రేణుక చేత నందన కు సూప్ పంపించిన భూమి తన రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసి బోల్ట్ పెడుతూ అసలు మావయ్య అత్తయ్య తో ఎందుకు గొడవ పడ్డాడు అనుకుంటూ వెంటనే లోపల ఎక్కడో ఎవరికీ తెలియకుండా దాచిన తన మొబైల్ తీసి కార్తికేయ కి కాల్ చేస్తుంది…… !!
ఆల్రెడీ రాజ్ ద్వారా భూమి నంబర్ తన మొబైల్ సేవ్ చేసుకున్న కార్తికేయ భూమి నుండి కాల్ రావడం చూసి ఆనందంగా కాల్ లిఫ్ట్ చేస్తాడు….. !! చిట్టి తల్లీ ఎలా ఉన్నావ్ రా 🥹 తిన్నావా అంటూ ఆప్యాయంగా అడుగుతున్న కార్తికేయ వాయిస్ కి తను నందన గురించి అడగాలి అనుకున్నది మర్చిపోయి….. !! నేను బావున్నా మావయ్యా నువ్వెలా ఉన్నావ్ & నేను కదా అని తినకుండా ఉంటే మాత్రం ఇక్కడ నేను కూడా తినను చెప్తున్నా….. !!
నేను తినకుండా ఉందాం అనుకున్నా మీ అమ్మ & మా అమ్మ ఊరుకోరు కదా భూమి వాళ్ళ కోసం అయినా తింటున్నా….. !! అక్కడ అంతా బానే ఉందా ఎవరు నిన్ను ఏం అనడం లేదు కదా భూమి….. ??
అదేం లేదు మావయ్య నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను…. !! నువ్వు నా గురించి అనవసరంగా ఆలోచించకు నన్ను కూడా అందరూ బాగా చూసుకుంటున్నారు….. !! మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు కానీ అందరూ చాలా మంచి వాళ్ళు మావయ్య….. !!
అవును భూమి అక్కడున్న అందరూ చాలా మంచి వాళ్ళు…. !! ఎంత మంచి వాళ్ళు కాకపోతే ఒక ఆడపిల్ల ను అది కూడా రాత్రి పూట జాలి, దయ లేకుండా…… !! కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా ఇవ్వకుండా గార్డెన్ లోనే పడుకోపెట్టారు ….. !! ఇలాంటి మంచి వాళ్ళను నేను ఎక్కడ చూడలేదు వీళ్ళకు చేతులు ఎత్తి ముక్కాలి కదా భూమి 😏 !!
మావయ్య అది….. అదీ….. ఈ విషయం మీకు…… ??
నువ్వు ఎంత దాచాలి అనుకున్న అక్కడ విషయాలు నాకు తెలుస్తూనే ఉంటాయి భూమి….. !! మీ అత్త ను సీత అనుకుంటున్నావేమో అది సూర్పణక టైప్ అది మారడం జరగదు….. !! నందు మారి నా లైఫ్ లోకి మళ్ళీ వస్తుంది అన్న ఆశ కానీ తను మారుతుంది అన్న హోప్ కానీ నాకు రెండు లేవు ….. !! ఇంకెప్పుడు నాతో ఇలా లేనివి చెప్పి మమ్మల్ని కలపాలని చూడకు చిట్టి తల్లీ అంటూ కాల్ కట్ చేస్తాడు కార్తికేయ……. !!
ఛా!! ఏంటిది ఇలా కట్ చేసాడు….. ?? మావయ్య తో అత్త గురించి అడగాలి అనుకుని ఇంకేదో వాగాను అని తల కొట్టుకుంటూ…… !! అవును ఇది మావయ్య కి ఎలా తెలుసు అని ఆలోచిస్తున్న భూమి కి రాజ్ గుర్తు వస్తాడు….. !! వీడొకడు నా ప్రాణానికి కృష్ణుడి లా అందరికీ పుల్లలు పెడుతూ ఉంటాడు అని కోపంగా రాజ్ కి కాల్ చేస్తుంది….. !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
రేయ్ ఆగరా అంటూ అరిచిన హనీష్ వాయిస్ కి వెనక్కి తిరిగి డిల్లీ లో ఉంది రా అని అన్సర్ చేసి స్టెప్స్ దిగుతూ ఉంటాడు మహాన్…. !!
డిల్లీ లో ఉండడం ఏంటి…. ??
అదే ఆగ్రా అన్నావ్ గా అది ఢిల్లీ లో ఉంది అని అంటున్నా….. !!
మహాన్ పంచ్ కి వొళ్ళు మండుతుంటే ఏంట్రా పంచ్ ఆ!! నేను ఆగ్రా అనలేదు ఆగరా అన్నాను అంటూ కోపం, విసుగు కలిపి చెప్తాడు…. !!
ఇచ్చి పంచె కాదు రా పాంట్ అంటున్న మహాన్ మీదకు సోఫా లో ఉన్న కుషన్స్ విసిరి నీ యబ్బ ఇక్కడ నేను సిరియస్ గా ఉంటే వెధవ కుళ్ళిపోయిన జోక్స్ వేస్తావా….. ?! అని మహాన్ ను సోఫా మీద కు తోసి మహాన్ మీద కూర్చుని జుట్టు పట్టుకుని లాగుతూ కొడుతుంటాడు….. !!
రేయ్ నొప్పిగా ఉంది వదలరా అని హనీష్ ను కిందకు తోయడానికి ట్రై చేస్తూ అరుస్తున్న మహాన్ ను చూసి….. !! అచ్ఛా జుట్టు లాగితే నొప్పి కాక హాయిగా ఉంటుందా అని రివర్స్ లో పంచ్ వేసి మహాన్ నుండి దిగేస్తాడు హనీష్….. !!
నిన్ను అని హనీష్ ను కొట్టబోయి వాచ్ లో టైమ్ చూసుకుని గాడ్ లంచ్ కూడా దాటింది అని భూమి అని అరవగానే…… !! రాజ్ తో సీరియస్ గా గొడవ పడుతున్న భూమి ఒకే అన్నయ్య తర్వాత కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి మొబైల్ వెంటనే దాచేసి ….. !! మహాన్ ముందుకు వచ్చి ఫాస్ట్ గా నుంచుంటుంది…….. !!
నేను వచ్చి ఇంత సేపు అవుతోంది నా మొహాన లంచ్ పడేయాలి అని తెలియదా….. ?? మొగుడు తిన్నాడా చచ్చాడా అని కూడా లేకుండా రూమ్ లో పడి ఎమ్ చేస్తున్నావ్….. ??
అదేంట్రా భూమి ఈ ఇంటి పని మనిషి అని నువ్వు మీ అమ్మ ఫిక్స్ అయ్యారు కదా….. !! మళ్ళీ కొత్తగా మొగుడు పెళ్ళాం అని కొత్త వరసలు కలుపుతావ్ ఏంట్రా….. ?? పక్క నుండి కౌంటర్ వేసిన దేవయాని వైపు మహాన్ కోపంగా చూస్తే హనీష్, భూమి చెయ్ అడ్డు పెట్టుకుని 🤭 మరీ నవ్వుతారు….. !!
అమ్మమ్మ 😬😬 ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దీని విషయం లో ఇన్వాల్వ్ అవ్వకని అయినా ఎందుకు ఇలా మధ్యలోకి వచ్చేస్తావ్….. ??
రేయ్ అమ్మమ్మ గారు చెప్పింది కూడా నిజమే కదా అని నవ్వు ఆపుకుంటూ చెప్తున్న హనీష్ ను చూసి నువ్వు ముయ్ అని ఇంకా నిలబడి ముసి ముసి నవ్వులు నవ్వుతున్న భూమి ను చూసి…. !! కోపంగా పైకి లేచి ఎంటే తెగ నవ్వుతున్నావ్ వెళ్ళి అందరికీ లంచ్ టేబుల్ మీద రెడీ చెయ్ అనగానే భూమి మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి డైనింగ్ ఏరియా వైపు వెళ్తుంది….. !!
అబ్బబ్బా ఇద్దరూ ఏమన్నా యాక్ట్ చేస్తున్నారా ఎవరికి 🧐 డౌబ్ట్ రాకుండా పెర్ఫార్మెన్స్ ఒకరికి మించి ఒకరు ఇరగదీస్తున్నారు….. !! అన్నయ్య నిన్ను ఎంత నమ్మాం రా ఇన్నాళ్లుగా పెంచిన మామ్ ను కాదని దానికి పడిపోయి మామ్ నే చీట్ చేస్తున్నావ్….. ?? నేను నీ లా కాదు చూస్తూ ఉండు మామ్ పగ లో నువ్వు పాలు పంచుకోకపోయినా నేను పంచుకుంటాను ….. !! ( ఏంటి పంచుకునేది ఈ విషయం కానీ రాజ్ కనిపెడితే నువ్వు పాలు పంచుకోవడం ఏమో కానీ నీతో మాత్రం బకెట్ నీళ్ళు తాగిస్తాడు 🤣🤭)
హాయ్ శ్లోక ఎలా ఉన్నావ్….. ?? అంటూ విష్ చేస్తున్న హనీష్ వాయిస్ కి మొహాన్ని నార్మల్ గా పెట్టుకుని హాయ్ అన్నయ్య అంటూ నవ్వుతూ వీళ్ళ దగ్గరకు వస్తుంది శ్లోక….. !!
నీ గురించి అడిగితే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళిందని అమ్మమ్మ గారు చెప్పారు ….. !! ఎపుడు వచ్చావ్ రా అయినా కాలేజ్ లేదా ఇవాళ ఇంట్లోనే ఉన్నావ్…… ??
ఫ్రెండ్ బర్త్డే అన్నయ్య అందుకే ఇవాళ కాలేజ్ కి వెళ్లలేదు & మామ్ కి ఇలా అయిందని తెలిసి ఇదిగో ఇప్పుడే వచ్చాను అంటూ హనీష్ తో మాట్లాడుతూ మహాన్ వైపు చూస్తుంది….. !! భూమి డిషెస్ ను టేబుల్ మీద పెడుతూ ఉంటే మహాన్ భూమి వైపు దొంగ చూపులు చూస్తూ తను మహాన్ వైపు చూసే సరికి మొబైల్ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటాడు…… !!
అది చూసిన శ్లోక 🤦🤦 వీళ్ళ రొమాన్స్ తగలెయ్య చూడలేక సచ్చిపోతున్నా నీ కొడుకు నిన్ను చీటింగ్ చేస్తున్నాడు అని మామ్ కి చెప్తే వాడు నా కొడుకు అని బాహుబలి రేంజ్ లో అంటుంది 😶😬 !!
మహాన్ మనకు డీలర్స్ తో మీటింగ్ కి ఇంకో 40 మినిట్స్ మాత్రమే టైమ్ ఉంది…. !! లంచ్ త్వరగా ఫినిష్ చేసి స్టార్ట్ అవ్వాలి అంటున్నా అవి మహాన్ చెవికి చేరవు!! ( ఎందుకు చేరుతాయి మహాన్ బాబు ఇక్కడ ఉంటే కదా 🤭🥱)
రేయ్ వింటున్నావా అని చెయ్ మీద తోలు ఊడొచ్చేలా గిచ్చిన హనీష్ వైపు కొట్టేలా చూస్తూ….. !! ఆ ఆ ఆ 😬 పిచ్చి లేచిందా ఇడియట్ అని రుద్దుకుంటూ ఎందుకురా గిచ్చావ్ అంటూ అరుస్తున్న మహాన్ వైపు చూసి….. !! పిలుస్తుంటే వినిపించుకోకుండా ఎక్కడ చూస్తున్నావ్ అన్న హనీష్ క్వశ్చన్ కి అదీ…. అదేం లేదు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను….. !!
చాలా దూరం వెళ్ళిపోయావ్ అనుకుంటా కదా అన్నయ్య 😏… ?? మహాన్ శ్లోక వైపు ఐ బ్రో రైస్ చేస్తూ చూడ్డం తో అదే…. అదే…. ఆలోచనలతో ఎటో వెళ్లిపోయావ్ అంటున్నా అంతే అని అంటుంది….. !! అందరినీ లంచ్ కి భూమి పిలవగానే నలుగురు లంచ్ కి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు….. !! రేణుక తో నందన కి లంచ్ పంపిస్తూ నేను అత్తయ్య కి లంచ్ తీసుకు వెళ్తే ఆవిడకు నచ్చదు అందుకే నువ్వే తీసుకుని వెళ్ళు అక్క అని చెప్పి పంపిస్తుంది….. !!
అబ్బో అని మూతి తిప్పుకున్న శ్లోక మా అన్నయ్య ను ఇలా సెంటిమెంట్ తో పడేసావా….. ?? అంటూ ప్లేట్ లో పెట్టిన ఫుడ్ తింటూ మళ్ళీ మహాన్ వైపు చూస్తుంది మహాన్ భూమి నడుము వైపే చూస్తూ రెప్ప వేయకుండా లంచ్ చేస్తూ ఉండడం చూసి….. !! ఎదురుగా ఉన్న కత్తి తో పొడుచుకోవాలి అన్నంత కోపం వస్తున్నా పొడుచుకుంటే చచ్చిపోతుంది అని మహాన్ కి భూమి కనిపించకుండా చేర్ ముందుకు లాక్కుని కూర్చుంటుంది……. !!
మహాన్ చేసేది లేక బుద్దిగా లంచ్ తిని హనీష్ తో పాటు ఆఫీస్ కి వెళ్ళిపోతే భూమి కూడా లంచ్ చేసి దేవయాని తో కబుర్లు చెప్తూ…… !! అపుడపుడు నందన కోసం ఫ్రూట్స్, మిల్క్, సూప్ అంటూ ఎదోటి పంపిస్తూనే ఉంటుంది ….. !! నందన మీద భూమి చూపిస్తున్న ప్రేమకు నా మనవరాలు బంగారం అని దేవయాని భూమి కి మెటికలు విరవడం చూసి……. !! ఛీ నా బతుకు ఎవరికీ నేనంటే ఇష్టం లేదు దీన్ని చంపేస్తే ఒక పని అయిపోతుంది అని భూమి ను తిట్టుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోతుంది…… !!
✨✨✨✨✨✨✨✨✨
నందన శ్లోక వెళ్ళాక కాసేపు ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ మహాన్ బిహేవియర్ గుర్తు చేసుకుంటూ మహాన్ తన చెయ్ దాటి పొకముందే ఎదోటి చేయాలని ఫిక్స్ అవుతుంది ….. !! అనుకున్నదే తడవుగా తన మొబైల్ తీసుకుని ఒక నంబర్ కి డయల్ చేస్తుంది కాసేపటి అటు వైపు నుండి కాల్ లిఫ్ట్ చేయగానే…… !!
హెలో ఇషా హౌ ఆర్ యూ డు యూ రిమెంబర్ మీ అంటూ నవ్వుతూ అడుగుతున్న నందన వాయిస్ విని …… !! హాయ్ ఆంటీ స్టాప్ జోకింగ్ నేను మిమ్మల్ని మర్చిపోగలనా యూ ఆర్ మై డార్లింగ్ ☺️🩷 !!
హహ 😅 చాలా డేస్ అవుతుంది కదా ఇషా సో మర్చిపోయావ్ అనుకున్నా!! హౌ ఇస్ యువర్ పేరెంట్స్…..!! దే ఆర్ డామ్ గుడ్ ఆంటీ!! మీరు శ్లోక నానమ్మ, తాతయ్య అండ్…. అండ్…. ??
ఇషా సిగ్గు కు నవ్వుకుని అందరం బావున్నాం నీకు కాబోయే మొగుడు కూడా బావున్నాడు అదే మహాన్ గురించే కదా నువ్వు అడగాలి అనుకున్నది…… ??
ఎస్ ఆంటీ అంటూ అందంగా సిగ్గు పడుతుంది ఇషా….. !! ఇషా ఇండియా లో ఎమ్ జరిగిందో నీకు ఆల్రెడీ నేను చెప్పాను & నువ్వు ఎప్పుడు ఇండియా రావాలో కూడా చెప్తాను అన్నాను గుర్తుందా….. ??
యాహ్ ఐ నోహ్ ఎపుడు అడిగినా టైమ్ రావాలి….. టైమ్ రావాలి అనే వారు ఆ టైం ఎపుడు వస్తుందో & నాకు మహాన్ కి మ్యారేజ్ ఎపుడు అవుతుందా అని 2 ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నాను…. !!
ఇక వెయిట్ చేయాల్సిన నీడ్ లేదు ఇషా ఆ టైం వచ్చేసింది ….. !! నువ్వు అర్జంట్ గా అక్కడి నుండి వచ్చేయ్ ఎందుకంటే ఇప్పుడు నాకు నీతో చాలా పనుంది & నువ్వు చేయాల్సిన వర్క్స్ కూడా చాలానే ఉన్నాయి….. !! నీకు నా కొడుకు దక్కాలి అంటే భూమి అన్న దరిద్రాన్ని మనం వదిలించుకోవాలి ….. !! ఇంకా లేట్ చేస్తే మహాన్ దానికి పడిపోయేలా ఉన్నాడు అందుకే నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చెయ్ నీకు మహాన్ కి నువ్వు రాగానే ఎంగేజ్మెంట్ జరిపిస్తాను…… !!
ఆంటీ ఆర్ యూ సీరియస్ ….. !! ఓహ్ మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ నేను ఇంకో వీక్ లో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాను ఆంటీ….. !! మీరు మీ ప్రామిస్ ను ఎలా నిలబెట్టుకున్నారో నేను కూడా మీకు ఇచ్చిన ప్రామిస్ ను నిలబెట్టుకుంటాను ….. !!
దట్స్ మై గర్ల్ అని నవ్వుతూ నందన ఇషా తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే …… !! ఇవేమీ తెలియని భూమి మాత్రం రేణుక కి ఫుడ్, మెడిసిన్స్ అన్ని టైమ్ కి పంపిస్తూ తనను చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ ఉంటుంది…… !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
శ్లోక యాక్సిడెంట్ చేసిన అబ్బాయిని అక్కడున్న కొందరు అయ్యో పాపం అని జాలి పడి యాంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్ కి తీసుకుని వెళతారు….. !! ఆ అబ్బాయిని & తన కండీషన్ ను చూసిన డాక్టర్స్ ఏమైంది అని తెలుసుకుని ట్రీట్మెంట్ చేయడానికి అపోస్ చేస్తారు……. !!
డాక్టర్ గారు ఇప్పటికే బాగా బ్లడ్ పోయింది & ఆ అబ్బాయి తల కు కూడా బాగా దెబ్బ తగిలి బ్లడ్ లాస్ అయింది….. !! మీరు ట్రీట్మెంట్ చేయను అంటే ఎలా మీరు ఉన్నదే ప్రాణాలు కాపాడడానికి అలాంటిది మీరే ఇలా వ్యవహరిస్తే ఎలా చెప్పండి…… !! ప్లీస్ డాక్టర్ ఆ అబ్బాయికి ఎంతో ఫ్యూచర్ ఉంది దయచేసి ఆ అబ్బాయిని ట్రీట్ చేయండి….. ??
ఏమయ్యా చెప్తుంటే నీకు అర్తం కాదా ఇది యాక్సిడెంట్ కేస్!! ట్రీట్మెంట్ జరుగుతున్నపుడు పేషెంట్ కి ఏమైనా అయితే అది మా మెడకు చుట్టుకుంటుంది…… !! అందుకే చెప్తున్నా ముందు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ కాపీ తీసుకుని రండి అప్పుడు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం…… !! అని ఇర్రెస్పాన్సిబుల్ గా చెప్పి అక్కడి నుంచి వేరే పేషెంట్ ను చూడ్డానికి వెళ్ళిపోతాడు ఆ డాక్టర్…. !!
యాక్సిడెంట్ కేస్ అనే సరికి అక్కడున్న అందరూ బ్యాక్ స్టెప్ వేసినా అందులో ఉన్న ఇద్దరు టీనేజ్ అబ్బాయిలు మాత్రం కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళతారు…. !! సర్…. సర్!! అంటూ కంగారుగా స్టేషన్ లోకి వచ్చిన ఆ ఇద్దరు కుర్రాళ్ళని & వాళ్ళ షర్ట్స్ కు అంటిన బ్లడ్ స్టెయిన్స్ చూసి హెడ్ కానిస్టేబుల్ ఏమైంది బాబు ఏంటి ఈ బ్లడ్ అంటూ సౌమ్యంగా అడుగుతాడు…… !!
సర్ నమస్తే సర్ ప్లీస్ హెల్ప్ చేయండి అంటూ జరిగిన యాక్సిడెంట్ నుండి ఇప్పుడు హస్పిటల్ లో డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ వరకూ మొత్తం చెప్తారు….. !! అయ్యో అలాగా సరే నాతో రండి ఎస్. ఐ. గారు స్టేషన్ లోనే ఉన్నారు ఆయనకు చెప్దాం అని వాళ్ళను లోపలికి తీసుకుని వెళ్ళి మొత్తం క్లియర్ గా ఎస్. ఐ. కి చెప్తాడు ఆ కానిస్టేబుల్….. !!
ఉఫ్ 🤦 ఏంటయ్యా ఈ యాక్సిడెంట్స్ రోజు ఇదే గొడవ అని విసుక్కున్న ఎస్. ఐ. ముందు వీళ్ళతో కంప్లైంట్ తీసుకుని ఆ యాక్సిడెంట్ ఎవరు చేసారో ఏంటో ఎంక్వైరీ చేయండి….. !! అంటూ ఉండగా సర్ మేము యాక్సిడెంట్ చేసిన ఆ కార్ నంబర్ నోట్ చేశాం అంటూ కార్ నంబర్ చెప్తారు….. !!
ఎస్. ఐ ఆ కార్ నోట్ చేసుకుని సరే కాసేపు బయట వెయిట్ చేయండి అని వాళ్ళను బయటకు పంపి……. !! తన సిస్టమ్ లో ఆ వెహికల్ ఎవరిదా అని చూసిన ఎస్. ఐ. నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ ఓహ్ గాడ్ ఇది నందన మేడం డాటర్ శ్లోక వెహికల్ ఆ….. ?? అని టేబుల్ మీదున్న వాటర్ గట గటా తాగేసి హెడ్ కానిస్టేబుల్ వైపు చూస్తాడు…… !!
ఏమైంది సార్….. ?? ఎందుకంత కంగారు పడుతున్నారు మేడం ఏమైనా మెసేజ్ చేసారా అంటున్న హెడ్ కానిస్టేబుల్ వాయిస్ కి కోపం చిరెత్తుకు రావడం తో…… !! రాము అంటూ కోపంగా అరిచి ఒక సారి నా పెళ్ళాం చేతులతో తన్నులు తిన్నా అని అంత వెక్కిరింపు అక్కర్లేదు అని సీరియస్ గా చెప్తాడు….. !!
సారి సర్ నేను ఆ ఉద్దేశం తో అనలేదు…… !! మీరు కంగారు పడుతుంటే మేడం కాల్/ మెసేజ్ చేశారు అనుకున్నాను….. !! ఇంతకీ ఏమైంది సర్ ఎందుకంత కంగారు పడుతున్నారు….. ??
అగోరించావ్ కానీ ఇటు వైపు చూడు అని స్క్రీన్ ను హెడ్ కానిస్టేబుల్ వైపు టర్న్ చేసి చూపెట్టగానే అది చూసిన కానిస్టేబుల్ కూడా షాక్ అవుతూ ఎస్. ఐ వైపు చూస్తాడు….. !! ఏంటి సర్ ఇది ఇప్పుడేం చేద్దాం అంటూ టెన్షన్ గా అడగ్గానే ఎస్. ఐ కాసేపు ఆలోచించి ముందు వాళ్ళను లోపలికి పిలువు నేను మాట్లాడుతాను అని చెప్తాడు….. !!
హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి ఆ అబ్బాయిలను లోపలికి తీసుకుని రాగానే వాళ్ళు ఎస్. ఐ ముందున్న చైర్స్ లో కూర్చుంటూ ఎస్. ఐ ఎమ్ చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు…. !! చూడండి ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు & వాళ్ళతో పెట్టుకుంటే మీ కెరీర్ స్పాయిల్ అవుతుంది కాబట్టి కామ్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి….. !?
బట్ సర్ ఆ అబ్బాయి హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు….. !! చూస్తూ చూస్తూ అలా ఎలా వదిలేస్తాం సర్ ప్లీస్ సర్ చాలా హోప్ తో వచ్చాం హెల్ప్ చేయండి….. !! అయినా డబ్బుందన్న పొగరు తో ఇలా యాక్సిడెంట్స్ చేస్తున్న వాళ్ళను మీరు కాకపోతే ఎవరు పనిష్ చేస్తారు చెప్పండి….. ???
గెట్ అప్!!
సర్ ….. ఎస్. ఐ నుండి కోపంగా వచ్చిన వాయిస్ కి ఆ అబ్బాయిలు ఇద్దరూ కంగారుగా ఒకరిని ఒకరు చూసుకుంటారు….. !?
లేవాండ్రా ముందు అని ఇద్దరి షర్ట్ కాలర్ పట్టుకుని పైకి లేపి తన రూమ్ నుండి బయటకు తోసి ఏదో టీనేజ్ పిల్లలు చెప్తే అర్తం చేసుకుంటారు అని మంచిగా చెప్తుంటే అర్తం కావడం లేదా….. ?? వాళ్ళతో పెట్టుకుంటే ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయి ప్లేస్ లో మీరు కూడా ఉంటారు…… !! అనవసరంగా కెరీర్ పాడు చేసుకోకుండా పొండి అని కోపంగా చెప్పి రూమ్ డోర్ లాక్ చేసుకుంటాడు ఆ ఎస్. ఐ!!
కింద పడ్డ అబ్బాయిలు చేతులు దులుపుకుంటూ న్యాయం చేయాల్సిన పోలీస్ వాళ్ళే ఇలా మాట్లాడితే ఎలా రా….. ?? సరే పదా ఇంకో స్టేషన్ లో ట్రై చేద్దాం అని ఇద్దరూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు…… !!
వాళ్ళనే ఫాలో అవుతూ వచ్చిన కానిస్టేబుల్ వాళ్ళ పక్కన తన బైక్ ఆపి కనిపిస్తున్న కేఫ్ లో వెయిట్ చేస్తుంటా అక్కడికి రండి అని చెప్పి వెళ్ళిపోతాడు….. !! ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని ఆ కేఫ్ లోకి వెళ్ళేసరికి కానిస్టేబుల్ టీ సిప్ చేస్తూ…… !! వీళ్ళను చూసి హ్యాండ్ రైస్ చేస్తూ ఇలా రండమ్మా అని పిలవగానే ఇద్దరూ ఆ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి నుంచుంటారు….. !!
ఇలా కూర్చోండి అని ఇద్దరికీ కూడా టీ ఆఫర్ చేసి వాళ్ళతో బలవంతంగా తాగించి….. !! మీరు ఏ స్టేషన్ కి వెళ్ళినా ఇదే జరుగుతుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న న్యాయం మాత్రం జరగదు….. !!
కళ్ళ ముందు ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఉండడం తప్పా మనం ఎమ్ చేయలేమా సర్….. ?? ప్లీస్ సర్ మీరైనా హెల్ప్ చేయండి ప్లీస్ ఆ అబ్బాయికి లైఫ్ చాలా ఉంది అర్థం చేసుకోండి….. !!
తన వైపు చూస్తూ దీనంగా అడుగుతున్న ఇద్దరినీ చూసి….. !! నాకు హెల్ప్ చేయాలి అనున్నా ఏం చేయలేను బాబు కానీ మీరు ఒక వ్యక్తిని కలిస్తే మాత్రం మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది….. !!
ఎవరు సర్….. !! మేము ఎవరిని కలవాలి…… ??
ఏ. సీ. పీ స్వరాజ్ ఆయన మాత్రమే దీనికి ఇమ్మిడియట్ గా రెస్పాండ్ అవుతారు….. !! అని వాళ్లకు అడ్రస్ చెప్పి ఏం తెలియనట్టు తన స్టేషన్ వైపు వెళ్తే వీళ్ళు స్వరాజ్ కోసం స్టార్ట్ అవుతారు….. !!
ఇషా రాకతో భూమి జీవితం ఎమ్ అవ్వబోతుంది…. ?? నందన చెప్పినట్టు మహాన్ ఇషా ను పెళ్లి చేసుకుంటాడా ….. ?? మరి భూమి….. ??
శ్లోక రాజ్ సీన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ నుండి వస్తాయి 😌 మహాన్ మనసులో ఏముందో ఎవరైనా గెస్ చేయగలరా….. ??