అమ్మా ఇందులో చిన్న చేంజ్ అదేంటంటే ఇషా అప్పట్లో మహాన్ కి ఫ్రెండ్ బట్ ఇప్పుడు మాత్రం తనకు కాబోయే భార్య…… !! అంటూ స్టెప్స్ దిగుతూ పొగరుగా నవ్వుతూ చెప్తున్న నందన ను చూసి …… !! భూమి, దేవయాని షాక్ అవుతూ ఏంటీ అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతారు…… !! నందన ను చూసిన ఇషా నవ్వుతూ హాయ్ ఆంటీ వెళ్ళి హగ్ చేసుకుంటూ నవ్వగానే…… !! ఇంకా ఆంటీ ఏంటీ ఇషా అత్తయ్య అని పిలువు అంటూ ఇషా ను హత్తుకుంటూ చెప్తుంది…… !!
మహాన్ తో నా మ్యారేజ్ అవ్వగానే అలాగే పిలుస్తాను ఆంటీ అని నవ్వుతూ….. !! అవును హు ఇస్ షి ఆంటీ నేను 2 టైమ్స్ వాటర్ కావాలి అని అడిగినా ఇవ్వలేదు అయినా ఇంత పొగరు ఉన్న మెయిడ్స్ ను మీరు ఎందుకు అపాయింట్ చేశారు….. !! మన కాళ్ళ కింద చెప్పు లా మనం చెప్పింది చేసే వర్కర్స్ ను పెట్టుకోవాలి కానీ ఇలాంటి వాళ్ళను కాదు ఆంటీ….. !! చూడండి తను నా వైపు ఎంత పొగరుగా & యాటిట్యూడ్ గా చూస్తుందో …… !!
చూడమ్మా ఇషా తను ఎవరో ఏంటో తెలుసుకోకుండా నోటికి వచ్చింది మాట్లాడకు….. !! తను నా మనవరాలు పేరు భూమి మహాన్ భార్య ఈ ఇంటి కోడలు తనకు కొంచెం మర్యాద ఇవ్వడం నేర్చుకో అంటూ…… !! నీకేమైనా మతి పోయిందా నందు ఈ అమ్మాయి మహాన్ కి కాబోయే భార్య ఏంటి….. ?? అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు….. !!
జరగపోయేదే మాట్లాడుతున్నా అమ్మా….. !! మహాన్ కి ఎప్పటికైనా పెళ్లి చేయాలి కదా అదేదో మనకు తెలిసిన ఇషా అయితే బావుంటుంది కదా అని తనను సెలెక్ట్ చేసాను…… !! పైగా ఇషా కి కూడా మన మహాన్ అంటే చాలా ఇష్టం అందుకే తనను ఇండియా కి రప్పించాను…. !! ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి వాళ్లకు మనం కొంచెం టైమ్ ఇవ్వాలి కదా…… !!
నందు మతి ఉండే ఈ అమ్మాయిని ఇండియా కి రప్పించావా…… ?? మహాన్ కి మళ్ళీ పెళ్ళి చేయాలి అనుకుంటే మరి భూమి పరిస్థితి ఏంటి…… ?? అసలు ఈ పెళ్ళికి మహాన్ ఒప్పుకుంటాడు అనుకున్నావా…… ??
వాడు నా కొడుకు నేనేదీ చెప్పినా మహాన్ కాదు అనడు….. !! ఇక దీని సంగతి అంటావా ఇది మన ఇంటి పని మనిషి మాత్రమే అని ఎప్పుడో చెప్పాను & ఇప్పుడు కూడా అదే చెప్తాను….. !! ఇక అది ఇక్కడ ఉండాలా వద్దా అన్నది పూర్తిగా దాని ఇష్టం అంటూ రెక్లెస్ గా ఆన్సర్ ఇస్తుంది…. !!
మహాన్ లైఫ్ గురించి ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఇంట్లో పెద్ద వాళ్లతో ఒక్క మాట కూడా చెప్పాలి అనిపించలేదా నందు….. !! అయినా ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను భూమి కి అన్యాయం చేయాలి అని చూస్తే నేను ఈ విషయాన్ని వెంటనే నీ మొగుడికి చెప్పాల్సి ఉంటుంది….. !! కార్తికేయ అయితేనే నీకు కరెక్ట్ గా నాలుగు తగిలించి అర్థం అయ్యేలా చెప్తాడు…… !!
అమ్మా 😬😬 నీకు లక్ష సార్లు చెప్పాను ఆ మనిషి గురించి నా దగ్గర మాట్లాడకు అని అయినా ఎందుకు అతని పేరు నా దగ్గర తీస్తావ్ ఎందుకు…… ?? నేను ఎవడికి భయపడను నీకు నా శవాన్ని చూడాలి అని అంత ఆశగా ఉంటే వెళ్ళి చెప్పు….. !! నేను అనుకున్నది జరగకపోతే చచ్చైనా నేను అనుకున్నది సాధించుకుంటాను ……. !!
నా మొండితనం గురించి నీకు బాగా తెలుసు….. !! కాబట్టి అనవసరంగా నాకు కోపం తెప్పించి ఈ ఇంట్లో చావు వార్త వినేలా చేయకు…… !! అని సీరియస్ గా చెప్పి ఇషా పదా నీ రూమ్ చూపిస్తాను అని ఇషా చెయ్ పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళడం చూసి ……. !! దేవయాని అసహనంగా తన రూమ్ కి వెళ్ళిపోతుంది…… !!
భూమి తనను చూసి వెక్కిరింతగా నవ్వుతూ వెళ్తున్న ఇషా ను చూసి అంటే ఆ రోజు తాతయ్య చెప్పిన అమ్మాయి ఇదేనా….. ?? అత్తయ్య చెప్తే మహాన్ ఈ పెళ్ళి చేసుకుంటాడా కానీ నాతో తన లైఫ్ లో నాకు తప్పా మరొకరికి ప్లేస్ లేదు అని చెప్పాడు కదా…… ??
ఈ విషయం గురించి మహాన్ ను అడగాలి అనుకుంటే తను మార్నింగ్ నే ఏదో అర్జంట్ మీటింగ్ అని వెళ్ళిపోయాడు….. !! సర్లే తను ఈవెనింగ్ రాగానే ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటూ భూమి తన రూమ్ కి వెళ్ళిపోతుంది……. !!
💫💫💫💫💫💫💫💫💫💫💫
ఏమండీ నందు ఎమ్ చేసిందో తెలుసా….. ?? ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే మీరు తీరిగ్గా కూర్చుని ఇక్కడ మొబైల్ చూసుకుంటున్నారా ….. ?? అని విజయేంద్ర ప్రసాద్ పక్కన కూర్చుంటూ కోపంగా అరుస్తుంది దేవయాని….. !!
అబ్బబ్బ ఏంటి దేవి నీ అరుపులు నాకేం చెవుడు లేదు నెమ్మదిగా చెప్పినా వినిపిస్తుంది….. !! అసలేంటి గొడవ నందు ఎమ్ చేసిందో నిదానంగా చెప్పు నీకు అసలే బీపీ అరిచి గుండె పోటు తెచ్చుకోకు….. !! మీకు నా అరుపు కూడా వేళాకోళం అయిపోయింది ఎంతైనా తండ్రీ కూతురు ఒకటే కదా నేనే పరాయి దాన్ని….. !!
చెప్పేదేదో తిన్నగా చెప్పు లేదా చెప్పడం మానేయ్ …… !! ఇలా సగం సగం చెప్తే నాకేం అర్థం అవుతుంది……… !! తిన్నగానే చెప్తున్నా వినండి నందు మహాన్ కి మళ్ళీ పెళ్ళి చేయాలి అనుకుంటుంది….. !! అంతే కాదు తనకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ కూడా చేసి ఇంటికి కూడా రప్పించింది….. !!
ఈ విషయం గురించా నువ్వు ఇంతలా బీపీ తెచ్చుకుని అరుస్తోంది….. !! నేను ఇంకా ఏదో అనుకున్నాను అని నవ్వుతూ ఈ విషయం గురించి నాకు ముందే చెప్పింది దేవి నేను కూడా సరే అన్నాను…… !! ఇంతకీ మహాన్ చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంది అందంగానే ఉందా మహాన్ కి సరిపోతుందా…… ??
ఏంటండీ మీరు కూడా పుత్తడి బొమ్మ లాంటి భూమి ఉండగా మళ్ళీ మహాన్ కోసం మరో అమ్మాయిని చూడ్డం ఏంటి…. ?? పాపం అండి భూమి కి అన్యాయం చేయకండి అది కూడా మన మనవరాలే కదా….. !! నందు మీరు చెప్తే వింటుంది మహాన్ పెళ్ళి ప్రయత్నాలు ఆపమని మీరైనా దానికి చెప్పండి…… !!
చాల్లే నోరు ముయ్ ఆ భూమి నాకు ఎప్పటికీ శత్రువే అది నా మనవరాలు ఎప్పటికీ కాలేదు….. !! భూమి గురించి బాధ పడ్డం ఆపి మహాన్ కి కాబోయే భార్య తో పరిచయం పెంచుకో ఎప్పటికైనా ఆ అమ్మాయే మన మనవరాలు…… !! అని చెప్పి ఇషా ను కలవడానికి వెళ్తున్న విజయేంద్ర ప్రసాద్ ను చూస్తూ దేవయాని తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది…… !!
💫✨💫✨💫✨💫✨💫✨💫
ఏంటీ మామ్ రమ్మని పిలిచావ్ అని నందన రూమ్ కి వచ్చిన శ్లోక నందన పక్కనే కూర్చుని మాట్లాడుతున్న ఇషా ను చూసి….. !! ఏయ్ ఇషా నువ్వేంటి ఇక్కడ అని నవ్వుతూ వచ్చి తనను హగ్ చేసుకుంటూ అడుగుతుంది…… !!
వావ్ శ్లోక హీరోయిన్ లా ఉన్నావ్ తెలుసా నిజంగా చాలా చేంజ్ అయ్యావ్….!! ఆంటీ అందం మొత్తం నీకు మహాన్ కి వచ్చేసింది అయినా ఆంటీ ను చూస్తే ఎవరైనా నీకు మామ్ అనుకోరు సిస్టర్ అనుకుంటారు…… !! మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో నాకు చెప్పండి ఆంటీ అని నవ్వుతూ నందన పక్కన కూర్చుంటూ అంటుంది ఇషా….. !?
ఇది మళ్ళీ భజన స్టార్ట్ చేసింది 🤦😏 దీనికి మా మామ్ చుట్టూ తిరగడం తప్పా ఎమ్ పని లేదు అని ఇషా మాటలకు సిగ్గు పడుతున్న నందన ను చూసి తల కొట్టుకుంటుంది…… !!
నందన ను చూసిన ఇషా నవ్వుకుంటూ 🤭 ఆంటీ నా బిస్కెట్ కి పడిపోయింది ఇలాగే ఫ్లో లో ఇంకో 2 వేస్తే అవే పడుంటాయి 😌 అనుకుని…… !! అవును ఆంటీ మీరు ఇంత ఫిట్ గా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అసలు మీ డైట్ ఏంటి….. ?? యూ నో మొన్న మీ పిక్ నా ఫ్రెండ్స్ కి చూపించా వాళ్లేం అన్నారో తెలుసా….. ??
హా ఎమ్ అన్నారు ఇషా 😏 అని వెటకారంగా అంటున్న శ్లోక ను చూస్తూ…… !! అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది 10 క్రోర్స్ డౌరీ ఇచ్చైనా సరే మ్యారేజ్ చేసుకోవాలి అన్నాడు అనగానే…… !! నందు మిర్రర్ లో తనను చూసుకుంటూ మురిసిపోతూ 😍😍 ఇక చాలు ఆపు ఇషా అయినా నేను మరీ అంత యంగ్ గా ఉన్నానా….. ??
ఉన్నానా అని డౌబ్ట్ గా అడుగుతారు ఏంటి ఆంటీ….. ?? మీరు ఆల్వేస్ ఎవర్ గ్రీన్ ఇన్ఫాస్ట్ మా కంటే మీరే మోర్ బ్యూటిఫుల్ మీతో సెల్ఫీ దిగి నా ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి…… !! అసలే మీకు నా ఫ్రెండ్స్ బిగ్ ఫ్యాన్స్ ప్లీస్ ఆంటీ అంటూ సెల్ఫీ తీస్తూ ఉంటే నందన స్టైల్ గా పొసెస్ ఇవ్వడం చూసి….. !! ఇది పొగడడం మామ్ సిగ్గు పడ్డం కర్మ కర్మ 🤦 అని తల కొట్టుకుంటూ విసుగ్గా నందన పిలుస్తున్నా బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్ కి స్టార్ట్ అవుతుంది శ్లోక…… !!
💫✨💫✨💫✨💫✨💫✨💫
మొబైల్ లో తన ఫ్రెండ్స్ తో చాట్ చేస్తూ బిజీగా ఉన్న శ్లోక సడెన్ గా కార్ ఆగగానే…… !! ఏయ్ డ్రైవర్ కార్ ఎందుకు ఆపావ్ అంటూ ముందుకు చూడగా పోలీస్ లు అన్ని కార్స్ చెక్ చేస్తూ కనిపించడం చూసి ఏమైంది అంటూ డ్రైవర్ వైపు చూస్తుంది….. !!
తెలియదు మేడం అని వేరే కార్ లో ఉన్న వాళ్ళని అడగ్గా….. !! ఎవరో డ్రగ్స్ తీసుకుని వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందట అందుకే పోలీసులు అన్ని కార్స్ చెక్ చేస్తున్నారు….. !! ఓహ్ గాడ్ నాకు కాలేజ్ కి టైమ్ అవుతోంది అని ఎక్కడికి అక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ వైపు విసుగ్గా చూస్తూ ఉంటుంది….. !!
కాసేపటికి ట్రాఫిక్ క్లియర్ అయ్యి వెహికల్స్ ఒక్కోటి మూవ్ అవుతూ….. !! శ్లోక కార్ ను పోలీసులు చెక్ చేస్తూ ఉంటే రోడ్ మీద నుంచున్న శ్లోక అసహనంగా టైం చూసుకుంటూ…… !! ఇంకా ఎంత సేపు ఐ హావ్ టు గో అని అరుస్తూ ఉండగా అక్కడికి బుల్లెట్ బైక్ మీద ఎంట్రీ ఇస్తాడు రాజ్ 😜….. !!
వీడు వస్తున్నాడు ఏంటీ అని మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని రాజ్ వైపే చూస్తూ ఉంటుంది….. !! ఎనీ సస్పెక్ట్ అని అడుగుతూ శ్లోక ను చూసిన రాజ్ హాయ్ శ్లోక గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేస్తాడు….. !!
హి హి నీ మొహాన్ని చూసాను కదా నాకు గుడ్ ఏముంటుంది లే 😏 …….. !! మీ చెకింగ్స్ అయితే నేను వెళ్ళాలి నాకు కాలేజ్ కి టైమ్ అవుతోంది …… !! అంటూ కోపంగా చెప్తున్న శ్లోక ను చూసి నాకు ఎందుకో నీ మీద డౌబ్ట్ గా ఉంది నిన్ను ఓ సారి చెక్ చేయాలి ఇటు రా….. !!
వాట్ డు యూ మీన్ 🤨🤨 ….. ?? ఐ మీన్ డ్రగ్స్ నీ దగ్గర ఉన్నాయేమో నా సిక్స్ సెన్స్ చెప్తోంది….. !! కానిస్టేబుల్స్ ఆ డ్రైవర్ ను కూడా అటు వైపు తీసుకుని వెళ్ళి చెక్ చేయండి….. !! అని మరో కానిస్టేబుల్ వైపు చూసి ఏదో సైగ చేయగానే వాళ్లు ఒకే అని సిగ్నల్ ఇస్తారు…… !!
రాజ్ ఎమ్ చేయబోతున్నాడు ….. ?? శ్లోక రాజ్ నుండి తప్పించుకొగలదా….. ?? ఎనీ గెస్ గాయ్స్ 😜😈
