ 🙄😏 …. !! మహాన్ ను చూసినప్పుడే అనుకున్నా మా అత్త అందంగా ఉండి ఉంటుందని కానీ నాకు కాంపిటీషన్ ఇచ్చే రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు….. !! అని నందన ను చూస్తూ ఎదురుగా వచ్చి నుంచుని అ…. అత్తయ్య పిలిచారట అని వినయంగా అడుగుతున్న భూమి ను చూసి హ్మ్మ్!! అంటూ తన ముందున్న శారీస్ తీసి భూమి మీదకు విసురుతుంది…… !!
భూమి ఆ శారీస్ వైపు చూస్తూ చూడ్డానికి చాలా కాస్ట్లీ శారీస్ లా ఉన్నాయి…. !! ఇంత కాస్ట్లీ శారీస్ నాకు వద్దు అత్తయ్య…. !! పైగా మీరే చెప్పారు కదా నన్ను కాస్ట్లీ శారీస్ కట్టకని సో నాకు ఈ శారీస్ వద్దు అత్తయ్య….. !!
ఆపుతావా నీ మెలోడ్రామా అయినా నీ మొహానికి అంత కరీదైన శారీస్ అవసరమా …… ?? అంటూ వెటకారంగా నవ్వి అవి నీ కోసం అని నేను చెప్పానా ఏంటి ….. ?? నీ ఓన్ స్క్రిప్ట్ రెడీ చేయకుండా ఆ నోరు మూసి చెప్పేది విను ఆ శారీస్ చాలా కాస్ట్లీ….. !! నేను అర్జంట్ గా ఫంక్షన్ కి వెళ్ళాలి సో అన్నిటినీ నీట్ గా ఐరన్ చేసి తీసుకుని రా…. !! ఏ శారీ కట్టుకుంటానో ఐడియా లేదు కాబట్టి అన్ని ఐరన్ చెయ్……. !!
అత్తయ్య శారీస్ కి ఆల్రెడీ ఐరన్ చేసినట్టే ఉంది కావాలంటే చూడండి అని శారీస్ ను భూమి చూపిస్తూ ఉంటే నందన కోపంగా వాటిని లాక్కుని తన రెండు చేతులతో నలిపేసి ఫ్లోర్ మీద వేసి తొక్కుతూ ఇప్పుడు ఐరన్ లేదు కదా వెళ్ళి చెయ్ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్తున్న నందన ను చూసి భూమి సైడ్ స్మైల్ ఇస్తూ కింద పడ్డ శారీస్ తీసుకుంటూ ఉంటుంది….. !!
నేను చెప్పాను కదా భూమి నందన అమ్మ గారు ఇదంతా కావాలనే చేస్తున్నారు….. !! అంటూ నందన పైకి వెళ్ళడం చూసి రేణుక భూమి దగ్గరకు వస్తూ కింద పడ్డ శారీస్ ను తీస్తూ చెప్తుంది…. !!
భూమి కూడా చిన్నగా నవ్వి 10 నిమిషాలు ఆగక్కా ఈ శారీస్ నాకు ఐరన్ చేయడానికి ఎందుకు ఇచ్చానా అని నా అత్త బీపీ తెచ్చుకునేలా చేస్తాను….. ?? అని నవ్వుతూ చెప్పి శారీస్ తీసుకుని ఐరన్ చేయడానికి వెళ్తుంది…. !!
ఎమ్ చేయబోతోంది….. ?? అని భూమి వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది రేణుక…. !! భూమి తన చీర కొంగు ను నడుముకి దోపుకుంటూ అత్తా నన్ను ఈ ఇంటికి పని మనిషిని చేసేయాలని ఫిక్స్ అయ్యావా….. ?? నేను నీ కొడుకుతో తాళి కట్టించుకుంది ఈ ఇంటికి కోడలు అవ్వాలని కానీ పని మనిషి అవ్వడానికి కాదు….. !!
నా పేరు భూమి అయినా ఆ భూదేవికి ఉన్నంత ఓర్పు నాకు లేదు ఏదో కొత్త కదా అని ఊరికే ఉన్నాను….. !! నా ప్రేమను ఇవాళ కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటావ్ అని సర్దుకుంటుంటే నువ్వు ఇంకా ఇంకా రెచ్చిపోతున్నావ్ …. !! నీ రెక్కలు ఎలా విరవాలో నాకు బాగా తెలుసు అని నవ్వుకుంటూ ఐరన్ బాక్స్ తీసుకుని స్విచ్ ఆన్ చేసి అది ఓవర్ హీట్ అయ్యే వరకూ వెయిట్ చేసి….. !! ఐరన్ బాక్స్ నుండి వేడి వేడి సెగలు రావడం చూసి దాన్ని తీసుకుని నందన 10 లక్షల శారీ మీద పెట్టి తన నెయిల్స్ కి ఉన్న నెయిల్ పాలిష్ చూసుకుంటూ ఉంటుంది….. !!
ఇదేంటి ఏదో కాలుతున్న స్మెల్ వస్తుంది అని రేణుక ఫస్ట్ అది కిచెన్ నుండి వస్తున్న స్మెల్ అనుకుని కిచెన్ లోకి పరిగెత్తి అక్కడ స్టవ్ మీద ఏం లేకపోవడం చూసి అయితే స్మెల్ ఇక్కడ కాదా…. ?? మరెక్కడ అని ఆలోచిస్తూ కొంపదీసి భూమి అమ్మాయి గారికి శారీ ఐరన్ చేయడం రాక నందన అమ్మ గారి శారీ కాల్చేసిందా అని ఫాస్ట్ గా భూమి దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం చీర కాలిపోతూ ఉంటుంది….. !!
అయ్యో అయ్యయ్యో భూమి అంటూ ఫాస్ట్ గా వచ్చి ఐరన్ బాక్స్ స్విచ్ ఆఫ్ చేస్తున్న రేణుక ను ఆపుతూ అక్కా!! ఆగు ఎమ్ చేస్తున్నావ్….. ?? ఫస్ట్ కంగారు పడకు అంటూ రేణుక చెయ్ పట్టుకుని వెనక్కి లాగుతుంది….. !!
పిచ్చి కానీ పట్టిందా భూమి….. ?? అక్కడ చీర కాలిపోతూ ఉంటే స్విచ్ ఆఫ్ చేయకుండా బొమ్మ లా చూస్తున్నావ్ ఎందుకు….. ?? అసలే అది నందన అమ్మగారి చీర ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నిన్ను ఎమ్ చేస్తారో ఏంటో నాకు గుండె దడ దడగా ఉంది…. !!
అరే ఎందుకంత కంగారు….. !! నేను ఏమైనా కావాలని చేశానా ఏంటి….. ?? నాకు ఐరన్ చేయడానికి రాకపోయినా ఐరన్ చెయ్ అని చెప్పడం అత్తయ్య చేసిన మిస్టేక్ ఇందులో నా తప్పేం ఉంది చెప్పు…. !?
అయ్యో నీకు పరిస్థితి అర్థం కావడం లేదు ముందు నువ్వు తప్పుకో ఈ చీర నేనే ఐరన్ చేశానని చెప్తాను….. !! నన్ను అయితే ఒక దెబ్బ కొట్టి వదిలేస్తుంది అదే నిన్ను అయితే కావాలని టార్చర్ పెడతారు…. !!
నా వల్ల నువ్వు దెబ్బలు తినడం దేనికి అక్క ఆగు అంటూ అత్తయ్య…. అత్తయ్య అంటూ నందన కి వినిపించేలా అరిచి కిందకు పిలుస్తుంది….. !! భూమి నిన్ను చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి …. !! అసలు నేను చూస్తుంది నువ్వేనా భూమి ….. ?? లేదా ఏదైనా దెయ్యం నీ బాడీ లోకి కానీ వచ్చిందా….. ?? మార్నింగ్ దాకా అరిస్తే ఏడుస్తూ సైలెంట్ అయిపోయేదానివి ఇప్పుడేంటి మొత్తం రివర్స్ అయిపోయావ్…. ?? కొంచెం కూడా భయపడ్డం లేదు ఈ లోపు ఇంత మార్పు ఎలా….. ??
హహ 😅 అదా అక్క నీ డౌట్ నేను బై బర్త్ నే చాలా బ్రేవ్ & డేర్ గా ఉండే దాన్ని అక్క….. !! నేను పెరిగింది మా మావయ్య పెంపకం లో & ఆయన పెంపకం లో నేను, అన్నయ్య దేనికి & ఎవరికి భయపడకుండా పెరిగాం….. !! అలాంటి నేను అన్నిటికీ భయపడుతూ ఎలా పెరుగుతాను చెప్పు….. !! ఇదే నా ఒరిజినాలిటీ & ఇప్పుడు నువ్వు చూస్తున్నది అసలు భూమి ని అంటూ చిరు నవ్వుతో చెప్తుంది….. !!
రేణుక ఆనందం & ఆశ్చర్యంగా చూస్తూ భూమి చెయ్ పట్టుకుని…… !! మరి ఇంత ధైర్యంగా ఉండే నువ్వు వీళ్ళు అందరూ నిన్ను తిడుతూ & కొడుతూ ఉంటే ఎందుకు అన్నీ మౌనంగా భరించావ్ భూమి…… ?? నిన్ను ఒక్క రోజు లోనే వీళ్ళు పని మనిషిగా మార్చేశారు అయినా నువ్వు ఏడుస్తూ కూర్చున్నావ్ తప్పా ఎదురు మాట్లాడలేదు……. ??
అక్కా!! నువ్వు అడిగిన దానికి అన్సర్ చెప్పబోయే ముందు నీకో విషయం చెప్పనా నువ్వే కాదు నన్ను చూసి ఎవరైనా చాలా ఇన్నోసెంట్ అనుకుంటారు…… !! బట్ నేను చాలా డేరింగ్ గర్ల్ ఈ విషయం మావయ్య, రాజ్ కి తప్పా ఎవరికి తెలియదు….. !! నువ్వు అనుకోవచ్చు ఇంత డేరింగ్ గా ఉండే నువ్వు మహాన్ చేతిలో ఎలా మోసపోయానా అని…. ?? అవునా అంటూ రేణుక వైపు చూస్తుంది….. !!
ఎగ్జాక్ల్టీ రేణుక కూడా అదే అడగాలి అనుకోవడం తో అవును అంటూ హెడ్ మూవ్ చేయగానే భూమి చిన్నగా నవ్వి ప్రేమ ❤️ ఎంతటి వాళ్ళైనా ఎదిరించేలా & మోసపోయేలా చేస్తుంది…. !! నా విషయం లోనూ అదే జరిగింది మహాన్ ప్రేమలో పూర్తిగా పడ్డాను అందుకే మహాన్ నన్ను చీట్ చేస్తున్నాడు అని నోటీస్ చేయలేకపోయాను …. !!
నేను తెలుసుకునే సరికి మహాన్ నన్ను మోసం చేశాడు అని అనుకుంటున్నాడు కానీ మహాన్ నన్ను ట్రూ గా లవ్ చేశాడు అని తన హ్యాండ్ మీద ఉన్న టాటూ చూసిన ప్రతీ సారి అనిపిస్తుంది….. !! వాట్ ఎవర్ ఇప్పుడు నాకు నా ఫ్యూచర్ తో పాటు మావయ్య & అత్తయ్య ను కలపడం ఇంపార్టెంట్…. !! మహాన్ గురించి నిజాన్ని తెలుసుకుని లిటరల్లీ నేను షాక్ అయ్యాను….. !! దాని నుండి ఇపుడిపుడే బయట పడుతున్నా….. !!
అందుకే వీళ్ళు నన్ను కొట్టినా తిట్టినా భరించాను…. !! అయినా ఇప్పుడే కథ మొదలైంది నువ్వు చూడాల్సింది చాలా ఉంది అంటున్న భూమి ను చూసి రేణుక ఆనందంగా నవ్వుతూ భూమి ను హగ్ చేసుకోబోతూ ఉంటే అప్పుడే అక్కడికి నందన రావడం చూసి దూరం జరిగి నుంచుంటుంది…… !!
ఏయ్ ఎంటే నన్ను కిందకు పిలుస్తున్నావ్ బాగా ఇంట్లో పడి తిని కొవ్వు పట్టావ్ …… ?? శారీస్ ఐరన్ చేయడం ఫినిష్ అయితే పైకి నువ్వు తీసుకుని రావాలి కానీ నన్ను పిలవడం ఏంటి…. ?? అయినా నువ్వేంటి చెప్పిన వర్క్ ను ఇంత ఫాస్ట్ గా చేస్తున్నావ్ ఎక్కడ నా శారీస్….. ?? నీట్ గా చేయకపోయావో చచ్చావే నా చేతుల్లో అంటూ భూమి వైపు సీరియస్ లుక్స్ ఇస్తుంది…… !!
అత్తయ్య ఐ ఆమ్ సారి మీ శారీస్ అన్ని కాలిపోయాయి అని మొత్తం అన్ని శారీస్ సగానికి కాల్చేసి కుప్పగా నందన ముందు పడేస్తుంది…. !! వాటిని చూసిన నందన షాక్ అవుతూ వాట్…. !! ఏయ్ ఎలా కాలిపోయాయి అయినా ఒక సారి కాలిపోయాక అయినా వొళ్ళు దగ్గర పెట్టుకుని ఐరన్ చేయాలి కదా…. !! నిన్ను ఇలా కాదే అని కోపంగా భూమి ను కొట్టడానికి వచ్చిన నందన కి భూమి కావాలని కాలు అడ్డుగా పెట్టి నందన ను టేబుల్ మీద పడేలా చేసి పక్కకు తప్పుకుంటుంది….. !!
నందన సడెన్ గా అలా పడ్డం తో టేబుల్ మీద ఐరన్ బాక్స్ కి తన చెయ్ తగిలి కాలడం ఆన్ ది స్పాట్ చర్మం కాలి నందన గట్టిగా అరవడం జరుగుతాయి….. !! అమ్మా 😬 అని అరిచిన నందన అరుపుకి శ్లోక, దేవయాని పరుగున వచ్చి పైకి కిందకు మంటకు ఎగురుతున్న నందన ను చూసి ఏయ్ నట్టింట్లో ఈ డాన్స్ ఏంటి నందన అంటూ అరుస్తుంది దేవయాని….. !!
అమ్మమ్మ ఆది డాన్స్ లా లేదు అమ్మ దేనికో పెయిన్ ఫీల్ అవుతున్నట్టు ఉంది అని అంటున్న శ్లోక తో లేదు శ్లోక అత్తయ్య కొత్త స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటా…… !! అని ఇన్నోసెంట్ గా కళ్ళు రెప రెప లాడిస్తూ చెప్తున్న భూమి ను చూసి నిన్ను 😬 అంటూ భూమి మీదకు వెళ్తున్న నందన ను ఆపి ….. !! నందన ఇప్పటికే చాలా చేసావ్ ఇక ఆపు నోరు మూసి పైకి వెళ్ళు అనగానే నందన భూమి వైపు సీరియస్ గా చూస్తూ కాలిన చెయ్ ను చూసి ఉఫ్… ఉఫ్ అని ఊదుకుంటూ తన రూమ్ కి వెళ్ళడం చూసి భూమి పెదాలను రౌండ్ గా చుట్టి నవ్వుతూ తల పైకి ఎత్తి తన వైపు కోపంగా చూస్తూ వెళ్తున్న నందన ను కన్ను కొడుతూ నవ్వుతుంది…. !!
ఏయ్ నువ్వేంటి లోపలికి వచ్చావ్ ఫస్ట్ పో బయటకు అని భూమి ను బయటకు నెట్టగానే అప్పటీకే 6;30 అవ్వటం వల్ల ముసురుతున్న చీకట్ల ను చూసి ఈవెనింగ్ అవుతుంది కదా శ్లోక లైట్ అన్ చెయ్ నేను ఒంటరిగా గార్డెన్ లో ఉండాలి అంటే నాకు భయం ఒక్క లైట్ అయినా ఉండాలి ప్లీస్ ఆన్ చేయవా…… !!
గార్డెన్ లో లైట్ నే కాదు బయట ఉన్న ఒక్క లైట్ కూడా వర్క్ చేయటం లేదు ….. !! ఈవెన్ మన స్ట్రీట్ లైట్ కూడా సో ఎలక్ట్రీషియన్ ఇవాళ రాలేడట….. !! కాబట్టీ ఇవాళ ఇక్కడ ఏ లైట్ వెలగదు ….. !! అంటూ స్టైల్ గా చాక్లెట్ తింటూ తన యాపిల్ ఎయిర్ పొడ్స్ ను చెవిలో పెట్టుకుంటు చెప్తున్న శ్లోక ను చూసి ఓహ్ ఇది మీ ప్లాన్ ఆ…. ??
ఆల్ ఆఫ్ సడెన్ ఇలా ఏ లైట్స్ వర్క్ చేయకపోవడం ఎన్టీ శ్లోక …… ?? మరి ఇంట్లో ఎలా వర్క్ అవుతున్నాయి ….. ?? అంటూ ఇంట్లో వెలుగుతున్న లైట్స్ వైపు చూస్తూ సూటీగా అడుగుతుంది ….. !!
అది నాకెలా తెలుస్తుంది పోయి ఎలక్ట్రీషియన్ ను అడుగు 😏 …… !! ఏయ్ నువ్వేంటి సినిమా చూస్తున్నావా వెల్లు వెళ్ళి నీ పని చూసుకో అంటూ రేణుక ను పంపించి కావాలనే భూమి ముందు కూర్చుని చాక్లెట్ తింటూ వావ్ ఈ చాక్లెట్ బలే ఉంది అంటూ సౌండ్స్ చేస్తూ తింటూ ఉంటుంది….. !!
శ్లోక ముందు కావాలనే భూమి బయపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ప్లీస్ శ్లోక నాకు భయంగా ఉంది ఎట్లిస్ట్ క్యాండిల్ అయినా ఇవ్వు అని అడుగుతూ ఉంటే …… !!
భూమి కన్నీళ్ళు చూసిన శ్లోక భూమి నిజంగా భయపడుతుంది ……. !! అని నవ్వుకుంటూ భూమి చూడకుండా పిక్ తీసి రాజ్ కి సెండ్ చేసి లుక్ ఎట్ యువర్ బ్యూటిఫుల్ సిస్టర్ అని మెసేజ్ సెండ్ చేసి నవ్వుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోతుంది …… !!
ఆఫీస్ నుండి అప్పుడే ఇంటికి వచ్చిన మహాన్ ఇంటి బయిట, లోపల ఒక్క లైట్ కూడా లేకపోవడం చూసి ఏమైంది ఒక్క లైట్ కూడా అన్ చేయలేదు….. ?? అని లోపలికీ వెళ్తూ గార్డెన్ లో ఫ్లాష్ లైట్ వెలుగుతూ కనిపించే సరికి అటుగా నడుస్తాడు …… !!
భూమి గురించే అలోచిస్తూ బాధ పడుతున్న మానస ను చూసిన అనసూయ మానస బాధ పడకు దేవయాని కి చెప్పాను కదా…… !! తను భూమి ను తీసుకుని తప్పకుండా గుడికి తీసుకుని వస్తానని చెప్పింది…… !! రేపే మనం భూమి ను టెంపుల్ లో కలుద్దాం …… !! ముందెళ్ళీ నువ్వు రాజ్ కి టిఫిన్ పెట్టు ఎప్పుడూ తిన్నాడో ఎంటో …… ?? అసలే భూమి విషయం లో చాలా కోపంగా వున్నాడు ….. !!
చూస్తూంటే నువ్వు చెప్పినట్టు పెద్ద వాళ్ళ గొడవలు పిల్లల దాకా వెళ్లేలా ఉన్నాయి …… !! రాజ్ మహాన్ మీద చాలా కోపంగా వున్నాడు & వాడికి అర్యమయ్యేలా కొంచెం మెల్లగానే చెప్పు …… !! అని కూతుర్ని మనవడి రూమ్ లోకి పంపి ఎలా ఈ సమస్య అంతం అవుతుంది అని అలోచిస్తూ హాల్ లో నే ఉంటుంది అనసూయ …… !!
రాజ్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్లేట్ లో పెట్టుకొని రూమ్ లోకి వెళ్ళిన మానస కి అపుడే ఫ్రెష్ అయి యూనిఫారం వేసుకుంటున్న రాజ్ కనిపిస్తాడు …… !! రాజ్ ను అలా చూసి అదేంట్రా అప్పుడే యూనిఫామ్ వేసుకుంటున్నావ్ ….. ?? నువ్వు ఇప్పుడే కదా వచ్చావ్ ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు వెళ్ళచ్చు కదా స్టేషన్ కి …… !! నిన్ను చూస్తూంటే నైట్ అంతా స్లీప్ లెస్ గా ఉన్నట్టు కనిపిస్తున్నావ్ …… ?? కాసేపూ పడుకో నాన్న అంటూ ప్రేమగా రాజ్ బుగ్గ నిమురుతూ చెప్తుంది …… !!
లేదమ్మా స్టేషన్ లో నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది …… !! పైగా ఇప్పుడున్న కోపం లో ఇంట్లో నే కాళిగా ఉంటే ఆ మహాన్ నే గుర్తొచ్చి నా కోపాన్ని మరింత పెంచుతున్నాడు ……. !! అదే స్టేషన్ కి వెళ్తే అయినా కొంచెం లో కొంచెం నా మూడ్ డైవర్ట్ అవుతుంది …… !!
రాజ్ ఇప్పుడు మహాన్ నీకు బావ మాత్రమే కాదు రా నీ చెల్లి భర్త కూడా ……. !! నువ్వెప్పుడు నీ బావా మంచి కోరాలే కానీ తన పంతం కోరుకూడదు అది అల్లుడి గారి కి అసలు మంచిది కాదు …… !!
అమ్మా అని సీరియస్ గా చూస్తూ ఇక చాలు ఆపు అంటూ మానస చేతిలో ఉన్న ప్లేట్ ను దూరంగా విసిరి కొట్టి ……. !! ఎవరు హా!! ఎవడు అల్లుడు?? హా ఎవడు ….. ?? వాడా ఛీ !! వాడు నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు …. !! అలాంటి వాడ్ని నా ప్రాణానికి ప్రాణం అయిన భూమి లైఫ్ లో ఎలా ఉండనిస్తాని అనుకున్నావ్ …… ?? ప్రాణం పోయినా వాడు భూమి జీవితం లో ఉండడానికి నేను ఒప్పుకోను….. !!
భూమిని వంటిరిగా అక్కడ వదిలి వచ్చింది తన బాధ చూడలేక …… !! కేవలం తనకు ఇచ్చిన టైమ్ వరకూ మాత్రమే భూమి అక్కడే ఉంటుంది ….. !! అది అయ్యాక మావయ్యా ఆవిడ తో కలిసినా కలవక పోయినా భూమి మన ఇంట్లో ఉంటుంది …… !! ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా జరిగేది ఇదే అంటూ స్థిరంగా చెప్తాడు ……. !! భూమి ఇక్కడికి వచ్చిన మరు క్షణం తనకు అంగరంగ వైభవంగా నేను పెళ్లి జరిపిస్తాను అంతే కానీ ఆ మహాన్ మీద ఆశలు పెట్టుకొని అల్లుడు, గిల్లుడు అని వరసలు పెట్టి పిలవకు అంటూ సీరియస్ గా చూస్తూ చెప్తాడు…… !!
ఎమ్ మాట్లాడుతున్నావ్ రాజ్ …… ?? భూమి ను ఒంటిరిగా ఇంట్లో ఎన్ని రోజులని పెట్టుకుంటావ్ …… !! తనకు ఇప్పుడు పెళ్లి జరిగింది & తను తన భర్త తో ఉంటేనే గౌరవం ఆది భూమి కే కాదు మనకు కూడా అంతే గౌరవం …… !!
అమ్మ వాడు అసలు భూమి ను మనిషిలా కూడా ట్రీట్ చెయ్యడం లేదు ….. !! అలాంటి వాడి దగ్గర భూమి వుంటే మనకి గౌరవమా …… ?? అయితే చెప్తున్నా విను అక్కర్లేదు ….. !! నాకు అలాంటి గౌరవం లేకపోయినా నష్టం లేదు …… !! నా చెల్లీ నా ఇంట్లో నే మహా రాణి లా ఉంటుంది నాకు ఆ సంతోషం చాలు ……. !! అయినా భూమి వంటరిగా ఇక్కడే ఎందుకు ఉంటుంది …… !! వాడి బాబు ( కార్తికేయ గుర్తొచ్చి ఆగిపోతాడు) సారి అదే వాడి కంటే గొప్ప వ్యక్తి ను తెచ్చి నా చెల్లికి ఘనంగా నేను పెళ్లి జరిపిస్తా ……. !! అంటూ కోపంగా తన మొబైల్ తీసుకొని చేతిలో క్యాప్ పట్టుకుని తినకుండా కోపంగా స్టేషన్ కి వెళ్తున్న కొడుకు ను కన్నీళ్ళతో చూస్తూ ఉంటుంది మానస…….. !!
ఇంకా ఉంది
శ్లోక కి రాజ్ చేతిలో బడిత పూజ జరగబోతుంది అని నా సిక్త్ సెన్స్ చెప్తోంది 😁🤭 …… !! పాపం అత్తకి బాగా కాలినట్టు ఉంది….. !! గార్డెన్ లో ఎలా చీకట్లో కూర్చున్న భూమి ను చూసి మహాన్ లో ఏమైనా మార్పు రానుందా…. ?? రాజ్ ఇప్పుడు ఎమ్ చేయబోతున్నాడు…. ?? నందన భూమి ను ఎమ్ చేయబోతోంది….. ?? భూమి మహాన్ ను మార్చగలదా ….. ??