నీ ఊపిరి సాక్షిగా ❣️-6

నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో భూమి అనగానే భూమి షాక్ అయ్యి దేవయాని వడిలో పడుకున్నది కాస్త పైకి లేచి కూర్చుంటూ ఎమ్ మాట్లాడుతున్నావ్ నానమ్మ ?? నువ్వు  నన్ను వెళ్ళిపో అంటున్నావా ….. !! అంటే నీకు కూడా నేనంటే ఇష్టం లేదా అని బాధగా అడుగుతూ దేవయాని వైపు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది…… !! భూమి ను అలా చూసిన దేవయాని ప్చ్!! భూమి తల్లీ ఏంటిది అన్నిటికీ ఇలా కన్నీళ్ళు పెట్టుకోకమ్మా అంటూ భూమి కన్నీళ్ళు తుడుస్తూ చూడు బంగారం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఇందాకే చెప్పాను….. !!

మళ్ళీ ఎందుకు ఇలా అపార్థం చేసుకుని బాధ పడుతున్నావ్ ….. ?? నాకు శ్లోక ఏంతో నువ్వు అంతే భూమి …… !! ఇంకెప్పుడు అలా అనుకోవద్దు అంటూ తన కన్నీళ్ళు తుడిచి నుదుటన ఆప్యాయంగా ముద్దు పెడుతుంది …….. !!

మరి నన్ను ఎందుకు నానమ్మ ఇంట్లో నుండి వెల్లిపోమంటున్నావ్ …… ?? అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంది ……. !!

నిన్ను ఇక్కడి నుండి వెల్లుపోమంటుంది నువ్వంటే ఇష్టం లేక కాదు భూమి ……. !! ఇక్కడే ఉండి వీళ్ళు పెట్టే బాధలు బరించే కంటే నువ్వు మీ ఇంటికి వెళ్లడం చాలా మంచిది …… !! వీళ్ళు మీ మావయ్య చెప్పినట్టు మనుషులు కాదమ్మ ……. !! నా మాట విను తల్లీ మీ మావయ్య దగ్గరకి వెళ్ళిపో ….. !! అక్కడైనా నువ్వు హ్యాపీగా ఉంటావ్ …… !! ఇక్కడే ఉంటే వీళ్ళు పెట్టే టార్చర్ బరించలేక రోజూ ఈ నరకం లో చస్తూ బ్రతుకుతూ ఇలానే బాధ పడుతూ ఉండాలి …… !! మీ మావయ్య ఉండగా నువ్వు ఇన్ని బాధలు నటించాల్సిన అవసరం లేదు భూమి…… !!

భూమి పైకి లేచి నిల్చుని లేదు నానమ్మ నేను ఇక్కడి నుంచి వెళ్తే అది అత్తయ్య మావయ్య లని కలిపిన తర్వాతే వెళ్తాను…… !! అయినా పెళ్ళి ఎలా జరిగినా మా పెళ్ళి అయితే జరిగిపోయింది కదా నానమ్మ….. !! మహాన్ కి నేనంటే ఇష్టం లేకపోవచ్చు కానీ నాకు మహాన్ అంటే చాలా ఇష్టం …… !! మావయ్య దగ్గర ఉంటే నేను ఎంత సెక్యూర్ గా అనిపిస్తుందో మహాన్ పక్కనున్న కూడా నాకు అంతే సెక్యూర్ గా అనిపిస్తుంది …… !!

అత్తయ్యా మావయ్య ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారో నాకు తెలియదు ……. !! బట్ అది నా వల్లే అని నాకు అర్తం అవుతుంది …… !! అందుకే నా వల్ల జరిగిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను నానమ్మ ప్లీస్ అప్పటి వరకు నన్ను ఇక్కడి నుండి వెళ్ళమని చెప్పకు……. !!

అయ్యో పిచ్చి తల్లీ అది నువ్వు అనుకున్నంత సులభం కాదు ….. !! నీకు ఒకటి చెప్పనా భూమి !! మీ అత్తయ్య కి మావయ్య కి దూరం ఈ రోజుది కాదమ్మా 20 ఏళ్ళ క్రితం మొదలైంది …… !! అది దగ్గర చేయటం సాధ్యమైన పని కాదు & నందన మొండి తనం గురించి నీకు తెలియదు ఎవరైనా తన కాళ్ళ దగ్గరకే రావాలి అనుకునే రకం …. !! కార్తికేయ నే అన్ని మెట్లు దిగి తనకు సారి చెప్పినా నందన యాక్సెప్ట్ చేయదు….. !! కార్తికేయ తన ఆత్మాభిమానాన్ని చంపుకుని నందన కి సారి చెప్పడు…… !?

నానమ్మ  ఈ ప్రపంచం లో అసాధ్యం అయిన పని ఎమ్ లేదు ప్రయత్నం చేయకుండా ఓటమిని అంగీకరించకూడదు …… !! అని నాకు మావయ్య ఏపుడు చెప్తూ ఉంటాడు …… !! అసలు వాళ్లిద్దరి జీవితంలో ఎమ్ జరిగింది నానమ్మ …… ?? అమ్మ అమ్మమ్మ తో చెప్తుంటే విన్నాను అత్తయ్య మావయ్య లది లవ్ మ్యారేజ్ అట కదా మరి ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోయారు …… ?? నేనంటే అత్తయ్యా కి ఎందుకంత కోపం & నన్ను ట్రాప్ చేసి మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు …… ??

దేవయాని భూమి వైపు చూస్తూ మీ మావయ్య నందన ఒకే కాలేజ్ లో చదివేవారమ్మ …… !! ఇద్దరూ సేమ్ క్లాస్ & కాలేజ్ టైమ్ లోనే నందన కార్తికేయ ను ఇష్టపడడం స్టార్ట్ చేసింది ……. !! కానీ కార్తికేయ కి నాన్న లేకపోవడం తో ఇంటి బాధ్యతలు అన్నీ తనే తీసుకొని కేవలం తన చదువు మీదే దృష్టి పెట్టి నందన ప్రేమను కాదు అన్నాడు ……. !!

కానీ నందన కి ఉన్న పొగరు తో కార్తికేయ ను ఎలాగైనా పొందాలని అనుకుంది……. !! అందుకే అనసూయ దగ్గరకు వెళ్లి ఏడ్చి కార్తికేయ లేకపోతే చచ్చిపోతాను & మీరే ఎలాగైనా పెళ్లి చేయండి అని మీ అమ్మమ్మ మనసు మార్చి కార్తికేయ కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనను పెళ్ళి చేసుకుని అనుకున్నది సాధించింది…… !! ఆ ఇంట్లోకి సంతోషంగా అయితే అడుగు పెట్టింది కానీ అక్కడ ఎమ్ జరిగిందో నాకు కూడా సరిగ్గా తెలియదు…… !! బట్ 6 సంవత్సరాల తర్వాత ఈ ఇంటికీ మహాన్, శ్లోక తో వచ్చేసి పూర్తీగా కార్తికేయ కి దూరం అయిపోయింది ……. !!

ఈ ఇంట్లో నందన ఆడిందే ఆట పాడిందే పాట అందుకే అది ఎమ్ చేసినా ఆయన సపోర్ట్ చేస్తారు …… !! భర్త ను వదిలేసి వచ్చాక కూడా ఎందుకు వచ్చేశావ్ ?? అని అడగకుండా దాని మనసును మరింత విరిచేసి ఆ బార్య బర్తల మధ్య మరింత దూరం తీసుకు వచ్చాడు మీ తాతయ్య విజయేంద్ర ప్రసాద్…… !! ఇటు నందన కూడా కార్తికేయ మీద కోపంతో పిల్లలకు కూడా కార్తికేయ మీద ద్వేషాన్ని పెంచేలా చేసింది …… !!

ఈ కోపం కాస్త పెద్దది అయ్యి బిజినెస్ లో వైరం లా మారింది ……. !! ఇద్దరూ పోటాపోటీ గా బిజినెస్ లు చేస్తు కోపాన్ని ద్వేశంగా మార్చుకుని బ్రతుకుతున్నారు …… !! వీళ్ళు ఎప్పుడూ కలుస్తారా అని నేను వెయిట్ చేస్తూ ఉంటే మహాన్ నిన్ను పెళ్ళి చేసుకుని కార్తికేయ కు మరింత కోపాన్ని తెచ్చి రెండు కుటుంబాల మధ్య మరింత దూరం పెంచాడు….. !!

నిన్ను నా మనవడు పెల్లి చేసుకుంది నిన్ను అడ్డుపెట్టుకుని కార్తికేయ ను బాధ పట్టడానికి భూమి నువ్వే మీ మావయ్య కి వీక్నెస్ అని తెలిసి నీకు ప్రేమ పేరుతో దగ్గరై ఇలా పెళ్ళి చేసుకుని మీ మావయ్య మీద పంతం నెగ్గించుకోవాలి అని చూస్తున్నారు ….. !!

నానమ్మ నేను మహాన్ ను నిజంగా ప్రేమించాను & తన మీదున్న ప్రేమే మావయ్య కి ఇష్టం లేకపోయినా నన్ను ప్రేమించేలా చేసింది …… !! అలాంటి మహాన్ ప్రేమ అబద్దం అంటుంటే నమ్మడానికి నా మనసు అంగీకరించడం లేదు 🥹 మనసుకు చాలా కష్టంగా ఉంది…… !!

పిచ్చి తల్లీ ఇంకా వాడు చేసిన మోసం నీకు కనిపించట్లేదు అంటేనే తెలుస్తుంది ….. !! వాడ్ని ఎంతలా ప్రేమించావో కానీ అదే నిజం వాడు నిన్ను ప్రేమించలేదు ప్రెనించినట్టు నటించాడు ….. !!

కావచ్చు నానమ్మ కానీ నేను ప్రేమించాను కదా !! నా కాపురాన్ని నేనే కాపాడుకుంటాను ……. !! అత్తయ్య మావయ్య లను కలిపితే ఆటోమేటిక్ గా మహాన్ లో మార్పు మొదలవుతుంది ….. !!

మీ అత్త వాడికి చిన్నప్పటి నుండి కార్తికేయ మీద వాడితో పాటు ద్వేషాన్ని కూడా పెంచింది ….. !! చూసావు కదా కార్తికేయ ను కనీసం తండ్రి అని కూడా గౌరవం లేకుండా ఎలా మాట్లాడాడో ?? అలాంటి వాడ్ని మార్చాలి అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది …… !! వాడు మారాలి అనుకున్నా మీ అత్త మారనివ్వదు …… !! నేను చెప్పాల్సింది చెప్పాను ఆలోచించుకో భూమి నువ్వేం చిన్న పిల్లవి కాదు కదా అని భూమి తల నిమిరి నాకు కాస్త నడుము నొప్పిగా ఉంది …… !! కాసేపు పడుకుంటాను అని దేవయాని లోపలికి వెళ్లడం తో భూమి సోఫా లో కూర్చుని మహాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ……… !!

మహాన్ వర్మ సొల్యూషన్స్

 

మహాన్ నందన కంపెనీస్ ను టేక్ ఓవర్ చేయకుండా తనకంటూ ఓన్ ఐడెంటిటీ కావాలని నందన ను ఒప్పించి మరీ తన బెస్ట్ ఫ్రెండ్ హనీష్ తో కలిసి స్టార్ట్ ఆప్ కంపెనీ స్టార్ట్ చేసాడు …… !! స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే తనంటే ఎంటో ప్రూవ్ చేసుకుంటూ అంచలంచలగా ఎదుగుతూ నౌ టాప్ 10 లో తన కంపెనీ ను నిలబెట్టడానికి ఎంతో కష్టపడి తీసుకు వచ్చాడు …… !! ఆఫీస్ అవర్స్ లో మహాన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ చిన్న మిస్టేక్ జరిగినా నెక్స్ట్ థాట్ కూడా లేకుండా వాళ్ళని డిస్మిస్ చేసేస్తాడు ……. !!

అందుకే ఆఫీస్ అవర్స్ లో స్టాఫ్ మొత్తం చాలా అలర్ట్ గా ఉంటూ ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ వర్క్ చేస్తారు ….. !! మహాన్ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాడు అంటే స్టాఫ్ తలలు కూడా తిప్పకుండా ఫుల్ ఆఫ్ కాన్సెంట్రేషన్ తో వర్క్ చేస్తారు ……. !!

తన కార్ ఆఫీస్ ముందు ఆగడం తో మహాన్ కార్ డోర్ సెక్యూరిటీ ఓపెన్ చేయగానే మహాన్ గంభీరంగా & రాయల్ గా నడుస్తూ ఆఫీస్ లో కి ఎంటర్ అవుతాడు …… !! మహాన్ ను చూసిన స్టాఫ్ స్టిఫ్ గా నుంచుని విష్ చేస్తున్నా మహాన్ ఎవరికి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా జస్ట్ హెడ్ మూవ్ చేస్తూ డైరక్ట్ గా తన క్యాబిన్ లోకి వెళ్ళి సిస్టమ్ అన్ చేసి బ్లేజర్ కి ఉన్న బటన్స్ విప్పుతా తన చైర్ లో కూర్చుంటూ సిస్టమ్ ఆన్ చేసి అన్ని టెన్షన్స్ వదిలి వర్క్ స్టార్ట్ చేస్తాడు …… !!

మహాన్ ఆఫీస్ కి వచ్చాడని మ్యానేజర్ చలపతి చెప్పడంతో హనీష్ మహాన్ క్యాబిన్ కి వచ్చి తన ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుని మహాన్ వైపే సూటిగా చూస్తూ వుంటాడు ….. !! మహాన్ హనీష్ వైపు ఓ సారి చూసి మళ్లీ కళ్ళను స్క్రీన్ కే అప్పగించి వర్క్ మానేసి నన్ను చూస్తే ఎమ్ వస్తది హనీ ….. !? వెళ్ళి వర్క్ చెయ్ ఆఫీస్ అవర్స్ లో టైమ్ వేస్ట్ చేయటం నాకు అసలు నచ్చదు …… !! గో గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అని సిరియస్ టోన్ లో చెప్తాడు ….. !!

అదంతా తరువాత ముందు ఇది చెప్పు ?? నువ్వేంటి అపుడే ఆఫీస్ కి వచ్చావ్ …… ?? నువ్వో వన్ వీక్ రావని ఆఫిస్ అంతా పిస్ఫూల్ గా ఉంటుందని స్టాఫ్ తో పాటు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటే నువ్వొచ్చి మా ఆశల మీద యాసిడ్ పోశావ్ కదరా బాబు …… !!

మహాన్ హనీష్ వైపు కళ్ళు పైకి ఎత్తి సీరియస్ లుక్ ఇస్తూ నేను ఆఫీస్ కి రాకపోతే నీకు అంత హ్యాపీగా ఉంటుందా …… ?? అయినా నేను ఆఫీస్ కి రానని నువ్వెందుకు అనుకున్నావ్ …… ?? ఆఫిస్ లో ఇంత వర్క్ పెండింగ్ ఉంటే రాకుండా ఎలా ఉంటాను రా ఇడియట్ …….. !!

మార్నింగ్ మ్యారేజ్ చేసుకుని ఆఫ్టర్నూన్ కే ఆఫీస్ కి వచ్చిన ఫస్ట్ పర్సన్ నువ్వే రా బాబు నీ పేరు ను లేట్ చేయకుండా గిన్నీస్ బుక్ లో ఎక్కించాలి అంటూ వెక్కిరింతగా అంటాడు….. !!

మహాన్ కోపంగా తన ముందున్న ఫైల్ తీసి విసురుతూ స్టాప్ ఇట్ హనీ ఆ మ్యారేజ్ నేను ఎందుకు చేసుకున్నానో తెలిసి కూడా అలా ఎలా ఎక్స్పెక్ట్ చేశావ్ రా……. ?? భూమి ను మ్యారేజ్ చేసుకుంది కేవలం దీని ద్వారా ఆయన కి బుద్ది చెప్పడానికే …… !! ఆ విషయం మర్చిపోకూ అని పొగరుగా చెప్పి ఆపిన వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు …… !!

ఫైల్ ను క్యాచ్ పట్టుకుంటూ సో భూమి ను నువ్వు ప్రేమతో పెళ్ళి చేసుకోలేదు అంటావ్…… ?? తనను బాధ పెట్టడానికే చేసుకున్నా అంటావ్ అంతే కదా మహాన్ …… ??

వాట్ నేను దాన్ని లవ్ చేయడమెంటి …… ?? నీకు కూడా ఆ భూమి లా మైండ్ వర్క్ చేయట్లేదా హనీ ……. ?? నేను భూమి ను ప్రేమించినట్టు యాక్ట్ చేశాను నిజంగా నేను దాన్ని ప్రేమించలేదు ….. !! నా వరకు అది నా ఇంటి పనిమనిషి మాత్రమే తప్పా ఎప్పటికీ నాలో సగ బాగం కాలేదు …….. !! గాట్ ఇట్ మరో సారి ఈ టాపిక్ మన మధ్య రాకూడదు ఇక వెళ్ళి నీ వర్క్ చేసుకో & డోంట్ డిస్ట్రబ్ మీ అని గంభీరంగా చెప్పి సిరియస్ గా వర్క్ చేస్తూ ఉంటాడు ……. !!

హహ లవ్ చేయట్లేదు అని నువ్వు చెప్పినంత మాత్రాన నమ్మడానికి నేనేం స్కూల్ కి వెళ్ళే పిల్లాడిని కాదు మహాన్ ……. !! నిజంగా భూమి మీద నీకు ప్రేమ లేకపోతే తన పేరు ఇలా చేతి మీద టాటూ వేయించుకోవ్ …… !! నీకు మీ నాన్న మీద వున్న పగ భూమి మీద ఉన్న ప్రేమను కనపడకుండా దాచేస్తుంది …… !! అది ఎన్నో రోజులు దాగదు అది బయట పడ్డ రోజు భూమి ను ఎందుకు బాధ పడ్డానా అని ఫీల్ అవుతావ్ ….. ?? అనుకుంటూ మహాన్ క్యాబిన్ నుండి వెళ్లిపోతాడు …… !!

హనీష్ వెళ్ళిపోయాక ఇడియట్ ఎప్పుడు ఆ భూమి బజన చేస్తు వుంటాడు …… !! అది ఎలాంటిదైనా దాని వల్లే మేము చిన్నప్పటి నుంచి సింగిల్ పేరెంట్ గా పెరిగాం …….. !! మామ్ ఆయన విడిపోవడానికి అదే కారణం …… !! నాకు చిన్నప్పటి నుంచి అదంటేనే కోపం, అసహ్యం అలాంటి దాన్ని ప్రేమిస్తాను అని ఎలా అనుకున్నావ్ రా పిచ్చి …… ?? అది ఎప్పటికీ నా ఇంటి పనిమనిషిగానే ఉండాలి అది చూసి ఆయన కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని గట్టిగా పిడికిలి బిగించి ఏదో ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాడు …… !!

ఎంత ఆలోచించినా మహాన్ ప్రేమ అబద్దం అంటే తన మనసు, మెదడు రెండు ఒప్పుకోవడం లేదు…… !! మహాన్ నిన్ను నిజంగా ప్రేమించాడు అని మెదడు చెప్తూ ఉంటే తన చేతికి గాయం చేసిన మహాన్ బిహేవియర్ గుర్తు చేసుకుంటూ ఎందుకు మహాన్ ఇలా మారీపోయావ్ ……. ?? నిజంగా నువ్వు నన్ను ప్రేమించినట్టు నటించావా ?? కానీ నా పిచ్చి మనసు ఇంకా అది నమ్మలేక ఇదంతా కళ అయితే ఎంత బావుంటుంది అని పిచ్చిగా కోరుకుంటుంది మహాన్ 🥹♥️ ……. !!

 

నా మీద నీకు ఇంత ద్వేషం ఉందని కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు …… !! నాకు చిన్న గాయం అయినా తట్టుకోలేని నువ్వు ఇలా గాయం చేస్తు ఉంటే నా గుండె తట్టుకోలేకపోతుంది …… !! నిన్ను ఎలా మార్చాలో తెలియడం లేదు ?? అని డల్ గా కూర్చుని ఆఫ్టర్ నూన్ లంచ్ కూడా తినకుండా ఈవెనింగ్ వరకు ఆలోచనల తోనే కడుపు నింపుకుని ఉన్న చోటు నుండి ఒక్క ఇంచ్ కూడా కదలకుండా కూర్చుంటుంది…… !!

భూమి మధ్యాహ్నం కూడా నువ్వు బోజనం చేయలేదు ….. !! ఇదిగో ఈ కాఫి అయినా తాగు అని కప్ తన ముందు పెట్టిన రేణుక ను చూసి తల నొప్పిగా వుండడం తో మారు మాట్లాడకుండా కప్ అందుకుని కాఫి సిప్ చేస్తూ ఉంటుంది ……. !!

భూమి పెద్దమ్మ గారు చెప్పినట్టు మీ ఇంటికి వెళ్ళిపో భూమి అమ్మ గారు చెప్పింది నిజం …… !! ఈ ఇంట్లో మనుషులను నువ్వు ఎప్పటికీ మార్చలేవు !! ఎందుకంటే అమ్మ గారు తప్పా మిగిలిన నలుగురికి చాలా పొగరు & డబ్బుంది ఆన్న అహంకారం ఎక్కువ …… !! ఇలా అంటున్నానని మరోలా అనుకోకు భూమి మహాన్ బాబు నందన అమ్మ గారిని కాదని నిన్ను ఎప్పటికీ ప్రేమించలేడు …… !! నా మాట విని వెళ్ళిపోమ్మా నన్ను నోరారా అక్క అని పిలిచావ్ ఆ చనువు తోనే చెప్తున్నా అంటూ భూమి చెయ్ పట్టుకుని అభిమానంగా చెప్తుంది ……. !!

నా మీద నీకున్న ప్రేమ కు చాలా థాంక్స్ అక్క అని చిన్న స్మైల్ ఇచ్చి ఈ ఇంట్లో నన్ను మనిషిలా చూసింది ముందు నువ్వైతే తర్వాత నానమ్మ  ……. !! మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెల్లుపోమని ఎన్ని సార్లు చెప్పినా నా నుండి వచ్చే సమాధానం ఒక్కటే …… !! ఇది నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ ను వదిలి నేను ఎందుకు వెళ్తాను …… ??

 

మహాన్ ను నేను వెంటనే మార్చాలేక పోవచ్చు బట్ ఆలస్యంగా అయినా నా ప్రేమతో తనను మార్చి నాది నిజమైన ప్రేమ అని ప్రూవ్ చేసుకుంటాను …… !! ఆలాగే మావయ్య అత్తయ్య విషయం లో ఎమ్ జరిగి వాళ్ళు విడిపోయారో నాకు క్లారిటీ గా తెలియదు …… !! కానీ నా వల్ల విడిపోయిన వాళ్ళని నేనే కలిపి అత్తయ్య కి నా మీదున్న కోపం కొంచెం అయినా తగ్గేలా చేస్తాను …… !! ఇది ఒక్క రోజులో జరుగుతుంది అని చెప్పను బట్ జరిగే వరకు నా ప్రయత్నాలు ఆపను అని స్థిరంగా చెప్పి కప్ తీసుకుని కిచెన్ లోకి వెల్తుంది …… !!

భూమి వెళ్ళిన వైపే బాధగా నిట్టూర్చి పిచ్చి పిల్ల మారడానికి వాళ్ళు మనుషులు కాదమ్మా నిలువెల్లా పొగరు అహంకారం నిండిన రాక్షసులు …… !! అమ్మాయివి అని కూడా చూడకుండా నిన్ను ఎంత టార్చర్ పెడుతున్నారో చూసి కూడా ఇంకా వాళ్ళు మారుతారు అనే అనుకుంటున్నావా ?? అని అక్కడి నుండి లోపలికి వెల్తుంది ….. !!

గార్డెన్ లో నుండి చేతిలో ప్లేట్ తో ఇంటి ముందు కు వెళ్తున్న రేణుక ను చూసి అక్క ఎంటీవీ ?? ఎక్కడికీ వెళ్తున్నావ్ …… ?? అంటూ ప్లేట్ లో ఉన్న గులాబీల దండ తో పాటు రకరకాల రోజా పూలు, మందారం, చామంతి,బంతి పూలు ఇంకా రోజా పూల రెక్కలను చూసి అయోమయంగా అడుగుతుంది …… !!

ఇంటి ముందున్న కృష్ణుడి విగ్రహం కి అలంకరించడానికి భూమి …… !! అదంటే మహాన్ బాబు కి చాలా ఇష్టం దాన్ని డెయిలీ అలంకరించాలి …… !! లేకపోతే  మహాన్ బాబు కోప్పడతారు …….. !! బాబు గారు వచ్చే టైమ్ అవుతోంది …… !! అందుకే వెళ్తున్నా అని చెప్తున్న రేణుక చేతిలోని ప్లేట్ తీసుకుని అది నేను చేస్తాను నువ్వు ఎదైనా వర్క్ ఉంటే చూసుకో అక్క …… !!

పర్లేదు భూమి పెద్ద వర్క్ ఏమి లేదు ఇలా ఇవ్వు నేను చేస్తాను నీకెందుకు శ్రమ……. !! నీ మూడ్ కూడా బాలేదు కాసేపు ప్రశాంతంగా కూర్చో మళ్ళీ నందన అమ్మ గారు వస్తే కావాలని నీకు ఎదో ఒక పని చెప్తూనే ఉంటుంది …… !!

మార్నింగ్ నుండి ఇలా చెప్పే నాతో ఒక్క పని చేయించలేదు …… !! కాళిగా ఉంటే నాకేం తోచడం లేదు అక్క ఇలా వర్క్ చేస్తూ ఉంటే అయినా నా మైండ్ డైవర్ట్ చేసుకుంటాను ….. !! అని రేణుక చెప్తున్నా వినకుండా వెనక్కీ తిరిగి పర్లేదక్క నేను చేస్తాను …… !! నాకు పూజ చేయటం ఇష్టం అని చెప్తూ ఇంట్లోకి వస్తున్న మహాన్ ను చూడకుండా డాష్ ఇవ్వడం తో స్లిప్ అయ్యి కింద పడుతున్న భూమి ను తనకే తెలియకుండా తన నడుము చుట్టు చేతులు వేసి పట్టుకుని ఆలాగే వుండిపోయాడు మహాన్…… !!

 

మహాన్ కు తను డ్యాష్ ఇవ్వగానే చేతిలోని ప్లేట్ గాల్లోకి ఎగిరి అందులో ఉన్న గులాబీ దండ ఇద్దరి మెడలో పడి వాళ్ళ మీద పూలు అభిషేకిస్థాయి …… !! అదే చూసిన రేణుక నవ్వుతూ ఇద్దరినీ చూసి మెటికలు విరుస్తూ ఎంత చక్కగా ఉన్నారో ఇద్దరూ మహాన్ బాబు మారి భూమి ను భార్యగా స్వీకరిస్తే బావుంటుంది అని ఇద్దరి వైపు ఆనందంగా చూస్తూ ఉంటుంది….. !!

మార్నింగ్ వెళ్ళేముందు పని మనిషి లా ఉన్న భూమి ….. !! ఇప్పుడు మంచి చీర కట్టుకుని ఎటువంటి మేకప్ లేకపోయినా కళ్ళకి కాజల్ పెట్టడం తో తన అందమైన కళ్ళు మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి……. !! మహాన్ కళ్లకు భూమి రతీదేవిలా కనబడుతోంది ఎందుకంటే భూమి ని!! దేవుడు స్వయంగా తన చేత్తో చెక్కినట్లు అజంతా శిల్పం లా ఉంటుంది …… !! చీర లో తన అందం మరింత రెట్టింపు అవుతుంది …… !! అందుకే మహాన్ గులాబీ రేకులు భూమి పెదవుల మీద పడి మరింత అందంగా కనిపిస్తూ ఉంటే తనను రెప్ప వేయక ఆలాగే ట్రాన్స్ లో ఉన్నట్లు చూస్తు వుండిపోయాడు ……. !!

సూటిగా చూస్తున్న మహాన్ చూపులు తనను తడుముతూ ఉంటే ఆ కళ్ళలోకి సూటిగా చూడలేక మహాన్ తో వదలమని చెప్పాలి అనుకున్నా తన నడుము మీద బిగుసుకున్న మహాన్ చేతి స్పర్శ కి మాటలు రాక మూగబోతుంది ……. !! మాట్లాడుకుని వచ్చినట్టు ఒకే సారి ఇంటికి వచ్చిన శ్లోక, నందన, విజయేంద్ర ప్రసాద్ లు వాళ్ళను అలా చూసి గార్డెన్ లోకి వస్తూ అక్కడ ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ నుంచున్న వాళ్ళను అలా చూసి షాక్ కొట్టినట్టు నిలబడతారు …… !!

అత్త కి బారీగా షాక్ కొట్టినట్టు ఉంది 😜🤭 నాకు ఎందుకో మహాన్ భూమి ను లవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది మరి మీకు 🥱?

 

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply