Tag line – ద్వేషం తో మొదలైన ప్రయాణం ప్రేమతో ముగిసింది ♥️☺️
హైదరాబాద్
లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం
టైమ్ ఉదయం 10 గంటలు
గుడిలో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు ఆన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతు ఉన్నాయి పంతులు గారు చెప్పినవన్నీ తెచ్చి ఆయన ముందు పెడుతూ ఉన్నారు పెళ్లి కొడుకు స్నేహితులు …… బాబు !! ఆన్ని వచ్చాయి ఒక్క మంగళ సూత్రం తప్పా అది కూడా తెస్తే ఇక అన్ని వచ్చినట్టే అని చెప్తున్న పంతులు మాట పూర్తి అవ్వక ముందే ఆయన ముందు మంగళ సూత్రం పెడతాడు పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్ హనీష్ అది తీసుకుని పంతులు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసి ఆన్ని వచ్చాయి కానీ పెళ్లి కొడుకు ఎక్కడ అంటూ హనీష్ వైపు చూస్తాడు పురోహితుడు……. గుడి చుట్టూ చూస్తు ఉన్న హనీష్ కు ఎదురుగా వస్తూ కనిపిస్తున్న వ్యక్తిని చూసి పెదవులు సన్నగా విచ్చుకుని అదిగొండి పంతులు గారు పెళ్ళికొడుకు వస్తున్నాడు అని నవ్వుతూ చెప్పగానే పంతులు హనీష్ చెప్పిన వైపు చూస్తాడు ……
వైట్ కలర్ షర్ట్ విత్ వైట్ దోతి లో రఫ్ బీర్డ్ స్ట్రాంగ్ ఫిజిక్ తో చిరుత లాంటి చూపులతో నడకలో రాయల్టీ మెయిన్ టెయిన్ చేస్తూ ఆరడుగుల అందగాడు నడుస్తూ వస్తూ కనిపిస్తాడు …… అబ్బా అబ్బాయి అండగాడే అని పెళ్లి కొడుకు దగ్గరకు రాగానే చూడడానికి రాజకుమారుడిలా ఉన్నారు పైగా గొప్పింటి బిడ్డ లా వున్నారు ఇలా సింపుల్ గా ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నారో తెలుసుకోవచ్చా నాయనా!?
పెళ్ళికొడుకు కళ్లకు ఉన్న గాగుల్స్ తీసి హనీష్ కి ఇస్తూ చూడు పంతులు నీ పని పెళ్లి జరిపించడం సో వచ్చామా పెళ్లి జరిపించామా సంభావన పుచ్చుకుని వెళ్లిపోయామ అన్నట్టు ఉండాలి…..!! అనవసరంగా నా గురించి తెలుసుకోవాలి అని ట్రై చేయకు బూమ్మిదా బతికుండాలి అంటే చెప్పిన పని పూర్తి చేసి వెళ్ళిపో అని గంభీరంగా వినిపిస్తున్న పెళ్లి కొడుకు స్వరానికి భయపడుతూ నాకెందుకు వచ్చిన గొడవ నాకు రావాల్సిన డబ్బులు వస్తే చాలని ఇన్నర్ వేసుకుని ఆలాగే బాబు ముందు మీరొచ్చి ఇలా కూర్చుంటే కార్యక్రమం మొదలు పెడతాను ……
పెళ్లికొడుకు హనీష్ వైపు చూడగానే తన చేతిలోని బాసికాన్ని పెళ్లి కొడుకు నుదుటన కట్టి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన చుక్క పెట్టాక పర్ఫెక్ట్ అని చెప్పగానే పెళ్లి కొడుకు వెళ్ళి పంతులు చెప్పిన చోట కూర్చుని పూజ చేస్తూ ఉంటాడు పంతులు చదవాల్సిన మంత్రాలు ఆన్ని చదివాక అయ్యా పెళ్ళి కూతుర్ని పీలిపించండి అనగానే మాహాన్ (మన హీరో గారి పేరు ☺️♥️) హనిష్ వైపు చూస్తాడు ……
చాలా సేపటి నుండి కాల్ ట్రై చేస్తున్నా మహాన్ భూమి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని మహాన్ చూపుల్లో వేడికి భయపడుతూ చెప్పగానే మహాన్ కోపంగా పిడికిలి బిగించి తన మొబైల్ తీసి ఒక నంబర్ కి కాల్ చేస్తాడు……. 3 రింగ్స్ తర్వాత అటు వైపు వ్యక్తీ కాల్ లిఫ్ట్ చేసి తియ్యని స్వరం తో మహాన్ అని పిలవగానే అప్పటి వరకు ఉన్న కోపం దూది పింజ లా ఎగిరిపోయి పెదవులు సన్నగా విచ్చుకుని అందమైన చిరునవ్వు వచ్చి చేరుతుంది …….
ఇతగాడికి నవ్వడం కూడా వచ్చా ఇప్పటి వరకు కోపంతో ఎర్రబడ్డ మొహం సడెన్ గా నవ్వడం తో పంతులు అశ్చర్యంగా మహాన్ వైపు చూస్తూ ఉంటాడు పురోహితుడు……
భూమి ఎక్కడున్నావ్…..?? ముహూర్తం కి టైమ్ అవుతోంది కమ్ ఫాస్ట్ అంటూ వీలైనంత సౌమ్యంగా మాట్లాడుతున్న మహాన్ ను చూసి పంతులు కల్లు పెద్దవి చేసి మరీ చూస్తాడు
వచ్చేస్తున్నా మహాన్ గుడి ముందే ఉన్నాను నాకెందుకో చాలా భయంగా ఉంది మహాన్ మావయ్య ఊర్లో లేనప్పుడు ఆయనకి తెలియకుండా మ్యారేజ్ చేసుకోవడం నాకు నచ్చడం లేదు……. మావయ్య వచ్చాక ఆయనను ఒప్పించి పెళ్లి చేసుకుంటే బావుంటుంది అనిపిస్తుంది అని గొంతు తడారిపోతుంటే మొబైల్ ను గట్టిగా పట్టుకుని భయంగా చెప్తుంది …..
భూమి మాటలు విన్న మహాన్ కళ్లు ఎరుపెక్కి పిడికిలి బలంగా బిగుసుకుంటుంది …… పల్లు బిగపట్టి తన మాటలు విన్న తర్వాత తన ఫీలింగ్స్ భూమి కి తెలియనివ్వకుండా లిసన్ భూమి మీ మావయ్య కి ఈ విషయం తెలిస్తే మన పెళ్ళికి ఈ జన్మలో ఒప్పుకోరు …….. అందుకే ఆయన ఊర్లో లేని టైమ్ లో మన మ్యారేజ్ ఫిక్స్ చేశాను పెళ్లి తర్వాత ఆయనను ఎలా అయినా ఒప్పించే బాధ్యత నాది ……..
అయినా ఈ పెళ్లి చేసుకుంటుంది మన ప్రేమను గెలిపించుకోవడానికి మాత్రమే కాదు విడిపోయినా మీ మావయ్య & మా మామ్ ను కలపడానికి కూడా నీ మవయ్యే మా నాన్న ( నాన్న అంటున్నప్పుడు మహాన్ కళ్ళు ఎరుపు వర్ణం లో మరి పల్లు కొరుకుతూ చెప్తాడు) అని మర్చిపోకు…… వాళ్ళు కలుసుకోవడం నీకు ఇష్టం లేకపోతే వెనక్కి వెళ్ళిపో అని కాల్ కట్ చేసి మీరు కానివ్వండి పెళ్ళి కూతురు వస్తుంది అని కళ్లు ముసుకోగానే…….!!
అందరు మహాన్ అంత ధైర్యంగా ఎలా చెప్తున్నాడో అర్తం అవ్వక షాకింగ్ గా చూస్తూంటే మహాన్ చెప్పినట్టే అయిదు నిమిషాల్లో గ్రీన్ కలర్ పట్టు చీర లో బంగారు బొమ్మ లా ఉన్న భూమి పరిగెత్తుకుంటూ వచ్చి మహాన్ పక్కన పీటల మీద కూర్చుంటుంది …….
భూమి రావడం చూసి మహాన్ కళ్లు తెరచి శాడిస్టిక్ స్మైల్ ఇస్తూ తన వైపే అశ్చర్యంగా చూస్తున్న పంతులు ను చూసి నన్ను చూసింది చాలు ఇక పెళ్లి జరిపించు అని గట్టిగా చెప్పడం తో పంతులు త్వరత్వరగా మంత్రాలు ఫాస్ట్ గా చదువుతూ జిలకర బెల్లం పెట్టివ్వగానే మంగళ సూత్రం మహాన్ కు అందిస్తూ నాయన అమ్మాయి మెడలో మంగళ సూత్రం కట్టండి అని చెప్పగానే మహాన్ ఆ తాళి వైపు తల వంచుకుని సిగ్గు పడుతున్న భూమి వైపు చూసి సైడ్ స్మైల్ ఇస్తూ హనీష్ వైపు చూస్తాడు ఆఖరి సారిగా ఒక్క సారి ఆలోచించురా అన్నట్టు చూస్తూన్న హనీష్ ను చూసి నవ్వుతూ భూమి మెడలో మూడు ముళ్లు వేసి తన అర్ధాంగి గా చేసుకుని తన పక్కన కూర్చుంటాడు …….
గుడిలో పెళ్లి కార్యక్రమాలు ఆన్ని పూర్తయ్యాక పంతులు కి ఇవ్వాల్సిన సంబావన అందించాక భూమి ఆయన ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్తున్నా వినకుండా తనను లాక్కొచ్చి కార్ లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటున్న మహాన్ కి తన కన్న తండ్రి అలియాస్ భూమి మావయ్య అయిన కార్తికేయ మిశ్ర కి తన పెళ్లి విషయం తెలిసింది అని తెలుసుకొని సైడ్ స్మైల్ ఇచ్చి కాసేపు సిరియస్ గా కాల్ మాట్లాడాక కార్ ను స్టార్ట్ చేసి తన ఇంటి పార్టీకోలో కార్ ఆపుతాడు ……
మహాన్ వైపు టెన్షన్ గా చూస్తూ నాకు భయంగా ఉంది మహాన్ అత్తయ్యా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఎంటో అని టెన్షన్ పడుతున్న భూమి ను చూసి డోంట్ వర్రీ ఆన్ని నేను చూసుకుంటాను అంటూ కార్ దిగి భూమి వైపు కార్ డోర్ ఓపెన్ చేయగానే తన కొత్త జీవితం మీద కోటి ఆశలతో నవ్వుతూ కార్ దిగి మహాన్ చెయ్ పట్టుకుని గుమ్మంలో నిలబడుతుంది ……
మెడలో పూల దండలతో పెళ్లి చేసుకుని వచ్చిన మనవడిని చూసిన దేవయాని షాక్ అయ్యి చేతిలోని ప్లేట్ పడేసి నందన…..నందన అంటూ కూతురిని ఏమండీ…ఏమండీ అంటూ తన భర్త విజయేంద్రప్రసాద్ ను కంగారుగా పిలుస్తుంది ……
దేవయాని అరుపులకి ఇంట్లో వున్న పనివాల్లతో సహా విజయేంద్రప్రసాద్,నందన తన కూతురు శ్లోక కూడా హాల్ లోకి వచ్చి చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకుని వచ్చిన మహాన్ ను తన పక్కనే అపరంజి బొమ్మ లా ఉన్న భూమి ను చూసి షాక్ అవుతారు
మహాన్ ఎన్టీ నువ్వు చేసిన పని ఆ ఇంటికీ ఈ ఇంటికి రాకపోకలు లేవు అని తెలిసి కూడా ఎందుకు మాకు ఎవరికి తెలియకుండా భూమి ను పెళ్లి చేసుకున్నావ్ అంటూ కోపంగా మనవడిని నిలదీస్తుంది దేవయాని
దేవయాని కోపానికి భయపడుతూ మహాన్ చెయ్ గట్టిగా పట్టుకొని భయంగా అందరినీ చూస్తున్న భూమి వైపు ఓ సారి సూటిగా చూసి తిరిగి తన అమ్మమ్మ వైపు చూసి మీకు తెలియకుండా మ్యారేజ్ చేసుకోవడం తప్పే అమ్మమ్మ బట్ తప్పని పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది నన్ను క్షమించు అమ్మమ్మ దయచేసి మమ్మల్ని లోపలికి రానివ్వండి ……
ఎమ్ మాట్లాడుతున్నావ్ మహాన్ నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా ఈ విషయం కార్తికేయ కి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో ఆలోచించావా ఎందుకురా ఇంత తొందర పడ్డావ్ … ??
అమ్మా చాలు నా కొడుకు పెళ్లి వద్దు అనడానికి అతను ఎవరు ఈ పెళ్లికి నేను నా మనస్పూర్తిగా ఒప్పుకుంటున్నా నా కొడుకు తనకు నచ్చిన అమ్మాయి ను పెళ్లి చేసుకుని వచ్చాడు… వాడి పెళ్ళి వాడిష్టం అదంతా కాదు ముందు వెళ్ళి హారతి ప్లేట్ తీసుకుని రా నా కొడుకు కోడలికి దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్పాలి అని నవ్వుతూ చెప్తున్న నందన ను చూసి భూమి సంతోషంగా మహాన్ చెయ్ పట్టుకుని నవ్వుతూ చూస్తుంది …
నందన అది కాదమ్మా ఈ విషయం అల్లుడి గారికి తెలిస్తే …..??
అల్లుడు కాదు మిస్టర్ కార్తికేయ మిశ్ర అంతే అతనికి ఈ ఇంటికీ ఎటువంటి సంబంధం లేదు మరో సారి వరస పెట్టి పిలవకు అని సీరియస్ గా చూస్తూ ముందెళ్ళి హారతి తీసుకురా అని చెప్పగానే దేవయాని ఇంకేం చెప్పినా కూతురు కన్విన్స్ అవ్వదు అని కిచెన్ లోకి వెళ్లి హారతి ప్లేట్ తీసుకుని ఇద్దరికీ హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి రమ్మని చెప్పగానే భూమి కుడికాలు ముందు పెడుతూ మహాన్ భార్యగా ఆ ఇంట్లో మొదటి అడుగు సంతోషంగా పెడుతుంది
ముందుగా భూమి తో దేవుడి గది లో దీపం వెలిగించాక భూమి మహాన్ తో కలిసి విజయేద్రప్రసాద్, దేవయాని దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తరువాత నందన కాళ్ళకు నమస్కరించగానే నందన నవ్వూతూ ఇద్దరినీ పైకి లేపి మహాన్ వైపు చూస్తూ భూమి ను లాగి పెట్టీ కొట్టగానే భూమి ఆ ఫోర్స్ కి వెళ్లి రెండు అడుగుల దూరంలో పడుతుంది
కింద పడ్డ భూమి చంప మీద చెయ్ పెట్టుకొని కన్నీళ్ళతో నందన వైపు భయంగా చూస్తు ఉంటుంది నందన భూమి ముందు నిల్చొని తన బుగ్గలు పట్టుకుని పైకీ లేపి ఎంటే అలా చూస్తున్నావ్ ఇప్పటిదాకా నవ్వూతూ ఉన్న నేను ఎందుకు కొట్టానా అనా నిన్ను నా కొడుకు పెళ్లి చేసుకుంది నీ మీద ప్రేమ తో కాదు నీ మీద పగ తో నా కొడుకు కు నీ మీద ఉంది పగ మాత్రమే ప్రేమ కాదు అని చెప్పగానే భూమి షాక్ అవుతూ మహాన్ వైపు చూస్తుంది ఎప్పుడూ తన వైపు ప్రేమగా చూసే మహాన్ కళ్లు ఇప్పుడు నిప్పులు కురిపిస్తూ చూస్తూంటే భూమి తను మోసపోయింది అని గ్రహించి నిలువెల్లా వణికిపోతూ ఉంటుంది ……
మహాన్ భూమి జుట్టు పట్టుకొని లాగుతూ ఇన్నాళ్లు నీ మీద ప్రేమ ఉన్నట్టు నటించింది ఈ రోజు కోసమే భూమి నిన్ను పెళ్ళి చేసుకుంది నిన్ను అడ్డుపెట్టుకుని మీ మావయ్య మీద పంతం నీ మీద పగ తీర్చుకోవడానికి తప్పా నీ మీద ప్రేమతో కాదు …… రైట్ నౌ నువ్వు ఈ ఇంటి పని మనిషివి తప్పా ఈ ఇంటి కొడలివి ఎప్పటికీ కాలేవు అంటూ విసురుగా తనను వెనక్కు తోసి మెడలో ఉన్న పూల దండ నుదుటన కట్టిన బాసికం భూమి మోహన విసిరి కొట్టి కోపంగా తన రూమ్ కి వెళ్ళిపోతాడు ……. క్షణం లో కూలిపోయిన తన అందమైన జీవితాన్ని తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తు ఉంటుంది భూమి ……….