శ్లోక అలా నోటి దగ్గర ముద్దను నెట్టేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని భూమి షాక్ అయ్యి పైకీ లేచి శ్లోక ఎమ్ చేస్తున్నావ్ ……. ?? తినే ముద్దను అలా నేట్టేయడం ఎంత తప్పో తెలుసా అంటూ శ్లోక వైపు సిరియస్ గా చూస్తూ చెప్తుంది ……. !! హేయ్ డోంట్ డేర్ టు షౌట్ ఓకే మామ్ చెప్పింది కదా ……. !! నువ్వు మా ఇంటికొచ్చిన పనిమనిషని ఆఫ్ట్రాల్ పని మనిషివి నా మీదే వాయిస్ రైస్ చేస్తావా …… హౌ డేర్ యూ!! మర్యాదగా నాకు సారి చెప్పు లేకపోతే మా మామ్ తో చెప్పి ఇంటి బయట పడుకునేలా చేస్తాను …… !! యూ నో మామ్ కి నేనంటే చాలా ఇష్టం సో నేనేం చెప్పినా చేస్తుంది ……. !! సో చాయిస్ ఈస్ యూర్స్ అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని భూమి వైపు చూస్తూ వెటకారంగా నవ్వుతుంది…… !!
శ్లోక తో అర్గ్యూ చేసే ఓపిక లేక సారి అని శ్లోక వైపు చూస్తూ చెప్పగానే శ్లోక పొగరుగా నవ్వుతూ గుడ్ నీ లిమిట్స్ లో నువ్వుంటేనే ఇక్కడ హ్యాపీగా ఉంటావ్ …… !! కాదని క్రాస్ చేస్తే ఇంటి బయట ఉంటావ్ గుర్తు పెట్టుకో & నువ్వు కూర్చుని తినాల్సింది ఇక్కడ కాదు ……. !! పనిమనుషులు ఫ్లోర్ మీద కూర్చుని తింటారు సో నువ్వూ వాళ్ళతో పాటే కూర్చుని తిను ……. !! అంటూ టేబుల్ మీద వున్న ప్లేట్ తీసి భూమి చేతికి ఇచ్చి వెల్లి ఆ మూల కూర్చుని తిను ……. !! అని గదమగానే భూమి ఎమ్ మాట్లాడకుండా ఫ్లోర్ మీద కూర్చుని ప్లేట్ ఒళ్ళో పెట్టుకొని కన్నీళ్లు వస్తూ ఉంటే కష్టంగా ఒక ముద్ద తిని హ్యాండ్ వాష్ చేసుకుని కిచెన్ లోకి ఏడుస్తూ వెళ్ళిపోతుంది …… !! అది చూసిన శ్లోక నవ్వుకుంటూ హాల్ లోకి వెళ్తుంది …… !!
డిన్నర్ కి రా చిట్టి తల్లీ నీ కోసమే అందరం వెయిట్ చేస్తున్నాం …… !! అని భూమి ను పిలవడానికి తన రూమ్ కి వచ్చిన అనసూయ ను చూసిన భూమి మహాన్ తో చాట్ కట్ చేస్తుంది …… !! బెడ్ మీద నుంచి లేస్తూ అయ్యో నానమ్మ నువ్వెందుకు పైకీ వచ్చావ్ …… ?? మెయిడ్ తో చెప్పి పంపించచ్చు కదా ……. !! నీకు అసలే కాళ్ళు నొప్పులు పదా లిఫ్ట్ లో వెళ్దాం …… !! అంటూ అనసూయ ను తీసుకొని లిఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ కి వస్తుంది ……. !!
డాక్టర్ లిఫ్ట్ ఎక్కువ యూస్ చేయకుండా నడిస్తే ఆరోగ్యానికి మంచిది అన్నారు చిట్టి తల్లీ…. !!
ఆయన ఆలాగే చెప్తారు కానీ నువ్వు పైకీ రావాలంటే లిఫ్ట్ లోనే రావాలి లేకపోతే నేను ఊరుకోను చెప్తున్నా ఇన్ని స్టెప్స్ ఎక్కితే మళ్ళీ పెయిన్స్ వస్తాయి….. !!
హహ సరే సరే ఆలాగే వస్తాను కానీ పదా అని భూమి ను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకు వెళ్ళేసరికి ……. !! అందరు భూమి కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తారు …… !! అది చూసిన భూమి అయ్యో మావయ్య నా కోసం వెయిట్ చేయకండి ఎన్ని సార్లు చెప్పినా వినరు కదా …… !! అంటూ కార్తికేయ పక్కన కూర్చుంటూ చిరు కోపంగా చూస్తుంది …… !!
నువ్వు లేకుండా మేము ఎలా తింటాం చిట్టి తల్లీ……. !! లేట్ అయినా పర్లేదు నాకు నీతో కలసి తినడమే ఇష్టం…… !! అని కుక్ వైపు చూడగానే కుక్ అందరికి డిన్నర్ సర్వ్ చేస్తు ఉంటుంది …… !! తనకి ఇష్టమైన మష్రుమ్ బిర్యానీ ను చూసి భూమి కి నోట్లో లాలాజలం ఊరుతుంది ….. !! వెంటనే ఒక ముద్ద చేతిలోకి తీసుకుని స్మెల్ చూసి హ్మ్మ్ …. !! స్మెల్స్ గుడ్ అని నవ్వుతూ నోట్లో పెట్టుకోబోతుండగా అది కాస్త రాజ్ తన నోట్లో పెట్టుకొని వావ్ సూపర్ అంటూ భూమి వైపు చూసి కన్ను కొట్టి నవ్వుతాడు…… !!
నీ ప్లేట్ లో ఫుడ్ తినకుండా ఎందుకు రా ?? ఎప్పుడూ నా ప్లేట్ లో నేను తినే ముద్దే తీసుకొని తింటావ్ …… !! అంటూ రాజ్ బుజం గిచ్చుతూ కోపంగా అడుగుతుంది …… !!
అబ్బా రాక్షసి వదలవే అంటూ బుజం రుద్దుకుంటూ నీ చేత్తో ఫస్ట్ తింటేనే నాకు నచ్చుతుంది …… !! అందుకే ఇంట్లో ఉంటే ఫస్ట్ నీ చేత్తోనే తింటాను ….. !! కానీ నోరు తెరువు ఫస్ట్ అంటూ భూమి కి తినిపించి తను తింటూ ఉంటాడు …… !!
భూమి నవ్వుతూ ఆ ముద్ద తింటూ ఉండగా కార్తికేయ, మానస, అనసూయ ఇలా అందరు కూడా చెరో ముద్ద భూమి కి పెడుతూ ఈ ఇంట్లో ఫస్ట్ ముద్ద నువ్వు తిన్నాకే మేము తింటాము…… !! ఎందుకంటే నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి …… !! అని కార్తికేయ భూమి కి కొసరి కొసరి తినిపించడం గుర్తు రాగానే గతాన్ని తలచుకుని భూమి కళ్లు వర్షించే మేఘంలా మారతాయి …… !!
తన మొబైల్ లో రీల్స్ చూస్తూ నందన తో మాట్లాడుతున్న శ్లోక కి దేవయాని డిన్నర్ చేసి రూమ్ లోకి వెళ్లడం చూసి మామ్ ఇందాక డైనింగ్ ఏరియా లో అంటూ జరిగింది చెప్పి నవ్వగానే …… !! నందన కూడా నవ్వి గుడ్ దానికి ఆలాగే ట్రీట్మెంట్ ఇవ్వాలి లేకపోతే మనతో పాటు సమానంగా కూర్చుంటుందా …… !! దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి & అది ప్రతీక్షణం నా కళ్ళ ముందు ఎడవాలి అది చూసి కార్తికేయ కంట్లో నీళ్ళు కాదు రక్తం రావాలి…… !! అని కోపంగా చెప్పి మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది …… !!
భూమి ను అలా చూసిన రేణుక బాధగా బుజం మీద చెయ్ వేయగానే భూమి తన కన్నీళ్లు కనిపించకుండా తుడుచుకుని ఐ యాం ఒకే అక్క వెళ్ళి నువ్వు వెళ్ళి తిను అంటూ రేణుక వద్దు నేను వాష్ చేస్తాను అని చెప్పినా వినిపించుకోకుండా హ్యాండ్ ఎంత నొప్పిగా ఉన్నా సింక్ లో వున్న డిషేస్ అన్ని క్లీన్ చేస్తుంది…… !! డిషెస్ క్లీనింగ్ అయ్యాక ఫేస్ వాష్ చేసుకుని రేణుక కి గుడ్ నైట్ చెప్పి మహాన్ రూమ్ కి వెళ్ళడానికి స్టెప్స్ వైపు వెళుతుంది……. !! స్టెప్స్ ఎక్కుతున్న భూమి కి ఆగు ఆన్న నందన గొంతు విని స్టెప్స్ ఎక్కడం ఆపి వెనక్కీ తిరిగి చెప్పండి అత్తయ్య ఏమైనా కావాలా అంటూ నందన వైపు చూస్తుంది …… !!
ఎక్కడికీ పైకీ వెళ్తున్నావ్ ……. ?? అని మొబైల్ వైపే చూస్తూ తల కూడా ఎత్తకుండా అడుగుతుంది …… !!
పడుకోవడానికి అత్తయ్య హ్యాండ్ బాగా ఎక్కువ పెయిన్ గా ఉంది ….. !! అందుకే పెయిన్ కిల్లర్ వేసుకున్నా సో అందుకే ఎర్లీ గా పడుకుందాం అని వెళ్తున్నాను….. !!
నీ రూమ్ పైన కాదు ఇక్కడే నోరు మూసుకుని కిందకు దిగు …… !! పైన పడుకోవటానికి నువ్వేం ఇంట్లో మనిషివి కాదు అఫ్ట్రాల్ ఇంటి పని మనిషివి నువ్వేంటో నేను ఎవ్రీ మినిట్ గుర్తు చేస్తూ ఉండాలా….. ??
నాకు మళ్ళీ సెపరేట్ రూమ్ ఎందుకు అత్తయ్య మహాన్ రూమ్ లోనే అడ్జస్ట్ అవుతాను …… !! మహాన్ ను అసలు డిస్టర్బ్ చేయను & తనకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అని భయంగానే నందన వైపు చూస్తూ చెప్తుంది ……. !!
అడ్జస్ట్ అయ్యేది నువ్వు కాదు నా కొడుకు ….. !! అయినా నీ లాంటి దరిద్రం పక్కనుంటే వాడికి నిద్ర ఎలా పడుతుంది అనుకున్నావ్ ……. ?? నిన్ను నేను మహాన్ రూమ్ లోకి ఏలా అలో చేస్తాను అనుకున్నావ్ ……. ?? హా !! ఫస్ట్ కిందకు దిగు నాకంటే నువ్వు ఎప్పుడు కింద నే ఉండాలి కానీ ఎత్తులో కాదు …… !! అని సీరియస్ గా తల పైకి ఎత్తి చెప్పగానే భూమి ఏడుపు ఆపుకుంటూ కిందకు దిగి నందన ముందు నిల్చుంటుంది ….. !!
నందన సోఫా లో నుండి పైకి లేచి భూమి చెయ్ పట్టుకుని కమ్ నీ రూమ్ చూపిస్తా అంటూ భూమి ను లాక్కుంటూ వెళ్ళి ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్తుంది …… !! ఇదే నీ రూమ్ అంటూ భూమి వైపు చూసి పొగరుగా నవ్వుతుంది ఆ రూమ్ ను చూసిన భూమి కన్నీళ్ళతో నందన వైపు చూస్తుంది ….. !!
స్టెప్స్ ఎక్కుతున్న భూమి ను నందన చెయ్ పట్టుకుని నువ్వు ఉండాల్సింది మహాన్ రూమ్ లో కాదు నీ కంటు సెపరేట్ రూమ్ అరేంజ్ చేశాను కమ్ విత్ మీ అని భూమి చెయ్ పట్టుకుని అదే ఫ్లోర్ లో ఉన్న ఒక రూమ్ కి తీసుకుని వెళ్తుంది….. !! భూమి ఇదే నీ రూమ్ ఇవాళ్టి నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి ఉంటున్నావ్ ఎలా ఉంది రూమ్ నీకు నచ్చిందా అని పొగరుగా నవ్వుతూ భూమి వైపు చూస్తుంది ……. !! భూమి ఆ రూమ్ వైపు చూసి కన్నీళ్లతో నందన వైపు చూస్తూ బావుంది అన్నట్టు తల ఆడించగానే నందన నవ్వుకుంటూ సరే ఇక వెల్లి పడుకో …… !! అంటూ నవ్వుకుంటూ హాల్ లోకి వెళ్లి శ్లోక ను తీసుకొని పడుకోవడానికి తన రూమ్ కి వెల్తుంది ……. !!
నందన వెళ్ళగానే భూమి ఆ రూమ్ లోకి వెళ్లి చుట్టూ చూస్తుంది …… !! ఆ రూమ్ లో అన్ని విరిగిపోయిన చైర్స్ , పాడయిపోయిన వస్తువులు, వేస్ట్ స్టఫ్ మొత్తం ఆ రూమ్ లోనే కనిపిస్తూ ఉంటే కనీసం పడుకోవడానికి బెడ్ కూడా లేని స్టోర్ రూమ్ ను చూసి విరక్తగా తనలో తానే నవ్వుకుంది….. !! రూమ్ చివర మూలకు ఉన్న చీపురు తీసుకుని దుమ్ము పట్టిన ఫ్లోర్ ను చూసి నీట్ గా వూడ్చి వాష్ రూమ్లో లో బకెట్ వాటర్ తీసుకుని మాప్ స్టిక్ తో ఫ్లోర్ నీట్ గా క్లీన్ చేసి అది ఆరడానికి ఫాన్ స్విచ్ అన్ చేస్తుంది ……. !! అది నిజంగా తిరుగుతుందా లేదా అని దాని రెక్కలు చూస్తే తప్ప అర్తం అవ్వదు…… !! అంత స్లోగా తిరుగుతున్న ఫ్యాన్ ను చూసి భూమి కి ఏడుపు మరింత ఎక్కువ అవుతుంది ….. !!
ఏ. సి రూమ్ లో పట్టు పరుపుల మీద మహారాణీ లా బ్రతికిన తను ఈరోజు ఒక బికారిలా స్టార్ రూమ్ లో కనీసం ఫ్యాన్ కూడా లేక ఉక్క పోతకు చమట పడుతూ & దోమలు కుడుతూ ఉంటే నిజంగా తనకు చాలా బాధగా ఉంది …… !! ఇవన్నీ భరిస్తూ తను ఇక్కడ ఉండాలా అన్న క్వశ్చన్ తనకు తాను వేసుకుని నీ వల్ల విడిపోయినా రెండు ఫ్యామిలీస్ ను కలపాల్సిన బాధ్యత నీదే అని మనసు చెప్పడం తో తన మీద తనే జాలి పడుతుంది …… !! ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చుట్టూ చూసిన తనకు దుమ్ము పట్టుకు పోయిన టేబుల్ ఫ్యాన్ కనిపించగానే …… !!
దాన్ని క్లాత్ తో క్లీన్ చేసి స్విచ్ వేయగానే అది భూమి లక్ కొద్ది వర్క్ అయ్యి అన్ అవ్వడంతో కాస్త లో కాస్త ఊపిరి పీల్చుకుంటుంది…… !! తనకు కనీసం బెడ్ షీట్ & పిల్లో కూడా ఆ రూమ్ లో కనిపించక పోయేసరికి ఆలాగే గోడకు ఆనుకుని కూర్చుని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి ఏడుస్తూ బాగా గుర్తిస్తున్నారు మమ్మీ నా గురించి బాగా ఏడుస్తూ ఉంటారు కదా 🥹…… !! మీ వాయిస్ వింటే నేను కూడా ఏడ్చేస్తాను అందుకే నానమ్మ దగ్గర మొబైల్ ఉన్నా మీ ఎవరికి కాల్ కూడా చేయలేదు……. !! నన్ను క్షమించు మావయ్య నిన్ను అత్తయ్య ను కలిపే నేను ఈ ఇంటి గడప దాటుతాను అంటూ ఏవో ఆలోచనలతో ఆలాగే తల గోడకు ఆనించి ఏడుస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది …… !!
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
ప్రశాంతంగా పడుకున్న భూమి మోహం మీద ఫోర్స్ గా నీళ్లు పడ్డం తో ఉలిక్కిపడి భయంగా పైకీ లేచి నిల్చున్న భూమి కి తన ఎదురుగా నందన క్రీమ్ కలర్ షర్ట్ విత్ బ్లాక్ కలర్ ట్రాక్ సూట్ లో జిమ్ చేయడానికి వెళ్తూ రెడీ అయి కనిపిస్తుంది …… !! భూమి కోపంగా ఉన్న నందన మోహం చూసి తనెందుకు అంత కోపంగా ఉందో & తనేం మిస్టేక్ చేసిందో అర్తం అవ్వక ఎ….. ఏమైంది అత్తయ్య అని కంగారుగా అడుగుతుంది …… !!
టైమ్ ఎంత అవుతుంది ……. ?? అని సీరియస్ గా చూస్తూ అడుగుతుంది …… !!
భూమి లైట్ ఆన్ లో ఉండడం తో రూమ్ వైపు చూస్తూ ఈ రూమ్ లో వాల్ క్లాక్ లేదు కదా అత్తయ్య ……. !! నాతో మొబైల్ కూడా లేదు చూస్తూంటే మార్నింగ్ 5 అవుతున్నట్టు వుంది …… !! అని విండో లో నుండి బయటకు చూస్తూ బెదురు కళ్ళతో చెప్తుంది …… !!
ఇట్స్ 4;50 ఇప్పటి దాక మహారాణీ లా పడుకుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు ….. ?? అని కళ్లు ఉరిమి చూస్తూ 10 మినిట్స్ టైమ్ ఇస్తున్నా ఫ్రెష్ అయి వర్క్స్ స్టార్ట్స్ చెయ్ ……. !! ముందు ఇంటి బయట ఊడ్చి నీళ్ళు చిమ్మి ముగ్గు పెట్టు …… !! డెయిలీ ఇక్కడ ముగ్గు వేస్తారు సో ఈరోజు నుండి అది నీ డ్యూటీ నే అండ్ అది అయ్యాక ఇల్లు వూడ్చీ మాప్ పెట్టేసి అందరి కోసం టీ ప్రిపేర్ చేయ్….. !!
సన్నీ ( మహాన్) కి లెమన్ జ్యూస్/ గ్లూకోస్ వాటర్ / కోకోనట్ వాటర్ 3 ఇవ్వు ….. !! సన్నీ ఇంటరెస్ట్ బట్టి వన్ చూస్ చేసుకుంటాడు ..,… !! ఆలాగే శ్లోక కి గ్రీన్ టీ ఇవ్వు ఒకే ….. !! ఆ తర్వాత అందరికి కుకింగ్ స్టార్ట్ చెయ్యి …… !! ఇదే నీ డెయిలీ రోటీన్ & డెయిలీ ఇలా నేను నిన్ను నిద్ర లేపి చెప్పను ….. !! ఆలాగే రేపటి నుంచి షార్ప్ 4 కి లేవాలి & నైట్ 11 కి పడుకోవాలి …… !! అని చెప్పి అక్కడి నుండి జిమ్ చేయడానికి జిమ్ రూమ్ కి వెల్తుంది నందన…… !!
అయ్యయ్యో …. !! నాకు ముగ్గు పెట్టడం రాదుగా దాని గురించి తర్వాత ముందు అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి ….. !! కానీ శారీ అని ఆలోచిస్తున్న తనకు పక్కనే బ్యాగ్ లో తనకు శారీ ఫ్రెష్ అవ్వడానికి అన్ని థింగ్స్ కనిపించడం తో ఫాస్ట్ గా పేస్ట్ బ్రష్, టవెల్, సోప్ తీసుకుని వాష్ రూమ్లో కి వెళ్లి 10 మినిట్స్ లో ఫ్రెష్ అయి నిన్న రేణుక శారీ కట్టడం గుర్తు చేసుకుంటూ అరగంట పాటు కష్టపడి పర్ఫెక్ట్ గా శారీ కట్టుకుంటుంది …… !! తలకు టవెల్ చుట్టుకుని మొహానికి సింపుల్ గా చిన్న బిందీ పెట్టుకొని బయటకు వెళ్తుంది …… !!
ఇంటి ముందు ఫస్ట్ చీపురుతో నీట్ గా ఊడుస్తుంది ….. !! ఊడవడానికే అరగంట పట్టేంత పెద్దగా వుంటుంది ఆ ప్లేస్ తర్వాత ఎమ్ చేయాలో అర్థం అవ్వక తనకు హెల్ప్ చేయడానికీ కూడా అక్కడ ఎవరు లేకపోవడం తో భూమి కి చాలా కంగారుగా అనిపిస్తుంది ……. !! అసలే శారీ కట్టుకోవడానికి చాలా టైమ్ వేస్ట్ అయిపోయింది …… !! ఇపుడు నందన వచ్చి ఇంకా అవ్వలేదా ….. ?? అని అడిగితే ఎమ్ చెప్పాలో అర్థం అవ్వక భూమి కళ్లల్లో టెన్షన్ తో నీళ్లు తిరుగుతాయి …… !! సరిగ్గా అపుడే ఎవరివో అడుగుల శబ్దం విని భూమి గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం మొదలవుతుంది …… !!
నిద్రపోతున్న భూమి మొహాన నీళ్ళు కొట్టి మరీ తనను నిద్రలేపి నువ్వు నిద్రపోతుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని గదిమి 10 మినిట్స్ లో ఫ్రెష్ అయి రమ్మని చెప్పి తను జిమ్ రూమ్ కి వెళ్తుంది భూమి ఫాస్ట్ గా ఫ్రెష్ అయి ఇంటి ముందు చీపురుతో నీట్ గా ఉడ్చేసి ఇప్పుడు ముగ్గెలా వేయాలి నాకు రాదు కదా ఇక్కడ నాకు హెల్ప్ చేయడానికీ కూడా ఎవరు లేరు శారీ కట్టుకోవడానికే నాకు టైమ్ సరిపోయింది ఇప్పుడు అత్తయ్య వచ్చి ఇంకా ఎందుకు పెట్టలేదు అంటే ఎమ్ చేయాలి అని టెన్షన్ గా ఆలోచిస్తున్న భూమి కి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అపుడే ఎవరివో అడుగుల శబ్దం విని భూమికి గుండె ఆగినంత పనైంది
అయ్యయ్యో ఎవరో వస్తున్నారు అత్తయ్యనే అయ్యుంటుంది ….. !! ఎందుకు ఇంకా ముగ్గు వేయలేదు అని రాగానే కన్ఫర్మ్ గా అడుగుతుంది …… !! నేను రాదు అని చెప్పగానే రోడ్ అని కూడా చూడదు ఇప్పుడు అత్తయ్య చేతుల్లో దెబ్బలు తినక తప్పేలా లేదు అని టెన్షన్ గా నిలువెల్లా వణికిపోతూ ఉంటుంది…… !! టెన్షన్ గా తన కళ్ళను అటు తిప్పి చూసిన భూమికి రేణుక రావడం చూసి హమ్మయ్యా !! అక్క నువ్వా ఇంకా అత్తయ్య అనుకుని టెన్షన్ పడ్డాను …… !! టైమ్ గాడ్ కరెక్ట్ టైమ్ కి వచ్చావ్ అక్క ప్లీస్ హెల్ప్ చేయవా …… !!
భూమి ను ఆ టైమ్ లో అక్కడ చూసి ఆశ్చర్యపోతూ భూమి నువ్వు ఇక్కడ ఈ టైమ్ లో ఎమ్ చేస్తున్నావ్ ….. ?? అంటూ భూమి ను చూసి ఎంటి భూమి నువ్వే ఇదంతా వుడ్చేసావా …… !! అని షాక్ అవుతూ అడుగుతుంది …… !!
అవును అక్క !! నేనే కానీ నడుము పట్టేసింది …… !! అని నడుము స్ట్రెచ్ చేస్తూ బాబోయ్ ఫుల్ గా నోస్తోంది అక్కా అని నడుము పట్టుకుని…… !! ఈ ముగ్గు పెట్టడం నాకు రాదు ప్లీస్ ఎలా వేయాలో నేర్పించవా నేను ఎప్పుడూ ముగ్గు పెట్టడం చూడలేదు …… !!
నీకెందుకు భూమి ఈ పనులు మేము ఉన్నది అందుకే కదా ……. !! ఇదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వేళ్ళి రెస్ట్ తీసుకో …… !! అయినా ఇంత ప్రొద్దున్నే ఎందుకు లేచావ్ ?? నువ్వెల్లు నేను నీ కోసం టీ తీసుకుని వచ్చి లేపుతాను …… !!
లేదక్కా నేను నిద్రపోతూ ఉంటే అత్తయ్యనే నన్ను ఇంటి పనులు మొత్తం చేయమని చెప్పారు …… !! అని నందన చెప్పిన లిస్ట్ మొత్తం చెప్పి ప్లీస్ త్వరగా స్టార్ట్ చేద్దాం మళ్లీ అత్తయ్య వస్తుంది ……. !! అని కంగారుగా చెప్పడంతో నందన కావాలనే భూమి ను టార్గెట్ చేసింది …… !! అని అర్థం చేసుకుని ముగ్గు పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు భూమి ఇదిగో ఇలా చిన్న బౌల్ లో ముగ్గు పిండి తీసుకుని ఇలా వేయాలి అని భూమికి చిన్న ముగ్గు వేసి చూపిస్తుంది ….. !!
నీకు వచ్చు కాబట్టీ నువ్వు ఈజీగా వేసేసావ్ బట్ నాకు రావడం లేదు …… !! చూడు నాకు ముగ్గు పిండి పట్టుకోవడం కూడా రావట్లేదు అది చేతిలో నుండి జారుతుంది అక్కా….. !! ఒక 2 డేస్ నువ్వు చూపిస్తే నేను నేర్చుకుంటాను …… !! బై ది బై నువ్వు ముగ్గు చాలా బాగా వేశావ్ అక్క అని రేణుక వైపు చూసి చిరు నవ్వుతో చెప్తుంది ….. !!
మనసులో అంత బాధ ఉన్నా పైకీ నవ్వుతున్న భూమి ను చూసి నీ మంచితనమే నిన్ను మహాన్ బాబు ను కలుపుతుంది భూమి …… !! అని మనసులో అనుకుంటూ ఆలాగే భూమి నేర్పిస్తాను & ఫస్ట్ నేను వెళ్తాను మళ్ళీ నందన అమ్మ చూస్తే అనవసరంగా గొడవ చేస్తారు అని చెప్పి ఎవరు చూడకముందే పిల్లి లా రేణుక లోపలికి వెళ్లిపోతుంది…… !!
భూమి ఆ ముగ్గు కి కలర్స్ వేస్తే బావుంటుంది అనుకుని నీట్ గా ముగ్గు పాడవకుండా పూర్తి కాన్సంట్రేషన్ తో ఆ ముగ్గుకి కలర్స్ తో ముగ్గుకు మరింత అందం తెస్తుంది….. !! వావ్ ఫస్ట్ టైమ్ అయినా కలర్స్ బాగా వేసాను ….. !! అని నవ్వూతూ ఆ ముగ్గుకు రెండు చేతులతో దిష్టి తీసి ఇంట్లోకి వెళ్ళేసరికి రేణుక ఇంకో పనిమనిషి కలిసి భూమి కోసం ఫాస్ట్ గా ఇళ్లు వూడ్చేసి ఫ్లోర్ కూడా నీట్ గా మాప్ వేసి ఉంటారు …… !!
భూమి అది చూసి తన కోసం రేణుక చేస్తున్న హెల్ప్ కి భూమి కి అనందం తో కళ్లు చెమ్మగిల్లుతాయి …… !! అవి తుడుచుకుని రేణుక వైపు చూసి చిన్నగా నవ్వగానే రేణుక కూడా నవ్వి …… !! నందన జిమ్ రూమ్ నుండి బయటకు వచ్చే టైమ్ అవుతోంది అని భూమి కిచెన్ లో టీ కూడా ఆల్రెడీ చేసి పెట్టాను…… !! మహాన్ బాబు కోసం డ్రింక్స్ & శ్లోక మేడం కోసం గ్రీన్ టీ కూడా రెడీ చేశాను ……. !!
నువ్వు కిచెన్ లో ఉండి టీ చేస్తున్నట్టు యాక్ట్ చెయ్యి అమ్మ గారు వచ్చే టైమ్ అవుతోంది …… !! అని రేణుక,పని అమ్మాయ ను తీసుకుని అక్కడి నుండీ వెళ్ళగానే భూమి కిచెన్ లోకి వెళ్లి కావాలనే మళ్లీ టీ ను రీ హీట్ చేస్తు వుంటుంది …… !!
రేణుక చెప్పినట్టే ఫైవ్ మినిట్స్ తర్వాత జిమ్ రూమ్ లో నుండి చమట తుడుచుకుంటూ హాల్ లోకి వస్తుంది నందన …… !! హాల్ లోకి వచ్చి సోఫా లో కూర్చుని రిలాక్స్ అవుతున్న తనకు ఫ్లోర్ క్లీన్ చేసినట్టు ఫ్లోర్ క్లీనర్ స్మైల్ రావడంతో ……. !! అశ్చర్యంగా చూస్తూ ఇది అప్పుడే ఇంత వర్క్ ఎలా చేసింది …… ?? ఇంతకీ ముగ్గు పెట్టిందా …… ?? అని బయటకు వెళ్లి చూసేసరికి రంగు రంగుల కలర్స్ తో ఆందంగా వేసిన ముగ్గు కనిపించడం తో కాస్త డిసప్పాయింట్ అవుతుంది…… !! ఇది ఇంత ఫాస్ట్ గా వర్క్స్ చేసిందేంటి చా !! అనుకుంటూ హాల్ లోకి వెళ్ళేసరికి భూమి టీ కప్ తో రెడీగా ఉండడం గమనించి టీ కూడా చేసేసావా అని మరింత షాకింగ్ గా అడుగుతుంది ……. !!
హా అత్తయ్య చేసేసాను …… !! మహాన్, శ్లోక లకు డ్రింక్స్ కూడా రెడీ చేసాను….. !! ముందు మీరు టీ తాగండి నేను వెళ్ళి అందరికి ఇస్తాను ….. !! అని ట్రే పట్టుకుని దేవయాని రూమ్ వైపు వెళ్తున్న భూమి ను చూసి పల్లు కొరుకుతూ …… !! నిన్ను ఇలా ప్రశాంతంగా ఎందుకు వుండనిస్తానే …… !!
మహాన్ తోనే నీకు చంప చల్లుమనేలా కొట్టించక పోతే అప్పుడు అడగవే …… !! నా కొడుకునే ముగ్గులోకి దింపి నాకు నిజంగా కోడలు అవ్వాలి అనుకుంటావా ……. !! చెప్తా నీ పని అని కిచెన్ లోకి వెళ్లి మహాన్ కోసం చేసిన డ్రింక్స్ లో సాల్ట్ మిక్స్ చేసి నవ్వుకుంటూ …… !! అయిపోయావే నా కన్న చేతిలో అని కన్నింగ్ గా నవ్వుకుంటూ ఎమ్ తెలియనట్టు తిరిగి హాల్ లోకి వచ్చి పేపర్ చదువుతూ ఉంటుంది …… !!
దేవయాని, విజయేంద్ర ప్రసాద్ లకు టీ ఇచ్చి వచ్చాక మహాన్, శ్లోక కోసం ట్రే లో డ్రింక్స్ పెట్టుకొని స్టెప్స్ ఎక్కుతూ వాళ్ళ రూమ్ వైపు వెళ్తున్న భూమి ను ఓరగా కళ్ళు తిప్పి చూస్తూ నందన కూడా వెనుకే వెళ్తుంది ……. !! ముందుగా శ్లోక కి గ్రీన్ టీ ఇచ్చి మహాన్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెల్తుంది …… !!
భూమి ట్రే పట్టుకుని మహాన్ రూమ్ లోకి వెళ్లడం చూసిన నందన రూమ్ బయటే నిలబడి డోర్ కాస్త ముందుకు వేసి లోపల జరిగేది చూస్తూ ఉంటుంది …… !! భూమి రూమ్ లోకి వెళ్ళేసరికి మహాన్ అపుడే జిమ్ చేసి వచ్చినట్టు వున్నాడు …… !! వంటికి పట్టిన చమట తుడుచుకుంటూ బాడీ ను స్ట్రెచ్ చేస్తు కనిపిస్తాడు …… !! కండలు తిరిగిన మహాన్ బాడీ ను చూసిన భూమి గుటకలు మింగుతూ చూస్తుంది….. !! మహాన్ బాడీ ను చూసిన భూమి బాబోయ్ ఎమ్ బాడీ రా బాబు ఎందుకయ్యా స్వామి మహాన్ ను ఇంత ఆందంగా పుట్టించావ్ …… !! తనను ఇలా చూస్తూంటే వైఫ్ నైన నాకే ఎదోలా ఉంది ఇక ఆఫిస్ లో స్టాఫ్ మహాన్ ను చూపులతో తోనే తినేస్తూ ఉంటారు ….. !! కాలేజ్ డేస్ లో కూడా తనకు ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది …… !! డెయిలీ ఆఫిస్ కి వెళ్ళే ముందు దిష్టి తీసి పంపాలి అనుకుంటూ మహాన్ వైపు అలా మైమరపుగా చూస్తూ ఉంటుంది …… !!
ఇదేంటి మహాన్ కు గ్లూకోస్ వాటర్ ఇవ్వకుండా అలా గుడ్లు అప్పగించి మరీ చూస్తోంది ….. !! దీని వాలకం చూస్తుంటే నా కొడుకు ను తన వైపు తిప్పుకునేలా ఉంది …… !! అని భూమి వైపు కోపంగా చూస్తు ఉంటుంది నందన …… !!
మహాన్ బాడి ను అటు ఇటు స్ట్రెచ్ చేస్తు డోర్ వైపు చూసిన తనకు తలకు టవల్ కట్టుకుని మొహానికి ఎటువంటి మేక్ అప్ లేకపోయినా సహజంగా నే ఆందంగా ఉన్న భూమి ఈరోజు మరింత అందంగా అప్పుడే విచ్చుకున్న రోజా పువ్వులా కనిపిస్తూ ఉంది …… !! చేతిలో ట్రే పట్టుకుని తన వైపు చూపు కూడా తిప్పుకోకుండా చూస్తున్న భూమి ను చూసి నొసలు ముడి వేసి ఏయ్ నువ్వేంటి ఇక్కడ …… ?? అని సీరియస్ గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన వైపే సూటిగా చూస్తూ అడుగుతాడు …… !!
మహాన్ పిలుపుకు తన నుండి చూపు తిప్పుకుని గు… గుడ్ మార్నింగ్ మహాన్ అని కంగారుగా చెప్తుంది ……. !!
ప్చ్ !! నేను నీ విష్ కోసం అడగలేదు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు …….. ?? అని అడుగుతున్నా !!
అది నీకు గ్లూకోస్ వాటర్ ఇవ్వాలి అని వచ్చాను …… !! అని మహాన్ ముందు నిల్చొని ట్రే మహాన్ ఎదురుగా పెడుతూ లెమన్ జ్యూస్, గ్లూకోస్ వాటర్ & కోకోనట్ వాటర్ నువ్వు ఎది తాగుతావో నాకు తెలియదు …… !! అందుకే అన్ని తెచ్చాను అని క్యూట్ గా నవ్వుతూ చెప్తుంది ……. !!
భూమి వైపు విసుగ్గా చూస్తూ నాకు కోకోనట్ వాటర్ తాగడం అలవాటు సో డెయిలీ అవే తీసుకురా …… !! అంటూ కోకోనట్ వాటర్ గ్లాస్ తీసుకుని సిప్ చేసి ఛీ అంటూ అవి వుమ్మేసి వాట్ ఈజ్ దిస్ భూమి?? అని భూమి వైపు కోపంగా చూస్తు అడుగుతాడు …… !!
మహాన్ మోహం లోని కోపానికి భయపడుతూ ఏ… ఏమైంది మహాన్ కోకోనట్ వాటర్ టేస్టీ గా లేవా అని భయంగా అడుగుతుంది …… !!
ఇవి కోకోనట్ వాటరా లేక సాల్ట్ వాటరా?? హా !! కోకోనట్ వాటర్ లో సాల్ట్ మిక్స్ చేసి మార్నింగ్ మార్నింగ్ నా మూడ్ డిస్ట్రబ్ అయ్యేలా చేస్తావా…… !! కావాలనే వేసావ్ కదా యు స్టుపిడ్ …… !! అంటూ ఆ గ్లాస్ లో వున్న కోకోనట్ వాటర్ మొత్తం బుగ్గలు నొక్కి పట్టుకుని మరీ భూమి తో తాగించి ……. !! వెళ్ళి మర్యాదగా కోకోనట్ వాటర్ ఎమ్ యాడ్ చేయకుండా తీసుకుని రా గో అంటూ అరవగానే భూమి ఆ అరుపుకు బయపడి ఏడుస్తూ ట్రే పట్టుకుని కిందకు వెళ్ళిపోతుంది ……. !!
భూమి బయటకు రావటం చూసిన నందన పక్కకు తప్పుకుని భూమి ఏడుస్తూ వెళ్లడం చూసి నవ్వుకుంటూ …… !! నువ్వు ఎప్పుడూ ఇలాగే ఏడుస్తూ ఉండాలి భూమి నీ మోహం లో నవ్వు నేను చూడకూడదు …… !! ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావ్ నిన్ను ఈ పరిస్థితిలో చూసి నీ కుటుంబం మొత్తం ఎడవాలీ అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది అని కోపంగా చూస్తు తన రూమ్ కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ……. !!
ఏడుస్తూ కిచెన్ లోకి వస్తున్న భూమి ను చూసి బ్రేక్ఫాస్ట్ కోసం వేజ్జిస్ కట్ చేస్తున్న రేణుక చూసి కంగారుగా తాన చేతిలో ట్రే పట్టుకుని పక్కనున్న కౌంటర్ మీద పెడుతూ భూమి ఏమైందమ్మా ?? ఎందుకిలా ఏడుస్తున్నావ్ …… ?? మళ్లీ అమ్మ గారు కొట్టారా అని భూమి కన్నీళ్లు తుడిచి ఆప్యాయంగా అడుగుతుంది …… !!
అక్క అంటూ రేణుక ను హత్తుకుని ఏడుస్తూ అత్తయ్య ఎమ్ అనలేదు ……. !! కానీ మహాన్ అంటూ రూమ్ లో జరిగింది చెప్పి ఏడుస్తున్న భూమి ను చూసి ఎంటి సాల్ట్ ఆ లేదమ్మా నేను సాల్ట్ వేయలేదు ……. !! అని భూమి కి దూరంగా జరిగి ఇందులోకి సాల్ట్ ఎలా వచ్చింది ?? భూమి కోకోనట్ వాటర్ లోకి ఎవరైనా సాల్ట్ మిక్స్ చేస్తారా …… ?? అని అయోమయంగా చూస్తూ ఇందులోకి సాల్ట్ ఎలా వచ్చుంటుంది అని అలోచిస్తూ ఉంటుంది ……. !!
భూమి ఆ గ్లాసెస్ వైపే చూస్తూ గ్లూకోస్ వాటర్ గ్లాస్ అందుకుని సిప్ చేయగానే అందులో కూడా ఫుల్ సాల్ట్ మిక్స్ చేసుంటుంది …… !! లెమన్ జ్యూస్ లో కూడా సేమ్ …… !! ఏంటిది ?? ఈ రెండు గ్లాసెస్ లో కూడా సాల్ట్ మిక్స్ ఆయి ఉంది …… !! అని ఇందాక జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది …… !! తను దేవయాని వాళ్ళ రూమ్ లోకి వెళ్లేటపుడు నందన హాల్ లో నే ఉండడం గుర్తు రావడంతో ఇది నందన పనే అని అర్తం చేసుకుని …… !! నేనంటే ఎందుకంత ద్వేషం అత్తయ్య అని బాధగా కల్లు తుడుచుకుంటూ మరో గ్లాస్ లో కోకోనట్ వాటర్ తీసుకుని మహాన్ రూమ్ లోకి వెల్తుంది ……. !!
మహాన్ కాల్ లో హనీష్ తో సిరియస్ గా మాట్లాడ్డం చూసి డోర్ లో నిల్చునే బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉంటుంది …… !! మహాన్ కాల్ మాట్లాడుతూనే భూమి వైపు చూసి కళ్లతోనే రమ్మని సైగ చేయడంతో భూమి అడుగులో అడుగేసుకుంటూ మహాన్ ముందు నిల్చొని గ్లాస్ ఇవ్వగానే మహాన్ ఆ గ్లాస్ లో వున్న కోకోనట్ వాటర్ తాగి ఒకే కాల్ యు బ్యాక్ అని కాల్ కట్ చేసి గ్లాస్ భూమి చేతిలో పెడుతు ఇంకో సారి నా విషయం లో మిస్టేక్ చేసావో అని సీరియస్ గా చూస్తూ వాష్ రూమ్లో కి వెళ్ళబోతాడు …….. !!
మహాన్ ఒక్క నిమిషం అంటూ మహాన్ ఎమ్ అంటాడో అని కొంచెం భయంగానే పిలుస్తుంది ……. !!
మహాన్ భూమి వైపు చూసి వాట్ ?? అంటూ తన వైపు తిరుగుతాడు …… !!
మహాన్ నువ్వు…. నువ్వు నిజంగా నన్ను ప్రేమించలేదా?? నా మీదున్న కోపంతోనే నన్ను లవ్ చేసినట్టు యాక్ట్ చేసావా …… ?? అని బాధ నిండినా గొంతు తో తల పైకెత్తి మహాన్ మోహం లోకి చూస్తు అడుగుతుంది…… !!
ఆందంగా ఉన్న భూమి కళ్లల్లో నీళ్లు చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ ఎంటి నువ్వింకా నేను నిన్ను ప్రేమిస్తున్నా …… !! అనే అనుకుంటున్నావా ఓ మై గాడ్ భూమి నువ్వు మరీ ఇంత అమాయకురాలు ఎన్టీ …… ?? అని గట్టిగా నవ్వుతూ సడెన్ గా భూమి మెడ పట్టుకుని వెనక్కీ వంచి తన మొహం లోకి మోహం పెట్టి చూస్తూ నేను నిన్ను ప్రేమించాను …… !! అని చెప్పింది నీతో గడిపిన క్షణాలు ఆన్ని అబద్ధాలే నీ ముందున్నది నిజం …… !! నీకు నా చేతుల్లో నరకం మాత్రమే వుంటుంది ……. !! తప్పా ప్రేమ దొరకదు అంతే కాదు నువ్వు ఎప్పటికీ ఈ మహాన్ కి బార్య అవ్వలేవు …… !!
నువ్వు మా అమ్మ విషయం లో చేసిన తప్పుకు ఇదే నేను వేసే శిక్ష …… !! లేదు ఇదంతా బరించలేను నీ వల్ల అవ్వదు అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంటి నుండే కాదు నా జీవితంలో నుండి కూడా వెళ్లిపోవచ్చు …… !! అని సీరియస్ గా చెప్పి తనను దూరంగా తోసి విసురుగా వాష్ రూమ్లో కి వెళతాడు ….. !!
నేను అత్తయ్య విషయం లో ఎమ్ తప్పు చేసా మహాన్ …… ?? నాకు నిజంగా ఎమ్ తెలియదు ప్లీస్ మహాన్ నన్ను అర్తం చేసుకో నువ్వు నేను కలిస్తేనే మీ పేరెంట్స్ ను కలపగలం అని ఏడుస్తూ చెప్తుంది …… !!
నువ్వేం చేసావో పోను పోను నీకే తెలుస్తుంది …… !! ఎప్పటికీ మా అమ్మ నీ మామ చెయ్ అందుకోదు ఎందుకంటే ఆ అర్హత ఆయనకు లేదు అని చెప్పి వాష్ రూమ్ డోర్ లాక్ చేసుకుంటాడు …… !! అది చూసిన భూమి కన్నీళ్లతో గ్లాస్ తీసుకుని కిచెన్ లోకి వెళ్ళిపోతుంది …… !!