నీ ఊపిరి సాక్షిగా ❣️-40

మహాన్ వైపు చూస్తూ ఒక్కో స్టెప్ దిగుతున్న నందన చివరి స్టెప్ కూడా దిగేస్తూ…… !! ఎక్కడికి కన్నా అంత ఫాస్ట్ గా ఒలంపిక్స్ లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ లా పరుగులు పెడుతున్నావ్ అంటూ వెటకారంగా అడుగుతూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మహాన్ వైపు సూటిగా చూస్తూ ఉంటుంది…. !!

కమాన్ మామ్ నీకు ఇంకా అర్థం అవ్వలేదా అన్నయ్య ఇంత కంగారుగా వెళ్తున్నాడు అంటే అది ఆవిడ గారి దగ్గరకే అయ్యుంటుంది….. !! ఎమ్ అన్నయ్య అంతే కదా కరెక్ట్ గానే చెప్పానా అంటూ సర్కాస్టిక్ స్మైల్ ఇస్తున్న శ్లోక వైపు సీరియస్ గా చూస్తూ….. !! స్టాప్ ఇట్ శ్లోక నేను భూమి కోసం ఎందుకు వెళతాను ఆఫీస్ ఫైల్ కోసం వెళుతున్నా అంతే అనవసరంగా పిచ్చి వాగుడు వాగి ……. !! నాతో దెబ్బలు తినకు అని కోపంగా చెప్పి వెళ్ళి తిరిగి సోఫా లో కూర్చుంటాడు….. !!

నందన మహాన్ వైపే చూస్తూ వెళ్ళి ఎదురుగా కూర్చుంటూ …… !! స్టెప్స్ వైపు చూస్తూ తను చూసినపుడు మొబైల్ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తున్న మహాన్ వియర్డ్ బిహేవియర్ ను చూస్తూ ఉంటుంది…… !!

తన పక్కన కూర్చున్న శ్లోక వైపు చూస్తున్న దేవయాని మెదడు లో ఏదో ఐడియా తళుక్కున మెరవగానే …… !! తన ఐడియా ను  వెంటనే ఇంప్లిమెంట్ చేస్తూ బంగారు తల్లీ ఇపుడు ఎలా ఉంది రా అంటూ శ్లోక తల నిమురుతూ ఆప్యాయంగా అడుగుతుంది దేవయాని….. !!

శ్లోక దేవయాని వైపు విచిత్రంగా చూస్తూ ఎవరిని అమ్మమ్మా అంత ప్రేమగా పిలుస్తున్నావ్…… ?? అని వెటకారంగా అంటూ అటు ఇటు చూస్తున్న మనవరాలిని తిట్టుకుంటూ …… !! నిన్నే రా బంగారం అయినా మా ఇంటి మహాలక్ష్మి వి నువ్వే కదా శ్లోక నిన్ను కాకుండా ఇంకెవరిని అలా పిలుస్తాను చెప్పు….. !!

వామ్మో నన్నే….. !! అది కూడా బంగారం, మహాలక్ష్మి ఓహ్ మై గాడ్ అమ్మమ్మ నువ్వు బానే ఉన్నావ్ కదా….. !! మోకాలికి దెబ్బ తగిలి గతం కానీ మర్చిపోయావా …… ??

శ్లోక అంటూ చిరు కోపంగా పిలిచిన నందన వైపు చూస్తూ….. !! అంటే మామ్ సడెన్ గా అమ్మమ్మ నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే నేను డైజెస్ట్ చేసుకోలేక పోతున్నాను….. !! నీలో ఈ మార్పు కి రీసన్ ఎంటో తెలుసుకోవచ్చా అమ్మమ్మ …… ??

చూడమ్మా శ్లోక నాకు నువ్వంటే ఎప్పుడూ ప్రేమేనే కాకపోతే నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల కొప్పడుతూ ఉంటాను కానీ నువ్వంటే ప్రేమ లేక కాదు…… !! మొన్న నువ్వు స్టేషన్ కి వెళ్ళాక నేను ఎంత బయటపడ్డానో నాకు తెలుసు నువ్వు క్షేమంగా ఇంటికి వస్తే …… !! నీ పేరు మీద అభిషేకం చేయించి నీ చేత్తో గుడిలో భోజనాలు కూడా పెట్టిస్తాను అని మొక్కుకున్నా….. !!

నేను కొరుక్కున్నట్టు గానే నువ్వు క్షేమంగా బయటకు వచ్చావ్…… !! అందుకే ఇవాళ మంచి రోజు అని గుడిలో అన్ని ఏర్పాట్లు చేయమని ఇందాకే పురోహితుడు కి కూడా కాల్ చేసి చెప్పాను…… !!

ఎంటమ్మా నువ్వు చెప్పేది నిజమా…… ?? మరి నాతో ఒక మాట కూడా చెప్పలేదే….. ?? అదీ…. అదీ మర్చిపోయాను నందు మనం ఇంకో గంట లో గుడికి స్టార్ట్ అవ్వాలి…… !!  కాబట్టి మీరు ఇవాళ ఆఫీస్ కి వెళ్ళడం మానేసి నాతో పాటు అందరం టెంపుల్ కి వెళ్దాం…… !!

లేదు అమ్మమ్మా నాకు రావడం కుదరదు నాకు ఆఫీస్ లో అర్జంట్ మీటింగ్ ఉంది…. !! అని విసుగ్గా చెప్పి పైకి లేచిన మహాన్ చెయ్ పట్టుకుని అమ్మమ్మ చెప్తుంది కదా మహాన్ మొక్కు ఉందని ….. !! సో ఒక్క రోజు ఆఫీస్ కి వెళ్లకపోతే ఎమ్ అవ్వదు కానీ వెళ్ళి క్యాషుయల్ వేర్ వేసుకుని రా అందరం కలిసి టెంపుల్ కి వెళ్దాం….. !! నేను కూడా టెంపుల్ కి వెళ్ళి చాలా మంత్స్ అవుతోంది అసలే నేను అనుకున్నది నెరవేరబోతోంది…… !! అందుకు థాంక్స్ చెప్పడం కోసం అయినా టెంపుల్ కి వెళ్ళాలి….. !!

బట్ మామ్ అంటూ ఇంకేదో చెప్పబోతున్న మహాన్ నందన చూపు కి ఇంకేం చెప్పలేక అసహనంగా తన రూమ్ కి వెళ్ళిపోతాడు….. !! అమ్మా నువ్వు కూడా వెళ్ళి రెడీ అయి రా మేము కూడా టెంపుల్ కి రెడీ అయ్యి వస్తాం…. !!

అలాగే నందన…… !! అన్నట్టు మనతో పాటు భూమి ను కూడా తీసుకుని వెళ్దాం వెళ్ళి తనకు కూడా చెప్పు…, !! శుభమా అని టెంపుల్ కి వెళ్తూ శనిలా దాన్ని తీసుకుని వెళ్ళడం ఎందుకు….. ?? ఎమ్ అక్కర్లేదు అది ఇంట్లోనే పడి ఉంటుంది మనం వెళ్దాం…… !!
అరే కోప్పడకు నందు పూజ సామాన్లు మోయడానికి అయినా పని మనిషి కావాలి కదా….. !! అదేదో భూమి నే చేస్తుంది అయినా నీకు ఇష్టం లేకపోతే వద్దు లే ఎవర్నో ఒకరిని తీసుకుని వెళ్దాం….. !! భూమి ని పని మనిషి అనగానే నందు నవ్వుతూ ఎవరో ఎందుకు ఇది వేస్ట్ గా పడుంది కదా దీన్నే తీసుకుని వెళ్దాం….. !! దానికి నేను చెప్తాను కానీ వెళ్ళి రెడీ అవ్వు అంటూ నందు నవ్వుతూ రెడీ అవ్వడానికి వెళ్ళడం చూసి …… !! హమ్మయ్య ఎలా అయితే ఏంటీ వీళ్ళకు డౌబ్ట్ రాకుండా టెంపుల్ కి వెళ్ళడానికి ఒప్పించాను….. !!

అమ్మమ్మ నాకో డౌబ్ట్…… ?? ఇది ఇంకా ఇక్కడే ఉందా అని విసుగ్గా శ్లోక వైపు చూస్తూ….. !! నీ డౌట్స్ మడిచి పక్కన పెట్టి వెళ్ళి రెడీ అవ్వు పో అరే గుడికి త్వరగా వెళ్ళాలి అంటుంటే పిచ్చి పిచ్చి డౌబ్ట్ అన్ని అడుగుతూ నా టైమ్ వేస్ట్ చేస్తున్నావ్….. ?? అని వడి వడిగా అక్కడి నుండి వెళ్తున్న దేవయాని వైపు చూస్తూ…… !!  నో డౌబ్ట్ అమ్మమ్మ ఏదో ప్లాన్ చేస్తోంది అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్లోక….. !!

💫💫💫💫💫💫💫💫💫💫

మను ఏంటీ అటు వైపే చూస్తున్నావ్…… ?? మీ అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు పదా….. !!  అభిషేకం కి టైమ్ అవుతోంది అని అరగంట నుండి ఎంట్రెన్స్ వైపే చూస్తున్న మానస ను కదిలిస్తుంది అనసూయ….. !!

అమ్మా అభిషేకం కి టైమ్ అవుతున్నా భూమి ఇంకా రాలేదు ఏంటి….. ?? అత్తయ్య కి కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నారు అక్కడ ఎమ్ జరిగిందో ఏంటో…. ?? భూమి రాదు అంటావా ఇవాళ భూమి ను చూస్తాను అని ఎంతో ఆశ పడ్డాను…. !!

దిగులు పడకు మను భూమి కచ్చితంగా వస్తుందని నాకు గట్టిగా అనిపిస్తుంది….. !! ముందు నువ్వు లోపలికి పదా కార్తికేయ నిన్ను ఇలా చూస్తే నందన ను కొట్టి మరీ భూమి ను లాక్కుని వస్తాడు….. !! అంటూ ఎంట్రెన్స్ వైపు చూడగా భూమి చేతిలో పూల దండలు ఉన్న ప్లేట్ పట్టుకుని టెంపుల్ లోకి రావడం చూసి అనసూయ ఆనందంగా అదిగో మను మన భూమి వచ్చేస్తుంది….. !!

మానస ఆనందంగా భూమి ను చూసి భూమి అంటూ నవ్వుతూ ముందుకు రెండు అడుగులు వేసి…… !! భూమి వెనుకే వస్తున్న నందన, మహాన్ లను చూసి అక్కడే ఆగిపోయి కన్నీళ్లతో భూమి వైపు చూస్తూ ఉంటుంది…… !!

 

భూమి కి అక్కడే మానస, అనసూయ ఉన్నారని తెలియదు….. !! శ్లోక పేరు మీద పూజ చేయించడానికే టెంపుల్ కి వచ్చాం అనుకుని….. !! నార్మల్ గా టెంపుల్ కి వచ్చుంటుంది అందుకే తన ఫాదర్ ను తలచుకుంటూ బాధగా వస్తూ కనిపిస్తుంది…… !!

అందరికీ ఆఖరున వస్తున్న దేవయాని ను చూసి మానస ఆనందంగా చూస్తూ….. !! నందన వాళ్ళు దగ్గరకు వస్తూ ఉండడం చూసి వాళ్ళు చూడకుండా దాక్కుని వాళ్ళు లోపలికి వెళ్లగానే వీళ్ళు కూడా వెనుకే వెళతారు…..  !!

నందు మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి నేను ఈ లోగా పంతులు గారితో మాట్లాడుతూ ఉంటాను….. !! అలాగే అమ్మ అంటూ నందు మహాన్,భూమి & శ్లోక లతో ప్రదక్షణలు చేస్తూ కాల్ రావడం తో మధ్యలోనే ఆగిపోయి…… !! మీరు కంటిన్యూ చేయండి నేను వచ్చి జాయిన్ అవుతాను అని పక్కకు వెళ్ళి కాల్ మాట్లాడుతూ….. !! అది అవ్వగానే వెనక్కి తిరిగి ఎదురుగా వస్తున్న మనిషికి డ్యాష్ ఇచ్చి కింద పడబోతుంది….. !!

కానీ నందు కింద పడకుండా ఆ మనిషి నందు నడుమును చేత్తో పట్టుకొని తన మీదకు లాక్కోగానే….. !! ఆ చేతి స్పర్శ తనకు బాగా తెలిసిన స్పర్శ లా అనిపించి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తి ను చూసి కార్తీక్ అంటూ షాక్ అవుతుంది….. !! కార్తికేయ కూడా అక్కడ నందు ను చూసి అంతే షాక్ అవుతూ తనను వదిలి దూరం జరుగుతూ నుంచుంటాడు….. !!

నందన కార్తికేయ ను చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే….. !! నందు అని పిలిచిన కార్తికేయ వాయిస్ కి నందు కాదు నందన అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న …… !! నందన కి అడ్డుగా నుంచుని నేను నీతో మాట్లాడాలి అంటూ అంతే సీరియస్ గా చెప్పి నందన చెయ్ పట్టుకుని బలవంతంగా పక్కకు లాక్కుని వెళతాడు….. !!

 

✨✨✨✨✨✨✨✨✨✨

 

గుడి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న మహాన్ తన ముందు వెళ్తున్న శ్లోక ను చూసి….. !! తన అడుగులు స్లో చేస్తాడు శ్లోక కొంచెం దూరం వెళ్లగానే భూమి నోటి ని చేత్తో మూసి పక్కకు తీసుకొని వెళ్ళి భూమి ని వదిలి తన వైపు చూస్తాడు…… !!

భూమి తో మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా….. !! భూమి అన్న అనసూయ వాయిస్ విని భూమి ఆనందంగా తన వాళ్ళ వైపు చూస్తే…… !!  వాళ్లను అక్కడ చూసిన మహాన్ షాక్ అవుతూ చూస్తుంటాడు…… !!

అమ్మమ్మ అంటూ భూమి ఏడుస్తూ వెళ్ళి అనసూయ ను హగ్ చేసుకుంటూ….. !! తన మనసులోని బాధ తీరేదాక ఏడుస్తూ ఉంటుంది భూమి ను అలా చూసిన అనసూయ కూడా బాధగా కన్నీళ్ళు తుడుచుకుంటూ…… !! ఏడవకు భూమి నీ మీద మాకు ఎలాంటి కోపం లేదు అంటూ భూమి ఫోర్హెడ్ కిస్ చేస్తూ చెప్తుంది….. !!

మమ్మీ అని మానస ను కూడా హాగ్ చేసుకుంటూ నిన్ను ఇలా & ఇక్కడ చూస్తాను అని అనుకోలేదు మమ్మీ….. !! డాడీ సంవత్సరికం ను నా చేతుల మీద చేయలేక పోయాను అని ఇప్పటి వరకూ నాలో నేనే ఎంతో బాధ పడ్డాను….. !!

బాధ పడకు భూమి నిన్ను ఇక్కడికి కావాలనే దేవయాని అత్తయ్య తీసుకుని వచ్చారు….. !! నీ చేతుల మీద కార్యక్రమం జరిపించాలి అని మేము కూడా ఎదురు చూస్తున్నాం….. !! పదా మీ అత్తయ్య వచ్చేలోపు నువ్వు చేయాల్సినవి అన్ని పూర్తి చేయాలి అని మానస చెప్పగానే…… !! భూమి అక్కడి నుండి వెళ్తూ తన చెయ్ పట్టుకున్న మహాన్ వైపు చూస్తుంది….. !!

భూమి కళ్ళల్లో ఎమ్ కనిపించిందో ఏమో కానీ పట్టుకున్న భూమి చేతిని వదిలి పక్కకు వెళ్తున్న మహాన్ ను చూసి…… !! భూమి మానస వాళ్ళతో వెళ్ళి తన చేతులతో చేయాలి అనుకున్న పనులు అన్ని నందు రాక ముందే చక చకా ఆనందంగా కంప్లీట్ చేస్తూ ఉంటుంది…… !!

✨✨✨✨✨✨✨✨✨✨✨

లీవ్ మీ కార్తీక్ చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు అని కార్తికేయ నుండి తన చేతిని విడిపించుకుంటూ …… !! నీతో నాకు మాటలు ఏంటి మన మధ్య మాటలు ఎప్పుడో ముగిసిపోయాయి అంటూ సీరియస్ గా చెప్తుంది….. !!

నందు నేను నీతో గొడవ పడాలి అనుకోవడం లేదు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నా …… !! అనవసరంగా బీపీ తెచ్చుకుని అరవకుండా చెప్పేది ప్రశాంతంగా విను…… !!

నేనిది వినను వినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు….. !! ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు అని సీరియస్ గా చెప్పి వెళ్తున్న నందన ను లాగి పెట్టీ కొడతాడు కార్తికేయ…… !! అది చూసిన నందన చంప మీద చెయ్ వేసుకుని హౌ డేర్ యూ కార్తీక్ నన్నే ఈ నందన నే కొడతాడా….. ?? ఎంత ధైర్యం నీకు….. !!

ఇంకో చంప కూడా పగల కొడుతూ ఆవేశం తగ్గని కార్తికేయ ఇంకోటి కూడా కొట్టబోతూ ఉంటే రెండు చెంపలకు చేతులు అడ్డు పెట్టుకొని….. !! తల అడ్డంగా ఊపుతూ కొట్టకు అని చెప్తున్న నందన ను చూసి మర్యాదగా చెప్తే వినవే నువ్వు ఏదైనా కొట్టి చెప్తే తప్పా నీ బుర్రకి ఎక్కదు కదా….. !! ఇప్పుడైనా నేను చెప్పేదీ వింటావా లేదా ఇంకో రెండు తగిలించనా అంటున్న కార్తికేయ ను చూసి….. !! వి…. వింటాను అంటున్న నందన ను చూసి కార్తికేయ నవ్వుకుని తన వైపు సూటిగా చూస్తూ భూమి & మహాన్ ల జీవితం గురించి ఎమ్ ఆలోచించావ్ అని అడుగుతాడు….. !!

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply