కార్తీక్ ఇంకా నీ దాకా విషయం రాలేదు అనుకుంటా….. !! అసలు విషయం ఏంటో తెలుసా నీ కూతురు శ్లోక & నీ మేనల్లుడు రాజ్ లవ్ లో ఉన్నారు అని అనంత్ నవ్వుతూ చెప్పగానే…….. !! ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి చైర్ నుండి పైకి లేచి షాక్ అవుతాడు కార్తికేయ…… !! నిజం కార్తీక్ భూమి & మహాన్ ఎలా అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారో వీళ్ళు కూడా అలాగే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు మే బీ ఈ విషయం గురించి రాజ్ నీకు త్వరలోనే చెప్తాడు అనుకుంటా…… !! అనవసరంగా ఈ సర్ప్రైజ్ నీకు రివీల్ చేసినట్టు ఉన్నాను ఎలా అయితే ఏంట్రా నీ కూతురు కోడలిగా నీ ఇంటికి రాబోతుంది దిస్ ఇస్ రియల్లీ గుడ్ న్యూస్…… !!
చాల్లే ఆపు అనంత్ ఇది గుడ్ న్యూస్ ఎలా అవుతుంది….. ?? ఇప్పటికే భూమి పెళ్ళి వల్ల మా ఫ్యామిలీస్ మధ్య డిస్టెన్స్ చాలా పెరిగింది…. !! ఇప్పుడు రాజ్ & శ్లోక పెళ్ళి చేసుకుంటే ఇక ఒకరిని ఒకరం చంపుకోవటం ఖాయం….. !! అయినా వాళ్ళు లవ్ చేసుకోవడం ఏంట్రా ఎప్పుడు చూడు ఇద్దరూ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు….. !! 2 డేస్ బ్యాక్ కూడా ఇద్దరికీ పెద్ద గొడవ అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది అలాంటి వాళ్లు ప్రేమలో ఉండడం ఏంటి…… ??
ఎమ్ గొడవ పడితే ప్రేమించకూడదా అలా అయితే నీకు నందన కి కూడా పడేది కాదు కదా కార్తీక్.,…. !! అలాంటి నందన నీ కోసం సూసైడ్ దాకా వెళ్ళలేదా….. ?? ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా చెప్పగలం చెప్పు మే బీ మీ లాగే మీ పిల్లలు కూడా ముందు కొట్టుకుని తర్వాత ప్రేమలో పడ్డారేమో…… ??
హ్మ్మ్ ఇలాంటి ఫిలాసఫీ చెప్పడానికి నీ వర్క్ మానుకుని మరీ నా వర్క్ డిస్టర్బ్ చేయడానికి వచ్చావా…….. ?? నాకు రాజ్ గురించి బాగా తెలుసు వాడికి మ్యారేజ్ గురించి థింక్ చేసే టైమ్ & ఇంట్రెస్ట్ రెండు లేవు…… !! భూమి లైఫ్ ను సెట్ చేసే వరకూ మ్యారేజ్ టాపిక్ తీసుకుని రాకండి అని ఇంట్లో కూడా చెప్పాడు …….. !! సో నువ్వు నా కూతురి పెళ్ళి గురించి కాకుండా నీ కూతురి ఎంగేజ్మెంట్ గురించి ఆలోచించు …….. !!
కార్తీక్ నేను చెప్తోంది నిజం నీ కూతురు & అల్లుడు నా కళ్ళ ముందే బైక్ లో హగ్ చేసుకుని కూర్చోవడం నా కళ్ళ తో చూసాను….. !! నేను చెప్పాను అని కాదు కానీ ఈ విషయం గురించి రాజ్ తో నువ్వే డైరెక్ట్ గా మాట్లాడు అప్పుడు తనే చెప్తాడు తన ప్రేమ గురించి……. !!
ఇందుకే డాక్టర్ చదువు చదవద్దు అని అప్పట్లో చెప్పింది…… !! చదివి చదివి సైట్ తెచ్చుకున్నావ్ ఇప్పుడు చూడు స్పెట్స్ పెట్టుకోక పోవడం వల్ల ఎవర్నో చూసి రాజ్ అనుకుని పొరపాటు పడ్డావ్….. !! ఇంకెప్పుడు స్పెట్స్ లేకుండా బయటకు రావద్దు అనంత్ అని నవ్వుతున్న కార్తీకేయ వైపు చూస్తూ…… !! నేను చెప్పింది నిజం అని నీకు తెలిసిన రోజున నువ్వే ఒప్పుకుంటావ్ అనంత్ నువ్వు చెప్పింది నిజం అని అప్పుడు చెప్తా నీ సంగతి…… !! అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్తున్న అనంత్ ను చూసి నవ్వుకుంటూ తన వర్క్ తో బిజి అవుతాడు కార్తికేయ………. !!
✨✨✨✨✨✨✨✨✨✨
కాల్ మాట్లాడుతూ పక్కకు చూసిన రాజ్ కి అందంగా నవ్వుతూ కనిపిస్తుంది వెన్నెల….. !! తనను చూసిన రాజ్ కాల్ యూ లేటర్ అని చెప్పి కాల్ కట్ చేసి వెన్నెల నువ్వా ఏంటి ఇలా వచ్చావ్…… ?? అని అడుగుతూ తన ముందుకు వచ్చి నుంచుంటాడు…… !! రాజ్ ను అంత దగ్గరగా చూస్తున్న వెన్నెల కి నోటి నుంచి మాట కూడా రాక అలా చూస్తూ ఉండిపోతుంది….. !!
వెన్నెల….. ??
హా రాజ్ గారు బావున్నారా…… ??
యాహ్ ఐ ఆమ్ గుడ్ నువ్వెలా ఉన్నావ్……. ??
వెన్నెల చిన్నగా సిగ్గు పడుతూ బావున్నా అండి …… !! మీరు వచ్చారని అమ్మ మీ కోసం స్వీట్ పంపింది అంటూ బాక్స్ రాజ్ చేతిలో పెడుతూ చిన్నగా నవ్వుతూ చూస్తుంటుంది…… !!
థాంక్ యూ వెన్నెల నేను ఎప్పుడూ ఫ్లాట్ కి వచ్చినా ఏదో ఒకటి తెస్తూ ఉంటావ్ అని నవ్వుతూ….. !! బాక్స్ ఓపెన్ చేసి స్వీట్ తీసుకుని టేస్ట్ చేస్తూ హ్మ్మ్ యమ్మీ చాలా బావుంది నువ్వే చేసావా…… ??
లేదు రాజ్ గారు అమ్మ చేసింది….. !!
ఓహ్ నైస్ ఇంతకీ నీ స్టడీస్ ఎలా ఉన్నాయి…… ??
ఆల్ గుడ్ అండి మీరు ఇవాళ ఇక్కడే ఉంటారా లేదా స్టేషన్ కి వెళ్ళిపోతారా…… ??
ఈవెనింగ్ దాకా ఉంటాను వెన్నెల ఎమ్ ఎందుకు అలా అడుగుతున్నావ్ …… ?? నాతో ఏమైనా వర్క్ ఉందా…… ??
అయ్యో అదేం లేదండి మీకు లంచ్ తీసుకుని రావడానికి అడిగాను అంతే….. ?? మీరు బయట నుండి ఎమ్ తెప్పించకండి లంచ్ కూడా నేనే తీసుకుని వస్తాను…… !! మీకు వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా లేదా అది ఇది రెండు కావాలా మీరు చికెన్ ఇష్టంగా తింటారు కదా…… ?? చికెన్ లో చాలా వెరైటీస్ నాకు తెలుసు నేనే కుక్ చేసి తీసుకుని వస్తాను…… !!
వెన్నెల రిలాక్స్ నాకు స్వీట్ తెచ్చావ్ గా ఇది చాలు నాకు ఇంకేం కష్టపడి కుక్ చేయకు….. !! హాల్ లో ఒక అమ్మాయి ఉంది కదా తను నా మరదలు నా కోసం తనే కుక్ చేస్తుంది నువ్వు కష్ట పడకు …… !! నువ్వు వెళ్ళి చదువుకో అంటూ అక్కడి నుండి హాల్ లోకి వెళ్తున్న రాజ్ వైపు అలానే చూస్తూ ఉంటుంది వెన్నెల…… !!
రాజ్ రావడం చూసిన శ్లోక ఫాస్ట్ గా వెళ్ళి సోఫా లో కూర్చుని టీవీ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది….. !! రాజ్ కూడా వచ్చి శ్లోక పక్కన కూర్చుని ఏంటి హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నావ్ వెళ్ళి కుక్ చెయ్ ఐ ఆమ్ ఫీలింగ్ హంగ్రీ….. !! ఈ ఈ 😬😬నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా కూర్చోనివ్వడు వీడు అయినా ఆ అమ్మాయి లంచ్ తెస్తాను అన్నా కావాలని నన్నే కుక్ చేమంటున్నాడు దొంగ సచ్చినోడు….. !!
ఇన్నర్ లో సౌండ్ లేకుండా తిట్టుకుంది చాలు కానీ వెళ్ళి కుక్ చెయ్… !! దేవుడా వీడ్ని మనసులో తిట్టుకున్నా కనిపెట్టేస్తున్నాడు అనుకుంటూ 😁 పళ్ళు కనిపించేలా నవ్వుతూ నిన్ను నేను ఎందుకు తిట్టుకుంటాను రాజ్ అంటూ విసుగ్గా కిచెన్ లోకి వెళ్తున్న శ్లోక ను చూసి రాజ్ నవ్వుకుంటాడు …… !!
రూమ్ లో నుండి బయటకు వచ్చిన వెన్నెల రాజ్ వైపు చూస్తూ చేతులు నలుపుకుంటూ…… !! అడగాలా వద్దా అడిగితే తప్పుగా అనుకుంటాడేమో కానీ వీళ్ళ మధ్య రిలేషన్ అర్థం అవ్వట్లేదు అనుకుంటూ…… !! రాజ్ ముందుకు వచ్చి నుంచుని కంగారుగా రాజ్ వైపు చూస్తుంది….. !!
నువ్వు ఇంకా వెళ్ళలేదా అని సీరియస్ గా వినిపించిన రాజ్ వాయిస్ కి ఉలిక్కిపడి….. !! హా వెళ్తున్న రాజ్ గారు బై అంటూ అక్కడి నుండి పరిగెడుతూ వెళ్ళిపోతుంది….. !! ఏంటీ అమ్మాయి బిహేవియర్ విచిత్రంగా ఉంది అని వెన్నెల వైపు చూస్తూ తన చూపు తిప్పేస్తాడు రాజ్…….. !!
💫💫💫💫💫💫💫💫💫💫💫
(మహాన్ & రాజ్ మధ్య 1 డే టైం డిఫరెన్స్ ఉంది సో కన్ఫ్యూస్ అవ్వకండి రాజ్ ఒక రోజు వెనుక ఉన్నాడు గమనించండి 😶😌)
ఆఫీస్ కి రెడీ అయ్యి హాల్ లోకి వచ్చి కూర్చుంటూ…… !! గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అంటూ విష్ చేస్తున్న మహాన్ వైపు కోపంగా చూస్తూ మొహం తిప్పుకుంటుంది దేవయాని….. !! ఏమైంది అమ్మమ్మ ఎందుకలా ఉన్నావ్ వొంట్లో బాలేదా అని అడుగుతున్న మహాన్ వైపు సూటిగా చూస్తూ…… !! నేనెలా ఉంటే మీకు ఎందుకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు కదా మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి …… !!
వాట్…… ?? అసలేం మాట్లాడుతున్నావ్ అమ్మమ్మ నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావ్ అయినా ఎందుకంత కోపంగా ఉన్నావ్…. ?? దేవయాని కోపంగా చూస్తుంది తప్పా నోరు తెరవదు దాంతో అసహనంగా చూస్తూ కూర్చున్న మహాన్ కళ్ళు ఎవరో రెండు చేతులతో మూసేస్టారు……. !!
శ్లోక ఏంటీ ఆటలు
నేను శ్లోక ను కాదు నన్ను నువ్వు ఇంకా గుర్తు పట్టలేదా మహాన్
తియ్యగా వినిపించిన వాయిస్ ను గుర్తు చేసుకుంటూ ఏయ్ ఇషా అనగానే…….. !! ఇషా నవ్వుతూ మహాన్ ముందుకు వచ్చి సర్ప్రైజ్ అని అందంగా నవ్వుతుంది……. !!
వావ్ ఇషా నువ్వా ఎప్పుడొచ్చావ్ అని అడుగుతూ నవ్వుతూ ఇషా ను హగ్ చేసుకుంటాడు మహాన్…… !! అప్పుడే అక్కడికి వచ్చిన భూమి వీళ్ళను అలా చూసి నాలుగు అడుగుల దూరం లోనే ఆగిపోతుంది అది చూసిన ఇషా నవ్వుతూ…… !! మహాన్ ను మరింత గట్టిగా హగ్ చేసుకుని మిస్ యూ మహాన్ అంటూ దూరం జరుగుతుంది…… !!
మిస్ యూ టూ ఇషా సో లాంగ్ కదా మనం మీట్ అయ్యి….. !! అసలు ఇండియా ఎప్పుడూ వచ్చావ్ ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వు వస్తున్నట్టు ఐ ఆమ్ రియల్లీ వెరీ హ్యాపీ….. !! నిన్ను సర్ప్రైజ్ చేయాలని చెప్పకుండా వచ్చేసాను మహాన్ యూ నో నిన్ను బాగా మిస్ అవుతున్నా అందుకే వచ్చేశా…… !!
హో రియల్లీ అని నవ్వుతూ అమ్మమ్మ తను గుర్తుందా నా స్కూలింగ్ డేస్ లో నాతో పాటు చదువుకున్న ఇషా…… !! ఆ మా పరిచయాలు అయ్యాయి నిన్ననే చూశాను ఈ అమ్మాయిని అంటూ మూతి తిప్పుతూ చెప్తుంది దేవయాని….. !!
ఇషా నువ్వు నిన్న నే వచ్చావా మరి నాకు కనిపించలేదు ఏంటి…. ?? నువ్వు ఆఫీస్ వర్క్స్ లో బిజీగా ఉన్నావ్ మహాన్ అందుకే కనిపించలేదు ఇంకేంటి ఎలా ఉంది నీ లైఫ్….. ?? ఆల్ గుడ్ అని చిన్నగా నవ్వుతూ తన దూరంగా నుంచుని తమ వైపు చూస్తున్న భూమి ను చూసి… !! అక్కడే ఆగిపోయావ్ ఏంటి ఇలా రా అని భూమి ను దగ్గరకు పిలిచి తను వచ్చాక భూమి చెయ్ పట్టుకుని…… !! ఇషా తన పేరు భూమి మై వైఫ్ అని పరిచయం చేయగానే అప్పటి వరకూ నవ్వుతున్న ఇషా మొహం ఒక్కసారిగా మాడిపోతుంది అది చూసిన భూమి పొగరుగా నవ్వుకుంటూ ఉంటుంది…… !!
భూమి తన పేరు ఇషా నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేస్తాడు మహాన్….. !! హాయ్ ఇషా అని నవ్వుతూ ఇషా ను లాగి మరీ హాగ్ చేసుకుంటూ ఎంటే షాక్ అయ్యావా తను నా మహాన్…….. !! తను ఎప్పటికీ నన్నే ప్రేమిస్తాడు ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి వచ్చిన దారినే దొబ్బెయ్ అంటూ నవ్వుతూ ఇషా కి దూరం జరుగుతుంది…..!
ఇషా భూమి వైపు కోపంగా చూస్తూ మహాన్ ముందు బ్యాడ్ అవ్వడం ఇష్టం లేక నవ్వలేక నవ్వుతూ…….. !! నీకు మ్యారేజ్ అయిందని ఒక్క సారి కూడా చెప్పలేదు ఏంటి మహాన్ అంటూ భూమి వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది…… !! ఆన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది ఇషా ఇంకేంటి కబుర్లు నువ్వు ఎప్పుడూ పప్పన్నం పెడుతున్నావ్…… ?? అనగానే ఇషా కి పొలమారి దగ్గుతూ ఉంటుంది అది చూసిన భూమి, దేవయాని ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు……. !!