సెల్ లో జరుగుతున్న గోల కి అక్కడికి వచ్చిన రాజ్ సెల్ డోర్ మీద కొడుతూ వాట్స్ హ్యాపెనింగ్ అంటూ సీరియస్ గా అడుగుతాడు….. ?? చూడు ఇదంతా నీ వల్లే అడ్డమైన వాళ్ళను తెచ్చి నా సెల్ లో పడేసావ్ వీళ్ళు నన్ను కూడా వాళ్ళ లాంటి అమ్మాయినే అంటున్నారు……. !! అంటూ అప్పటికే వాళ్ళ మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరగడం తో నీళ్ళు నిండిన కన్నులతో రాజ్ వైపు చూస్తుంది….. !!
రాజ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా శ్లోక ను టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తాడు….. !! డెనిమ్ బ్లూ షార్ట్ మీద బ్లాక్ స్లీవ్‌లెస్ టీ షర్ట్ దాని మీద వైట్ ష్రగ్ ….. !! తన లేయర్డ్ హెయిర్ స్టైల్ ను లీవ్ చేసి చెవులకు చిన్న స్టడ్స్ ఒక చేతికి రోస్ గోల్డ్ మినిమల్ బ్రెస్లెట్ , చార్మ్ & మల్టీ లేయర్డ్ బ్రెస్లెట్ వేసుకుని మరో చేతిని ఫ్రీగా వదిలేసి మెడలో ఎలాంటి చైన్ వేయకుండా ఫ్రీగా వదిలేసింది…… !? ఫేస్ కి మినిమల్ మేకప్ & లిప్‌స్టిక్ తో చూడ్డానికి చాలా అందంగా ఉంది……. !!
వాళ్ళు అన్నారు అని కాదు కానీ నీకు వాళ్ళకు నాకు పెద్దగా డిఫరెన్స్ తెలియట్లేదే ఇన్ఫాక్ట్ నీ కంటే ఈ అమ్మాయిలే బ్యూటిఫుల్ గా ఉన్నారు…… !! రాజ్ మాటలకు ఆ అమ్మాయిలు సిగ్గు పడుతూ చీర కొంగును వేళ్ళతో చుడుతూ ఉంటే శ్లోక మొహాన్ని సీరియస్ గా పెట్టుకున్న తన కళ్ళ నుండి నీళ్లు జారి బుగ్గల మీద కు జారుతాయి….. !!
నైస్ నువ్వు నవ్వితే కంటే ఏడిస్తేనే బావున్నావే కొంత మంది అమ్మాయిలు ఏడిస్తే చాలా చండాలంగా ఉంటారు కానీ నువ్వు సూపర్ గా ఉన్నావ్ ఇదే మెయింటైన్ చేయ్ అంటూ…… !! శ్లోక వైపు సర్కాస్టిక్ స్మైల్ ఇస్తూ రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతే శ్లోక రాజ్ ను తిట్టుకుంటూ వెళ్ళి అక్కడే పడుకోవడానికి ఉన్న ప్లేస్ లో కూర్చుంటుంది….. !!
తన దగ్గరకే కూర్చోవడానికి వస్తున్న అమ్మాయిల వైపు సీరియస్ గా చూస్తూ ఏయ్ స్టాప్ దేర్ ఎక్కడికి ఊపుకుంటూ వస్తున్నారు…. ?? చెప్పా కదా డిస్టెన్స్ మెయింటైన్ చేయమని నా వైపు వచ్చారా నా చేతుల్లో చర్చారే చెప్తున్నా బెటర్ స్టే ఏవే ఫ్రమ్ మీ…… !!
శ్లోక కోపానికి ఆ అమ్మాయిలు ఇద్దరూ దీనితో మనకు ఎందుకు లే ….. !! అని వాళ్లకు అలవాటు ఉన్న నేల మీద కూర్చుని గోడకు తల ఆనించి మాట్లాడుకుంటూ ఉంటే శ్లోక రాజ్ ను తిట్టుకుంటూ ……. !! తన కోసం ఇక్కడికి రాని నందన ను తలచుకుని ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది…. !!
శ్లోక నిద్రపోయిన గంట తరువాత సెల్ లోకి వచ్చిన రాజ్ కలత నిద్రలో ఉన్న శ్లోక కి బెడ్ షీట్ తెప్పించి కప్పుతూ నేను మీలా మానవత్వం లేని మనిషిని కాదే అందుకే నిన్నిలా వదిలేయ లేక బెడ్ షీట్ తెప్పించా …… !! అని తనకు బెడ్ షీట్ కప్పి అక్కడి నుండి కామ్ గా వెళ్ళిపోతాడు….. !!
✨✨✨✨✨✨✨✨
భూమి ఎప్పటిలా ఎర్లీ మార్నింగ్ నే నిద్ర లేచి ఫ్రెష్ అయి పూజ కంప్లీట్ చేసుకుని ఎవరికి ఎమ్ కావాలో తనకు తెలుసు కాబట్టి టీ, కాఫీ & కోకోనట్ వాటర్ అన్ని కూడా ట్రే లో పెట్టుకుని ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకు ఇచ్చేసి కుకింగ్ లో రేణుక కు హెల్ప్ చేస్తూ ఉంటుంది….. !!
బ్రేక్‌ఫాస్ట్ టైమ్ కి అందరూ హాల్ లోకి వచ్చి కూర్చుంటూ శ్లోక గురించి మాట్లాడుతూ ఉండగా అపుడే స్టెప్స్ దిగుతున్న మహాన్ కాల్ కట్ చేసి ….. !! మామ్ ఇంకో 2 అవర్స్ లో శ్లోక నీ కళ్ళ ముందు ఉంటుంది అని నవ్వుతూ చెప్పగానే అందరూ ఒకరిని ఒకరు చూసుకుని మహాన్ వైపు కన్ఫ్యూస్డ్ ఫేస్ తో చూస్తారు….. !?
అదేంట్రా నైట్ శ్లోక ను బయటకు తీసుకుని రావడం ఇంపాజిబుల్ అని చెప్పావ్……. ?? మరి ఇప్పుడేంటి ఇంత కాన్ఫిడెంట్ గా శ్లోక ను 2 అవర్స్ లో తీసుకుని వస్తాను అని చెప్తున్నావ్ …… ?? ఈ లోపు ఎమ్ మిరాకిల్ జరిగింది కొంప దీసి ఆ రాజ్ మనకు భయపడి శ్లోక ను వదలడానికి ఒప్పుకున్నాడా ఏంటి అని విజయేంద్ర ప్రసాద్ పొగరుగా నవ్వుతూ అడుగుతాడు….. !!
డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతూ వీళ్ళ మాటలు విన్న భూమి మా అన్నయ్య కి భయపెట్టడం తప్పా భయపడ్డం తెలియదు తాతయ్య అంటూ అంతే పొగరుగా ఆన్సర్ ఇస్తున్న భూమి వైపు అందరూ సీరియస్ గా చూస్తారు….. !!
మహాన్ భూమి వైపు కోపంగా చూస్తూ ఏడ్చావ్ లే నీ అన్న తో నా చెల్లికి సారీ చెప్పించి మరీ తీసుకుని వస్తాను….. !! నా చెల్లి వచ్చాక తనను చూసి బాగా ఏడుద్దువు కానీ ……. !! ముందు అందరికీ బ్రేక్‌ఫాస్ట్ వడ్డించు అంటూ మహాన్ అందరినీ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు….. !!
ఏంటిది మహాన్ ఇంత గట్టిగా చెప్తున్నాడు ….. ?? అంటే ఏదో ప్లాన్ వేసాడు…… ?? కానీ ఎమ్ ప్లాన్ వేసాడు వీళ్ళు ఇద్దరి మధ్య గొడవ ఏమో కానీ మధ్యలో నేను నలిగిపోతున్నా …… !! అక్కడ అన్నయ్య శ్లోక ను వదలమంటే వదలట్లేదు ఇక్కడ చూస్తే మహాన్ శ్లోక ను ఎలా అయినా బయటకు తీసుకుని రావాలి అని చూస్తున్నాడు ఇప్పుడేం జరుగుతుందో ఏంటో…… ??
సర్వ్ చేయమంటే ఎంటలా స్టాచ్యూ లా నుంచున్నావ్…… ?? త్వరగా సర్వ్ చెయ్ అంటూ సీరియస్ గా వినిపించిన మహాన్ వాయిస్ కి ఉలిక్కిపడి……… !! హా సారి అంటూ అందరికీ వడ్డిస్తూ ఉన్న భూమి ను చూసి ఏయ్ నా కూతురు వచ్చేసరికి తనకు ఇష్టమైన డిషెస్ అన్ని రెడీగా ఉండాలి అని సీరియస్ గా చెప్తుంది నందన….. !!
శ్లోక ను ముందు బయటకు రానివ్వండి అత్తయ్య…… !! వెతకారంగా అంటున్న భూమి ను చూసి తింటున్న మహాన్ తల పైకి సీరియస్ గా చూస్తాడు….. !! అంటే మహాన్ నువ్వు చాలా ట్రై చేసావ్ కదా తనను బయటకు తీసుకుని రావడానికి అయినా అన్నయ్య వదల్లేదు కదా అందుకే అలా అన్నాను….. !!
నీ పొగరు ను ఎలా దించాలో నాకు తెలుసు…… !! నా చెల్లిని బయటకు తీసుకుని వచ్చి నీకు ఆ రాజ్ గాడికి గట్టిగా లెసన్ చెప్పకపోతే నా పేరు మహాన్ నే కాదు….. !! అన్నయ్య చేతుల్లో దెబ్బలు తినకుండా ఉంటే చాలు అని చిన్నగా అంటున్న భూమి వాయిస్ కి మహాన్ కోపంగా హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతాడు….. !!
మహాన్….. !! మహాన్ ఆగు అంటూ వెనుకే పరుగున వెళ్ళి కార్ ఎక్కుతున్న మహాన్ చెయ్ పట్టుకుంటూ ……. !? నేనేదో సరదాగా అన్నాను ఐ ఆమ్ సారి ప్లీస్ వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చెయ్ అలా తింటూ మధ్యలో లేవకూడదు మహాన్…. !!
మహాన్ కోపంగా భూమి చెయ్ విదిలించి షట్ అప్ ఆ రాజ్ గాడు నా మీద చెయ్ వేయడం వల్లే కదా నీకు కూడా లోకువ అయిపోయాను…… !! నీ దృష్టిలో నేను ఎప్పుడూ టాప్ లోనే ఉండాలి ఇంకో సారి నా విషయం నోరు జారావో చంపేస్తాను …… !! నీ అన్న ఇంకో సారి నా వైపు కూడా చూడకుండా చావు దెబ్బ కొట్టబోతున్నా వాడిని ఓడిపోవడానికి రెడీగా ఉండమని చెప్పు …… !! అంటూ విసురుగా కార్ లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి క్షణాల్లో కార్ ఇంటి నుంచి మాయం అయ్యి రోడ్ మీద పరుగులు పెడుతుంది….. !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
భూమి వెళ్తున్న మహాన్ వైపు చూస్తు ఇది ఏదో పెద్ద గొడవే జరిగేలా ఉంది….. !! ఇద్దరినీ ఆపడం కష్టమే వీళ్ళను కంట్రోల్ చేయాలి అంటే ఎవరి వల్ల అవుతుంది….. ?? అలా ఆలోచిస్తున్న భూమి కి కార్తికేయ గుర్తు రాగానే యస్…… !! మావయ్య అయితేనే గొడవ పెద్దది అవ్వకుండా కంట్రోల్ చేయగలడు అంటూ తిరిగి ఇంట్లొకి పరిగెడుతుంది ….. !!
తన రూమ్ వైపు వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కబోతున్న భూమి ని చిటికె వేసి పిలుస్తూ ఎమ్మా మహారాణి….. !! నువ్వు అలా ఊపుకుంటూ పోతే ఇక్కడ మాకు బ్రేక్‌ఫాస్ట్ ఎవరు సర్వ్ చేస్తారు….. ??
సారి అత్తయ్య అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ముగ్గురికి అడిగింది పెడుతూ ఉంటుంది….. !! ఎందుకో కంగారుగా కనిపిస్తున్న భూమి ఫేస్ చూసిన దేవయాని భూమి నువ్వెళ్ళు అందరిదీ తినడం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కదా…. !! అనగానే ఒకే నాన్నమ్మ అని వెళ్తున్న భూమి ను మళ్ళీ చిటికె వేసి పిలుస్తూ నా కోసం ఫ్రెష్ గా ఆరెంజ్ జ్యూస్ తీసుకురా అని హ్యాండ్ వాష్ చేసుకుంటూ చెప్తుంది నందన….. !!
ఆ ఆ….. !! అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఫ్రిడ్జ్ నుండి అరెంజెస్ తీసుకుని దాన్ని జ్యూస్ చేసి తీసుకొని వచ్చి టేబుల్ మీద పెడుతున్న భూమి ను చూసి…… !! చేతికి ఇవ్వాలన్న మైనర్స్ కూడా నేర్పలేదా మీ అమ్మ & అమ్మమ్మ అంటూ సీరియస్ అవుతున్న నందన మాటలకు మ్యానర్స్ నేర్పాలి అంటే అది వాళ్లకు రావాలి కదా నందు …….. !! అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన విజయేంద్ర ప్రసాద్ అనడం చూసి నందన కరెక్ట్ గా చెప్పావ్ నాన్న అని నవ్వుతుంది ……. !! వాళ్ళను అలా చూసిన భూమి కి చిర్రెస్తుకొస్తుంది …… !!
( అత్తయ్య కాఫీ అంటూ ఆఫీస్ నుండి అప్పుడే ఇంటికి వచ్చిన నందన అప్పుడే ఫ్రెష్ అయి హాల్ లోకి వచ్చి కూర్చోగానే ….. !! భూమి నందన కోసం కాఫీ తీసుకుని వచ్చి నందన ముందు పెడుతుంది….. !!
నీకేం చెప్పాను నాకు, మహాన్ కి 10 ఇంచెస్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పా కదా……. !!
నీ చేతి స్పర్శ కూడా మాకు చిరాకు పుట్టిస్తుంది…… ఆ కాఫీ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళు ఇంకెప్పుడు నీ చేత్తో మాకు ఎదీ ఇవ్వకు అని సీరియస్ గా చెప్తుంది….. !!
నందన మాటలకు భూమి కి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ ఒకే అత్తయ్య అని కాఫీ కప్ టేబుల్ మీద పెడుతుంది…. !! 2 మినిట్స్ ఆగి ఆ కప్ తీసుకుని తాగుతున్న నందన ను చూసి ఇప్పటి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ కూడా …… !!
డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీ ప్లేట్స్ లోకి పడేలా విసురుతాను అత్తయ్య అని చెప్పి వెళ్తున్న భూమి ను చూసి నందన పళ్ళు నూరుతుంది…… !! దీని మామ కి ఉన్నట్టే ఉంది పొగరు అని భూమి వైపు కోపంగా చూస్తూ కాఫీ సిప్ చేస్తూ ఉంటుంది…… !! )
అప్పుడు జరిగింది గుర్తు చేసుకుంటూ మీకు బుర్ర సరిగ్గా వర్క్ చేయట్లేదు అనుకుంటా ఒక రోజు చేతికి ఇస్తే మీరే కదా……. !! నా హ్యాండ్ టచ్ అవ్వడం కూడా మీకు ఇష్టం లేదని చెప్పి టేబుల్ మీద పెట్టామన్నారు మర్చిపోయారా అంటూ దీర్ఘం తీస్తూ అడుగుతుంది….. !!
ఎదురు మాట్లాడడం ఆపి ఆ గ్లాస్ చేతికి ఇవ్వు అని భూమి అది చేతికి అందివ్వగానే కొంచెం సిప్ చేస్తూ…… !! చిచీ నీకు తీయడం కూడా రాదా అసలు ఇందులో సుగర్ ఎందుకు వేసావ్….. ??
షుగర్ ఆ…… ?? నో అత్తయ్య నేను ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు….. !! అంటే నేను అబద్ధం చెపుతున్నా అంటున్నావా…… ?? ఇంత షుగర్ వేసి నన్ను త్వరగా చంపేద్దాం అనుకుంటున్నావా అని కోపంగా ఆ గ్లాస్ ను ఫ్లోర్ మీద కి విసిరేస్తుంది….. !!
నేను ఎందుకు అలా అనుకుంటున్నాను ….. ?? నిజంగా నేను ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు అత్తయ్య….. !!
ఆర్గ్యుమెంట్స్ అనవసరం వెళ్ళి యాపిల్ జ్యూస్ తీసుకుని రా…… !! అంటూ కోపంగా చెప్పగానే కంగారులో ఏమైనా యాడ్ చేశానా ఏంటి అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి యాపిల్ జ్యూస్ తీసుకుని వచ్చి నందన చేతిలో పెడుతుంది….. !!
హు 😏 ఇదైనా బాగా తీసావా లేక దాని లానే చేసి చచ్చావా …… ?? అంటూ కొంచెం సిప్ చేసి యాక్ ఇందులో సాల్ట్ ఎక్కువైంది బ్రెయిన్ ఎక్కడ పెట్టావే….. ?? అంటూ కావాలనే తనను తిడుతున్న నందన ను చూసిన భూమి అయ్యో అవునా అత్తయ్య…… !! కానీ ఆ జ్యూస్ తీసింది నానమ్మ నేను కాదు అంటూ నవ్వు ఆపుకుంటూ వెనక్కి తిరిగి చూడగా దేవయాని నందన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది….. !!
ఇది నన్ను అడ్డంగా ఇరికించింది అని దేవయాని దగ్గరకు వస్తూ ఉంటే కాల్ రాకపోయినా హలో…. హా…… ఎక్కడున్నావ్ …… ?? అని మాట్లాడుతూ అక్కడి నుండి మెల్లగా ఎస్కేప్ అవుతున్న నందన ను చూసి దేవయాని భూమి హై ఫై ఇచ్చుకుని నవ్వుకోవడం చూసి …… !! ఉహ్ ఉహ్ అని కోపంగా దగ్గుతున్న విజయేంద్ర ప్రసాద్ ను చూసి…… !! భూమి అక్కడి నుంచి వెళ్లిపోతే దేవయాని వెళ్ళి ఆయన పక్కన కూర్చుని గొడవ పెట్టుకుంటుంది…… !!
✨✨✨✨✨✨✨✨✨✨
సోమేష్ ఆ సెల్ లో ఉన్న దాన్ని బయటకు తీసుకుని రా దాన్ని మనం ఇంకో రెండు గంటల్లో కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయాలి….. !! ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది సో వుయ్ ఆర్ గెట్టింగ్ లేట్ అని అంటూ ఉండగానే అక్కడికి బ్లాక్ కలర్ సూట్ లో గాగుల్స్ పెట్టుకుని పొగరు నిండిన కళ్ళతో ఎంట్రీ ఇస్తాడు మహాన్ 😎 …… !!
మహాన్ ను అక్కడ చూసిన రాజ్ నవ్వుతూ చైర్ లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని కాలు ఊపుతూ ఇంకా చూస్తావేంటి సోమేష్ వెళ్ళి దాన్ని తీసుకుని రా అనగానే…… !! సోమేష్ వెళ్ళి శ్లోక ను తీసుకుని రాజ్ క్యాబిన్ లోకి వస్తాడు…. !!
అక్కడికి విసురుగా వచ్చిన శ్లోక మహాన్ ను చూసి అన్నయ్య అంటూ మహాన్ ను ఏడుస్తూ చుట్టేస్తుంది…… !! వీడు నన్ను కావాలనే రాత్రి నుండి కాల్చుకుని తింటున్నాడు & ఆకలేస్తుంది అంటే నాకు పాడయిపోయిన ఫుడ్ తెప్పించి వీడు మాత్రం బిర్యాని తెప్పించుకుని తిన్నాడు అంతే కాదు …… !! నా సెల్ లో అంటూ ఏదో చెప్పబోతున్న శ్లోక రాజ్ అరిచిన అరుపుకి దెబ్బకు రెండు చేతులతో నోరు మూసేస్తుంది….. !!
ఆపుతారా మీ అన్నా చెల్లెళ్ళ ల అనుబంధాలు & ఆప్యాయతలు చూడలేక చస్తున్నా అంటూ శ్లోక ను మహాన్ నుండి దూరం గా లాగేసి….. !! నిన్ను కోర్ట్ కి తీసుకుని వెళ్ళాలి పదా అనగానే శ్లోక భయపడుతూ అమ్మో కోర్ట్ ఆ ఎందుకు….. ??
ఎందుకా….. ?? నువ్వు వొళ్ళు కొవ్వెక్కి యాక్సిడెంట్ చేసావ్ కదా…… !! ఆ అబ్బాయి నీ మీద కేస్ పెట్టాడు & అందుకు సాక్ష్యం చెప్పడానికి సాక్షులు కూడా రెడీగా ఉన్నారు… !! సో ఇప్పుడు కోర్ట్ కి వెళ్ళడం వాళ్ళు సాక్ష్యం చెప్పడం & నీకు శిక్ష పడడం ఆ వెంటనే నువ్వు జైలు కి పోవడం వెంటనే ఫటా ఫట్ జరిగిపోతాయి…… !?
వాట్ జైల్ ఆ…… ?? ఊ…. ఊ….. ఊ….. అని ఏడుస్తూ నేను ఎప్పుడూ జైల్ కి వెళ్ళలేదు ఇంకో సారి యాక్సిడెంట్ చేయను వదిలేయ్ రా నన్ను….. !! శ్లోక స్టాప్ ఇట్ వాడ్ని రిక్వెస్ట్ చేస్తావ్ ఏంటి నువ్వు కాసేపు ఆగు అంటూ మిస్టర్ ఎ. సీ. పీ. స్వరాజ్ మీరు మా సిస్టర్ ను ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసుకోవచ్చా …… ??
నేను ఆల్రెడీ చెప్పాను కదా మిస్టర్ మహాన్ నీ గారాల చెల్లెలు యాక్సిడెంట్ కేస్ లో అరెస్ట్ అయిందని మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు ….. ?? ఓహ్ శ్లోక నే యాక్సిడెంట్ చేసిందని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా…… ??
అఫ్క్పోర్స్ మహాన్ ప్రూఫ్స్ లేకుండా మేము అరెస్ట్ చేయం కదా …… !! ఏంటో ఆ ప్రూఫ్….. ?? అని క్వశ్చన్ చేస్తున్న మహాన్ వైపు చూస్తూ అవన్నీ కోర్ట్ కి వస్తే మీకే తెలుస్తాయి ……. !! అని టేబుల్ మీద ఉన్న క్యాప్ తీసి పెట్టుకుంటూ సోమేష్ దాన్ని తీసుకుని రా అంటూ బయటకు నడుస్తాడు….. !?
అదంతా చూస్తున్నా శ్లోక కి వొళ్ళంతా చల్లబడుతుంది…… !! వీడ్ని చూస్తుంటే నన్ను జైల్ కి పంపేదాక నిద్రపోయేలా లేడు అన్నయ్య చూస్తే చాలా కూల్ గా ఉన్నాడు….. ?? నాకేమో బ్రెయిన్ పని చేయట్లేదు అని మహాన్ వైపు చూస్తూ ఎమ్ చేయబోతున్నావ్ ….. ?? అంటూ సైగ చేస్తుంది…… !!
జస్ట్ రిలాక్స్ అంటూ మహాన్ చిరు నవ్వుతో చూస్తూ పదా వెళ్దాం అని బయటకు నడవడం చూసి శ్లోక కి పిచ్చ కోపం వస్తుంది….. !! ఇక్కడ నాకు టెన్షన్ తో నరాలు తెగిపోయేలా ఉంటే అన్నయ్య కి నవ్వెలా వస్తుంది…… ?? ఈ భూమి అన్నయ్య కి ఎమ్ చెప్పి ఉంటుంది….. ?? నేను వీళ్ళకు అడ్డుగా ఉన్నానని అన్నయ్య నన్ను సేవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ నన్ను జైల్ కి పంపివ్వడు కదా…… ?? వీళ్ళంతా కలిసి పోయి నన్ను ఏదో చేసేలా ఉన్నారు అని శ్లోక రక రకాలుగా ఆలోచిస్తూ ఉన్న చోట నుండి కదలకుండా నుంచుంటుంది……. !!
మేడం వెళ్దామా అని పిలిచిన సోమేష్ వాయిస్ కి వాళ్ళతో పాటు నీక్కూడా నన్ను జైల్ కి పంపాలని అంత ఆశ గా ఉందా….. ?? నేను బయటకు వచ్చాక మొదట చంపేసేది నిన్నే అని కోపంగా చెప్పి శ్లోక పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటకు వెళ్తుంది…… !! ఇది మరీ బాగుంది ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ……… !! ఈవిడేంటి వాళ్ళ మీదున్న కోపాన్ని నా మీద చూపిస్తూ నన్ను చంపేస్తాను అంటుంది అని తన గోక్కుంటూ సోమేష్ కూడా వెనుకే వెళతాడు…… !!
ఇంకో పది అడుగులు వేస్తే రాజ్ స్టేషన్ నుండి బయటకు వస్తాడు అనగా శ్లోక యాక్సిడెంట్ చేసిన అబ్బాయి వీల్ చైర్ లో స్టేషన్ లోకి రావడం & ఆ వెనుకే సాక్షులుగా ఉన్న ఇద్దరు అబ్బాయిలు కూడా రావడం చూసి రాజ్ ఉన్న చోటే ఆగిపోతాడు….. !!
మిమ్ముల్ని కోర్ట్ దగ్గర వెయిట్ చేయమంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు….. ?? కోర్ట్ కి టైమ్ అవుతుంది పదండి వెళ్దాం అని వాచ్ లో టైమ్ చూస్తూ….. !! ఇప్పుడు ఆటోస్ కోసం చూడకుండా మా వెనకే ఎస్. ఐ. కార్ లో వచ్చేయండి అంటూ 402 వెళ్ళి కార్ చెయ్ అని ఆర్డర్ వేస్తాడు….. !!
సర్….. సర్….. ప్లీస్ ఆగండి మేము ఇక్కడికి వచ్చింది మీకు సారి చెప్పడానికి….. ?? మీకు అనవసరంగా ట్రబుల్ ఇచ్చినందుకు సారి సర్….. !!
ట్రబుల్ ఇవ్వడం ఏంటి ఇట్స్ అవర్ డ్యూటీ & దీనికి సారి ఎందుకు….. ??
సర్ అది మేము పొరపడ్డాం నిజానికి నన్ను యాక్సిడెంట్ చేసింది శ్లోక మేడం కాదు….. !! ఈ అబ్బాయిలు కూడా కార్ నంబర్ ఒకటి కన్ఫ్యూషన్ లో రాంగ్ చెప్పారట ఆది మాకు ఇప్పుడే అర్థం అయింది…… !! అందుకే మీకు సారి చెప్పాలని వచ్చాం మేడం నిర్దోషి సర్ ప్లీస్ మేడం ను వదిలేయండి …….. !! అని చెప్పడం చూసి రాజ్ షాక్ అవుతూ పెట్టుకున్న గాగుల్స్ తీస్తే మహాన్ పొగరుగా నవ్వుతూ గాగుల్స్ పెట్టుకొంటూ శ్లోక వైపు చూస్తాడు….. !!
ఆది మహాన్ ప్లాన్ అని తన మొహం లోని నవ్వే చెప్పడం తో అప్పటి వరకు టెన్షన్ పడుతున్న శ్లోక కూడా నవ్వుతూ మహాన్ వైపు చూస్తూ రాజ్ వైపు యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ వెళ్ళి మహాన్ పక్కన నుంచుంటుంది …… !!
స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పి హైప్ & లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ❤️😌