వాట్ కనిపించడం లేదా యూ ఫూల్ ఎక్కడ పెట్టావ్ రా ఇడియట్…… !! అని డ్రైవర్ చంప పగల కొట్టిన శ్లోక రాజ్ వైపు గుటకలు మింగుతూ చూడగా రాజ్ తన వైపు సూటిగా చూస్తూ కనిపిస్తాడు…… !! అయిపోయింది అంతా అయిపోయింది వీడు నన్ను ఇప్పుడు డీ ఫ్రై చేసుకుని తింటాడు అని రాజ్ వైపు చూస్తుంది ☹️ ……. !!
హ్మ్మ్….. !! కార్ లో బయటకు వచ్చినప్పుడు మినిమం డ్రైవింగ్ లైసెన్స్ అయినా పెట్టుకోవాలి ఆ మాత్రం కూడా తెలియక పోతే ఎలా శ్లోక….. !! ప్చ్ ఇప్పుడు చూడు అవి లేకపోవడం వల్ల ఇవాళ నువ్వు నడి రోడ్ మీద నుంచున్నావ్…… !! ఇప్పుడు నిన్ను చూసి చూడనట్టు నా మరదలే కదా అని వదిలేస్తే మీ రిలేషన్ కాబట్టి వదిలేసారు మీ వాళ్ళకు ఒక రూల్ పబ్లిక్ కి ఒక రూలా అంటూ….. !! అందరూ గొడవ చేసి రచ్చ చేసి దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారు అబ్బా పెద్ద సమస్యే వచ్చి పడిందే ఇప్పుడేం చేద్దాం చెప్మా అని ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టుకుంటాడు 😌 రాజ్…… !!
వీడు నన్ను కావాలనే ఆడుకుంటున్నాడు 😬😬 అని మొహాన్ని చిరాగ్గా పెట్టుకొంటూ….. !! అవన్నీ డ్రైవర్ చూసుకుంటాడు వాటితో నాకేంటి పని & నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే డెఫినెట్ గా వాటిని క్యారీ చేస్తాను…… !! ఇట్స్ ఒకే లైసెన్స్ లేదు కాబట్టి ఫైన్ ఎంత అయిందో చెప్పు పడేస్థా అని మరింత పొగరుగా చెప్తున్న శ్లోక ను చూసి……. !! యాక్చుఎల్లీ ఇది వరకూ లైసెన్స్ లేకపోతే ఫైన్ కట్టించుకునే వాళ్ళం బట్ నౌ డైరెక్ట్ గా తీసుకెళ్లి లాక్ అప్ లో పడేయడమే 😎 …… !! ఇక ఫైన్ అంటావా దాని గురించి కోర్ట్ లో జడ్జ్ గారు డీటెయిల్డ్ గా చెప్తారు షల్ వుయ్ మూవ్ శ్లోక ……. !!
ఓరి దేవుడా మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాలా…… ?? ఉహు ఒక సారి వెళ్ళినందుకే నా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు మొత్తం పోయింది ఇప్పుడు మళ్ళీ నేను స్టేషన్ కి వెళ్ళాను అని తెలిస్తే వాళ్ళు నన్ను అస్సలు కేర్ చేయరు…… !! వీడ్ని ఏదోలా మస్కా కొట్టి ఇక్కడి నుండి అర్జంట్ గా ఎస్కేప్ అవ్వాలి కానీ ఎలా వీడు పెద్ద జాదూ నా మాట అస్సలు వినడు ఇప్పుడెలా 🤔🤔 …… ??
శ్లోక స్టేషన్ కి నా కార్ లో వెళ్దామా లేదా నువ్వు నీ కార్ లో వస్తావా ఛాయిస్ కూడా నీకే వదిలేస్తున్నా ఎంతైనా నాది జాలి గుండె కదా 😌 …… !! శ్లోక రాజ్ వైపు ఏడుపు మొహం పెట్టుకుంటూ నీతో 5 మినిట్స్ పర్సనల్ గా మాట్లాడాలి ప్లీస్ రాజ్ ☹️ …. !!
ఇప్పుడు దారిలోకి వాచ్చావే అని నవ్వుకుంటూ అదేంటీ శ్లోక ఇందాక ఉన్న బేస్ ఇప్పుడు నీ వాయిస్ లో లేదు ఏమైంది…… ?? వీడు టైమ్ చూసి నన్ను ఆడుకుంటున్నాడు 😬 దొంగ సచ్చినోడు ……. !! అని తిట్టుకుంటూ అదీ…. అదీ….. సారీ రాజ్ ఏదో తెలియక మాట్లాడాను ప్లీస్ ఒక్క 5 మినిట్స్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్న శ్లోక ను చూసి…… !! ఒకే పదా అంటూ శ్లోక ను పక్కకు తీసుకుని వచ్చి ఇప్పుడు చెప్పు ఎమ్ మాట్లాడాలి అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటాడు…… !!
రాజ్ మామ్ & అన్నయ్య లకు సొసైటీ లో ఎంత నేమ్ ఉందో నీకు కూడా తెలుసు కదా…… !! ఇప్పటికే నేను స్టేషన్ కి వెళ్ళాను అని మామ్ కి తెలిసిన వాళ్ళు కాల్ చేసి అడుగుతూ పెద్ద రచ్చ చేశారు…… !! ఇప్పుడు మళ్ళీ నేను స్టేషన్ కి వెళ్తే మామ్ తల ఎత్తుకోలేదు ప్లీస్ రాజ్ ఎంతైనా నేను నీకు తెలుసు కదా…… !! ఇదొక్క హెల్ప్ చేయవా నేను ఇంకెప్పుడు నీతో గొడవ పడను ఇట్స్ మై పింకీ ప్రామిస్…….. !!
హ్మ్మ్….. !! చేయచ్చు బట్ ఇందులో కొంచెం రిస్క్ ఉంది అయినా కూడా నీ కోసం రిస్క్ తీసుకుని నిన్ను వదిలేస్తాను అనగానే….. !! మాయ నవ్వుతూ థాంక్స్ రాజ్ ఇక వెళ్తాను బై యూ టేక్ కేర్ అంటూ అక్కడి నుండి వెళ్లబోతుంది…… !! ఓహ్ హలో స్టాప్ స్టాప్ అని శ్లోక కి అడ్డుగా నుంచుంటూ నీకు హెల్ప్ చేయాలి అంటే నువ్వు నాతో ఈవెనింగ్ దాకా టైమ్ స్పెండ్ చేయాలి……. !! అలా చేస్తాను అని ప్రామిస్ చేస్తేనే నీకు హెల్ప్ చేస్తాను లేదా ఇప్పుడే స్టేషన్ కి వెళ్దాం…… !!
ఏంటి….. ?? నేను నీతో టైం స్పెండ్ చేయాలా అది కూడా ఈవెనింగ్ వరకూ నో వే నాకు నువ్వంటే ఇష్టం లేదు…… !! అలాంటి నీతో ఈవెనింగ్ దాకా నో వే నా వల్ల కాదు నిన్ను చంపేయమని చెప్పు……. !! ఇప్పుడే కత్తి తీసుకుని కస కసా పొడిచి మరీ చంపేస్తా అంతే కానీ నీతో ఈవెనింగ్ వరకూ నేను ఉండను అంతే…… !!
ఇస్ ఇట్….. !! ఒకే శ్లోక ఇందులో ఎలాంటి బలవంతం లేదు పదా స్టేషన్ కి వెళ్దాం….. !! వెంటనే ఎఫ్. ఐ. ఆర్ రెడీ చేసి నిన్ను కోర్ట్ కి తీసుకుని వెళ్ళాలి అసలే టైం చాలా తక్కువ ఉంది….. !! నీకు శిక్ష 15 రోజులు పడొచ్చు లేదా నెల రోజులు అయినా పడొచ్చు నువ్వు రెడీ నే కదా లెట్స్ మూవ్ అంటూ శ్లోక చెయ్ పట్టుకుని ముందుకు కదులుతాడు…… !!
నో….. నో….. రాజ్ ప్లీస్ వెయిట్ నేను స్టేషన్ కి రాను….. !! నేను ఇలా స్టేషన్ కి వెళ్ళాను అని తెలిస్తే మామ్ చంపేస్తుంది ప్లీస్ సేవ్ మీ ☹️ …… !! చూడు శ్లోక అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా ఏదోటి డిసైడ్ అవ్వు…… !! ఒకటి నాతో ఈవెనింగ్ వరకూ టైం స్పెండ్ చేసి హ్యాపీగా మీ ఇంటికి వెళ్ళిపోతావా…… ?? రెండు స్టేషన్ కి వెళ్ళి అటు నుండి కోర్ట్ కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఏడుస్తూ జైల్ కి వెళ్తావా…… ?? త్వరగా ఒక్కటి సెలెక్ట్ చేసుకో 5 కౌంట్ చేస్తాను నీ నిర్ణయం ఎంటో చెప్పాలి……. !!
చచ్చాను 🙆🙆 ముందు నుయ్యి వెనుక గొయ్యి లా ఉంది నా పరిస్థితి…… !! పౌరుషానికి పోయి జైల్ కి వెళ్ళడం కంటే వీడితో కాంప్రమైజ్ అయ్యి ఈవెనింగ్ వరకూ వీడితో ఉండడం బెటర్ అనుకుంటూ రాజ్ వైపు చూస్తుంది…… !!
5…..4…..3…..2 ….. ఆ…. ఆ…. రాజ్ వెయిట్ నేను నీతో రావడానికే డిసైడ్ అయ్యాను ప్లీస్ ఇక అపేయ్ అని టెన్షన్ తగ్గించుకుంటూ చెప్తుంది…… !! నాకు తెలుసే నువ్వు కాంప్రమైజ్ అవుతావు అని ఎవరనుక్కునావే ఇక్కడ ఏ .సీ. పీ. స్వరాజ్ 😎😎 అని శ్లోక వైపు యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ….. !! సరే నీ డ్రైవర్ ను నీ కాలేజ్ దగ్గరకు వెళ్ళి వాడ్ని అక్కడే ఈవెనింగ్ వరకూ వెయిట్ చేయమని చెప్పు….. !! నిన్ను నేను ఈవెనింగ్ మీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను ఎవరికీ డౌబ్ట్ రాకుండా నువ్వు హ్యాపీగా అక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు…… !?
హు తప్పుతుందా చచ్చినట్టు వీడు చెప్పింది చేయాలి…… !! నన్ను టైమ్ చూసి లాక్ చేసావ్ కదా నిన్ను ఊరికే వదిలి పెట్టను చూస్తూ ఉండు….. !! అని రాజ్ వైపు సీరియస్ గా చూస్తూ అక్కడి నుంచి డ్రైవర్ దగ్గరకు వెళ్లి కాలేజ్ దగ్గరకు వెళ్ళి వెయిట్ చెయ్ నేను ఈవెనింగ్ వచ్చేస్తా…… !! అని డ్రైవర్ నోరు ఎత్తకుండా సీరియస్ గా చెప్పి అతన్ని అక్కడి నుండి పంపేసి రాజ్ వైపు చూస్తుంది……. !!
శ్లోక మనం కూడా స్టార్ట్ అవుదాం కమ్ అంటూ తన బుల్లెట్ మీద కూర్చుంటూ…… !! బుల్లెట్ స్టార్ట్ చేయబోతున్న రాజ్ ను తిట్టుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం అయినా నేను నీ బైక్ ఎక్కను నాకు కార్ కావాలి……. !! హలో ఇప్పటి నుంచి ఈవెనింగ్ వరకూ నేను చెప్పిందే నువ్వు చేయాలి ఇక ఆ నోరు మూసి ఎక్కు అంటూ …….. !! కోపంగా చెప్తున్న రాజ్ ను తిట్టుకుంటూ రాజ్ కి తగలకుండా వన్ సైడ్ ఎక్కి కూర్చుంటూ బుల్లెట్ చివరన బల్లిలా అతుక్కుంటుంది…… !!
ఏయ్ చీ బైక్ దిగు నువ్వేమైనా ముసలమ్మ అనుకుంటున్నావా అలా ఎక్కావ్ నోరు మూసి టూ సైడ్స్ కూర్చో లేదా స్టేషన్ కి వెళ్దాం….. !! ఆ 😬😬 టార్చర్ చూపిస్తున్నావ్ కదరా అని కోపంగా బులెట్ దిగి దూరంగా జరిగి కూర్చున్న శ్లోక వైపు సైడ్ మిర్రర్ లో చూస్తూ…… !! సైడ్ స్మైల్ ఇస్తూ రయ్ మంటూ బుల్లెట్ ను ముందుకు దూకిస్తాడు దాంతో శ్లోక బబుల్ గమ్ లా వచ్చి రాజ్ ను అతుక్కుంటుంది…… !! రాజ్ వెళ్ళే స్పీడ్ కి భయంతో రాజ్ నడుము చుట్టూ రెండు చేతులతో పట్టుకుని రాజ్ వీపుకు మొహాన్ని ఆనించి కళ్ళు మూసుకుని శ్రీ ఆంజనేయం…… శ్రీ ఆంజనేయం అని దేవుడిని తలచుకుంటున్న శ్లోక ను రాజ్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి…… !! అటుగా వెళ్తున్న అనంత్ శ్లోక & రాజ్ లను అలా చూసి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ వీళ్ళు అని ఆలోచిస్తూ ఉంటాడు…… !!
( అనంత్ ఎంత మంది కి గుర్తున్నాడు అనంత్ ని గుర్తు పట్టిన వాళ్ళు కామెంట్స్ లో చెప్పండి 🙂 )
💫✨💫✨💫✨💫✨💫✨💫
ఆంటీ మహాన్ వచ్చినట్టు ఉన్నాడు అని కార్ సౌండ్ విన్న ఇషా నందన తో ఎక్స్సైటింగ్ గా అంటుంది…….. !! ఎస్ ఇక మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన టైం కూడా వచ్చింది నువ్వెల్లి బాల్కనీ లో రెడీగా ఉండు…….. !! ఎలాగో నువ్వు & భూమి మన లక్ కొద్దీ సేమ్ హైట్ & వైట్ లో ఉన్నారు కాబట్టి నిన్ను వెనుక నుండి కచ్చితంగా భూమి అనే అనుకుంటాడు…… !!
ఒకే ఆంటీ బ్లెస్ మీ అంటూ బ్లెస్సింగ్స్ కోసం బెండ్ అయిన ఇషా తల నిమురుతూ ఆల్ ది బెస్ట్ ఇషా కమాన్ వెళ్ళు నేను కూడా వెళ్ళి ఎక్కడైనా దాక్కుంటాను……. !! అని నందన రూమ్ లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి బయటకు వెళ్లగానే ఇషా వెళ్ళి బాల్కనీ లో రెడీగా పొజిషన్ లో నుంచుంటుంది….. !!
మహాన్ కార్ పార్క్ చేసి ఇంట్లోకి రాగానే హాల్ లో మహాన్ కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తుంది భూమి…….. !! భూమి ని చూసి ఇది ఇంకా నిద్రపోకుండా ఎమ్ చేస్తుంది అనుకుంటూ భూమి వైపు వెళతాడు…… !! మహాన్ అడుగుల చప్పుడుకు తల తిప్పిన భూమి కి మహాన్ తన వైపు వస్తూ కనిపించగానే ….. !! మహాన్ వచ్చేసావా ఏంటి ఇవాళ కూడా లేట్ గా వచ్చావ్ అని అడుగుతూ పైకి లేచి నుంచుంటుంది …… !!
ఆఫీస్ లో హెవీ వర్క్ అవును నువ్వేంటి పడుకోకుండా ఇంకా హాల్ లోనే ఉన్నావ్…… ?? డిన్నర్ చేసావా అని డల్ గా కనిపిస్తున్న భూమి ఫేస్ వైపు చూస్తూ అడుగుతాడు……. !! ఇషా గురించి మార్నింగ్ నుండి ఆలోచిస్తూ ఆకలి కూడా మర్చిపోయింది తను అందుకే మహాన్ క్వశ్చన్ కి తన వైపు ఎమ్ చెప్పకుండా చూస్తూ ఉంటుంది….. !!
నీ ఫేస్ చూస్తేనే అర్థం అవుతుంది కానీ పదా అని భూమి ని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి…… !! వడ్డిస్తున్న భూమి చెయ్ పట్టుకుని ఆపేస్తూ భూమి నడుము పట్టుకుని తనని టేబుల్ మీద కూర్చో బెట్టి…… !! తనే హ్యాండ్ వాష్ చేసుకుని భూమి కి ప్రేమగా తినిపిస్తూ ఉంటే భూమి నవ్వుతూ మహాన్ పెట్టేది తింటూ ఇషా గురించి అడగడం మర్చిపోతుంది…… !!
ఏంటిది ఎవరి అరుపులు వినిపించడం లేదు మహాన్ కూడా పైకి వచ్చినట్టు లేడు…… ?? వీడు కింద ఎమ్ చేస్తున్నాడు కొంపదీసి ఆ భూమి ను కింద చూసేసాడా అని కంగారుగా అనుకుంటూ ఫాస్ట్ గా కిందకు వచ్చి చూడగా….. !! ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకుంటూ కనిపిస్తారు భూమి ♥️ మహాన్ అది చూసిన నందన కరెంట్ షాక్ కొట్టినట్టు చూస్తూ ఉంటుంది…… !!