భూమి ను ఇంట్లో నుండి బయటకు నెట్టి కోపంగా ఇంట్లోకి వస్తున్న మహాన్ ను చూసి ఎమ్ చేస్తున్నావో తెలుస్తుందా మహాన్….. ?? ఎందుకు రా దాన్ని అందరు కలిసి ఇలా కాల్చుకు తింటున్నారు …… !! మార్నింగ్ ఏమో నందన దాన్ని ఈరోజు మొత్తం తినద్దు అని చెప్పిందని పాపం భూమి కనీసం నీళ్లు కూడా తాగలేదు …… !! ఇప్పుడు నువ్వు రేపటి వరకు దాన్ని గార్డెన్ లోనే వుండమని చెప్తున్నావ్ …… ?? ఎవరి మీదో వున్న కోపం భూమి మీద ఎందుకురా చూపిస్తున్నారు …… ?? అంటూ బాధగా అడుగుతుంది దేవయాని….. !!
ప్చ్ …… !! ఇంకా ఏంటి సైలంట్ గా ఉన్నావ్ అనుకుంటున్నా 😏 ప్లీస్ అమ్మమ్మ నీకేం తెలియదు నువ్వు సైలెంట్ గా ఉండు ……. !? అది అమాయకురాలు అనుకోకు నీకు దాని గురించి సరిగ్గా తెలియదు ….. !! అదో పెద్ద కంచు ఎంత తెలివైనది కాకపోతే అన్నయ్య లేనప్పుడు ఆ రాజ్ గాడికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది ….. !! చూసావ్ గా ఇద్దరూ నన్ను ఎలా చేశారో & వాడు నన్ను కొట్టాడు కూడా అయినా అది ఎట్ లీస్ట్ ఆపడానికి కూడా రాలేదు అంటూ కావాలనే మహాన్ ను రెచ్చగొడుతుంది శ్లోక….. !!
నువ్వు నోరు ముయ్ నోరు తెరిచి మాట్లాడావో చంపేస్తాను చెప్తున్నా….. !! ఎందుకే భూమి మీద అంత కక్ష నీకు ఇంకో సారి భూమి గురించి తప్పుగా వాగితే నోట్లో యాసిడ్ పోసేస్తాను….. !! అదంతా తర్వాత ముందు పెద్ద వాళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకో …… !! రాజ్ గాడు ఎన్టీ రాజ్ నీకు బావ అవుతాడు & నీకు బావ అనడం ఇష్టం లేకపోతే పేరు తో పిలువు …… !! అంతే కానీ గాడు ఎంటే బుద్ది లేకుండా …… !!
నిన్ను కాదు నిన్ను ఇలా పెంచినందుకు మీ అమ్మ ను అనాలి …… !! భూమి ఎవరో పరాయి పిల్ల అయినట్టు దాని గురించి వాడికి ఎందుకే ఎదేదో అబద్ధాలు చెప్తున్నావ్ …… !! నీ అబద్ధాల వల్ల మొగుడు పెళ్ళాం మధ్య ఇంకా దూరం పెరిగిపోతోంది అది తెలుస్తుందా నీకు అంటూ శ్లోక మీద సీరియస్ అవుతుంది…… !!
ఎపుడు ఇంతే నన్నే తిడుతూ ఉంటావ్ అని ముక్కు చీదుతూ నీకు సొంత మనవరాలు కంటే ఆ భూమి నే ఎక్కువైంది కదా …… !! నాకు ఇంత గాయం అయినా అయ్యో అని కొంచెం కూడా బాధ లేదు కానీ ఆ భూమి ని ఒక్క మాట అనగానే నా మీదకు కత్తి పట్టుకుని యుద్దానికి వచ్చేస్తున్నావ్ …… !! హు ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావ్ పో….. !! వెళ్ళి ఆ భూమితోనే వుండు ….. !! దాన్నే బాగా చూసుకుని నెత్తిన పెట్టుకో నీ కంటికి నేను కూడా మనిషిలా కనిపించడం లేదు అని ఏడుస్తూ శ్లోక రూమ్ లోకి వెళ్ళిపోతుంది ….. !!
శ్లోక…. శ్లోక ఆగు అని మహాన్ పిలుస్తున్నా ఏడుస్తూ లిఫ్ట్ లోకి వెళ్ళిన శ్లోక వైపు చూసి తల పట్టుకుని…… !! అమ్మమ్మ ఏంటిది ఎందుకు శ్లోక ను ఎడిపిస్తున్నావ్ ….. ?? పాపం అసలే తనకు గాయం అయి ఏడుస్తుంది & దారిన పోయే ఎవరి గురించో మీరు గొడవ పడ్డం ఎన్టీ అంటూ అసహనంగా అడుగుతాడు….. !!
దాని గురించి వదిలేయ్ రా వెళ్ళి చాక్లెట్ ఇస్తే చిన్న పిల్లలా నవ్వుతుంది …… !! దానికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎక్కడో అడుగున ఉంది …… !! భూమి దారిన పోయే మనిషి కాదు ఈ ఇంటికి కోడలు & నీకు పెళ్ళాం అది గుర్తు ఉంచుకో….. !! ముందు నువ్వు భూమి ను ఇంట్లోకి తీసుకురా పాపం రాత్రి అంతా బయటే ఉండాలి అంటే తను భయపడుతుంది పైగా చీకటి అంటే దానికి బయం ….. !! నైట్ అంతా ఒకరే గార్డెన్ లో ఉండాలి అంటే ఎవరికైనా భయమేస్తుంది ….. !!
ఎమ్ పర్లేదు నానమ్మ దానికి ఆలాగే కావాలీ …… !! లేకపోతే ఆ రాజ్ ఇంటికి వచ్చి శ్లోక ను కొడుతుంటే ఎట్లిస్ట్ ఆపాలి కదా …… !! నా చెల్లి అనుభవిస్తున్న బాధ కొంచెం అయినా అది అనుభవించాలి …… !! అప్పుడే మరో సారి ఇలాంటి తప్పు చేయాలంటే భయపడుతుంది….. !!
దేవయాని అసహనంగా చూస్తూ భూమి ను ఎమ్ చేయాలి అనుకుంటున్నారు …… మహాన్ ?? తనను ఇంట్లో మనిషిలా చూడరు అలా అని భూమిని ఇక్కడి నుండి వెళ్ళడానికి కూడా ఒప్పుకోరు …… !! ఓపిక కు కూడా ఒక హద్దు అంటూ వుంటుంది రా…… !! అది పోయిన రోజు రాజ్ తీసుకు వెళ్లడం కాదు భూమి నే ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది ……. !! కేవలం ఇంట్లో నుండే కాదు నీ జీవితం నుండి కూడా అంత వరకు తెచ్చుకోకు …… !!తను వెళ్లిపోతే నువ్వు మంచి బార్య ను మిస్ అవుతావో లేదో తెలియదు కానీ నేను మాత్రం బంగారం లాంటి మనవరాలిని మిస్ అవుతాను …… !! అంటూ మహాన్ వైపు కోపంగా చూస్తు పైకి లేచి గార్డెన్ లోకి వెళ్తుంది …… !!
అందరు దాని బజన చేసేవాల్లే అంటూ డోర్ ఓపెన్ చేసి భూమి వైపు వెళ్తున్న దేవయాని వైపు విసుగ్గా చూస్తూ ఇక్కడ నువ్వు ఆఫిస్ లో వాడు ( హనిష్) ……. !! చా!! మూడ్ మొత్తం చేంజ్ అయింది & దానికి నైట్ మొత్తం గార్డెన్ లో పడి ఏడిస్తే అప్పుడు తెలుస్తుంది ఈ మహాన్ అంటే ఎంటో …… !! అనుకుంటూ మధ్యలో ఆపిన మీటింగ్ ఫినిష్ చేయడానికి ఆఫిస్ కి వెళ్ళిపోతాడు మహాన్…… !!
____________________
నందన ఈవెనింగ్ ఇంటికి వచ్చేసరికి హాల్ లో సోఫాలో కూర్చుని టివి చూస్తూ కనిపిస్తుంది శ్లోక ……. !! తన ఎదురుగానే మనవరాలిని కోపంగా చూస్తు కాఫీ సిప్ చేస్తూ ఉంటుంది దేవయాని …… !! శ్లోక గొంతు దగ్గర గాయం చూసిన నందన కంగారుగా శ్లోక !! ఏంటిది ?? ఏమైంది ఎక్కడైనా పడ్డావా…… ?? అంటూ ఆ గాయాన్ని తడుముతూ టెన్షన్ గా అడుగుతుంది …… !!
పెద్ద గాయం ఎమ్ కాదులే నందన తన కంటే పెద్ద వాల్లకు మర్యాద ఇవ్వాలని నీ అల్లుడు ముద్దుగా దాని మెడ మీద కత్తి తో ముద్దు పెట్టాడు ……. !! ఏమ్మా శ్లోక అంతేనా అంటూ శ్లోక వైపు కళ్లు ఎగరేస్తూ నవ్వుతూ అడుగుతుంది దేవయాని…… !! అది చూసిన శ్లోక కి వొళ్ళు మండి అమ్మమ్మా అని హాల్ మొత్తం రీ సౌండ్ వచ్చేలా గట్టిగా అరుస్తుంది…… !! అబ్బా ఆపవే ఇయర్ డ్రమ్స్ పగిలి పోయేలా ఉన్నాయి అంటూ కాఫీ కప్ టేబుల్ మీద పెడుతూ చెవులు రెండు గట్టిగా చేతులతో మూసేస్తుంది…… !! ఆ….. !! 🥺 అమ్మా అని కట్ అయిన దగ్గర అరిచిన అరుపుకి నొప్పి పుట్టడం తో అమ్మా అంటూ ఆ గాయాన్ని పట్టుకుని దేవయాని వైపు కోపంగా చూస్తుంది …….. !!
నందన దేవయాని వైపు అనుమానంగా చూస్తూనే అల్లుడా ….. ?? ఏ అల్లుడు నాకు అల్లుడు ఎవరున్నారు అమ్మా….. !! ఎవరి గురించి చెప్తున్నావ్ అయినా నా కూతురి మెడ మీదనే కత్తి పెడతాడా ఎవడు వాడు …… ?? అంటూ సీరియస్ గా అడుగుతుంది …… !!
మామ్ నన్ను ఇలా కొట్టింది ఆ రాజ్ గాడు అని ఏడుస్తూ నందన చెయ్ పట్టుకొని….. !! ఇట్స్ రియల్లీ పెయినింగ్ మామ్ అంటూ కొట్టింది వాడైనా కొట్టిచ్చింది మాత్రం ఆ భూమి నే ఎవరు ఇంట్లో లేని టైమ్ చూసి వాడ్ని రమ్మని చెప్పి & వాడు వచ్చాక కావాలని నా మీద కంప్లైంట్స్ చెప్పి భూమి నే వాడితో కొట్టించింది మామ్…… !!
శ్లోక ఎందుకు భూమి మీద లేని పోని నిందలు వేస్తున్నావ్ …… ?? భూమి అలాంటిది కాదు అయినా నీకు ప్రొద్దున ఎమ్ చెప్పాను …… ?? నీకంటే పెద్ద వాల్లకు మర్యాద ఇవ్వమని చెప్పనా లేదా …… ?? నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఇప్పుడు మెడ దగ్గరే కోసాడు ఆ తర్వాత నీ వొళ్ళంతా కోసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ……. !! కాబట్టి వొళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు అంటూ మనవరాలి వైపు కోపంగా చూస్తూ అంటుంది……. !!
అమ్మమ్మా 😬 అని పళ్ళు నూరుతూ నువ్వు కాసేపూ నోరు మూసుకో …… !! నాకు అర్థం అవ్వక అడుగుతాను నువ్వు నాకా అమ్మమ్మ వి లేక వాళ్ళక ……. !! ఎప్పుడు వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఉంటావ్ అంటూ విసుగ్గా అరుస్తుంది …… !!
శ్లోక బిహేవ్ యువర్ సెల్ఫ్ !! ఎవరితో మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు …… !! అమ్మమ్మ తో అలాగేనా మాట్లాడేది అంటూ శ్లోక దేవయాని మీద వాయిస్ రైస్ చేయడం తో తన వైపు సిరియస్ గా చూస్తూ చెప్తుంది నందన….. !!
నందన కోపానికి శ్లోక మొహాన్ని ఎర్రగా పెట్టుకొని లేకపోతే ఎంటి మామ్ ☹️ ….. !! చూస్తున్నావ్ కదా అమ్మమ్మ ఎప్పుడూ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది …… !! నాకు నిజంగా చాలా బాధేసి అలా అన్నాను & తన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది…… !! నువ్వే చెప్పు మామ్ తను అమ్మమ్మా నాక లేక వాళ్ళకా …… ?? నాకు ఇలా అయిందని అమ్మమ్మ కొంచెం కూడా కన్సర్న్ చూపించడం లేదు 🥺 కానీ ఆ భూమి మీద తెగ ప్రేమ చూపిస్తుంది….. !?
నేను ఎప్పుడూ మంచి వాళ్ళకే సపోర్ట్ చేస్తానే….. !! న్యాయం ఎటువైపు ఉంటే నేను అటు వైపే మాట్లాడతాను ….. !!
అంటే ఏంటి అమ్మమ్మా ….. ?? ఇప్పుడు నేను చెడ్డ దాన్ని అంటున్నావా ….. !! నేను రాక్షసి ని అయితే మరి ఆ భూమి దేవత అంటావా….. ??
కొత్తగా అనడానికి ఏముంది భూమి నిజంగా బంగారం….. !! నువ్వు ఎప్పుడో అదృష్టం చేసుకున్నావ్ అందుకే నిన్ను అమ్మ లా చూసుకునే వదిన వచ్చింది….. !! అందుకు సంతోష పడకుండా వచ్చినప్పటి నుంచి తల్లీ కొడుకు & కూతురు దాన్ని ఎదో విధంగా టార్చర్ చేస్తూనే వున్నారు …… !! అయినా భూమి మంచితనం & ఓపికతో ఆన్ని బరిస్తుంది …… !! ప్రొద్దున కూడా నువ్వు భూమి ను ఎదో అనే ఉంటావ్ నీ కర్మ కొద్ది అప్పుడే రాజ్ వచ్చి నిన్ను నాలుగు పీకుంటాడు …… !!
శ్లోక వా వా అని ఏడుస్తూ చూసావా మామ్ నీ ముందే అమ్మమ్మా నన్ను ఎలా అంటుందో …… ?? అది దేవత అంట నేను దెయ్యం అంట అంటూ నందన ను గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేస్తుంది….. !!
అమ్మా ప్లీస్ కాసేపూ కామ్ గా ఉండు & శ్లోక నువ్వు ఏడవకు నీకు ఇలా అవ్వడానికి కారణం అయిన దాన్ని ఎమ్ చేస్తానో చూడు అంటూ శ్లోక కన్నీళ్ళు తుడుస్తూ……. !! ఏయ్ భూమీ… భూమి ఎక్కడ చచ్చావ్ ….. !! రాగానే టీ ఇవ్వాలని తెలియదా ఇలా రా అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది…… !!
అది ఇంట్లో లేదు మామ్ నాకు ఇలా అవ్వడానికి అదే కారణం అని అన్నయ్య దాన్ని ఈరోజు ఇంట్లోకి అడుగు పెట్టద్దు అన్నాడు …… !! అందుకే మార్నింగ్ నుండీ బయటే గార్డెన్ లో పడుంది అని నవ్వుతూ చెప్తుంది …… !!
అలాగ మంచి పని చేశాడు దాన్ని కాళిగా ఉంచకూడదు & దాని చెప్తా ఉండు అంటూ భూమి దగ్గరకు వెళ్తుంది …… !! నందన ఎమ్ చేస్తుందో అర్తం అవ్వక శ్లోక, దేవయాని కూడా వెనుకే వెళతారు …… !!
నందన భూమి ను ఎమ్ చేయనుంది….. ?? భూమి ను నైట్ మొత్తం గార్డెన్ లో ఉంచారు అని రాజ్ కి తెలిస్తే తను ఎమ్ చేయనున్నాడు….. ??
నందన కోపంగా గార్డెన్ లోకి వెళ్ళేసరికి భూమి బెంచ్ కి ఆనుకుని ఆకాశం లోకి చూస్తూ కన్నీళ్ళు రాకుండా కష్టంగా ఆపుకుంటూ ఉంటుంది ……. !! తనకు మానస చాలా గుర్తొస్తుంది …… !! మానస ను వదిలి భూమి వన్ డే కూడా వుండేది కాదు ఇన్ఫాక్ట్ మానస ను వదిలి వెళ్లడం ఇష్టం లేక కార్తికేయ యూ. ఎస్ పంపిస్తాను అన్నా వద్దు ఇక్కడే చదువుకుంటానని చెప్పి హైదరాబాద్ లోనే వుండిపోయింది …… !! అలాంటిది ఇప్పుడు మానస తో కాల్ మాట్లాడ్డానికి కూడా లేకుండా పోయింది …… !! ప్రెసెంట్ తన దగ్గర మొబైల్ ఉన్నా కాల్ చేయలేని స్థితిలో ఉంది భూమి 🥺….. !!
తన మీదున్న నమ్మకం తో కార్తికేయ మాత్రమే కాదు మానస, అనసూయ, రాజ్ కూడా భూమి ను చాలా గారం చేసేవారు …… !! తనేం చేసినా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు …… !! అలాంటి వాళ్ళకి ఒక మాట కూడా చెప్పకుండా మహాన్ ను పెళ్ళి చేసుకుని వాళ్ళ నమ్మకం పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళకి శాశ్వతంగా దూరం అయి వాళ్ళని మోసం చేశాను ఆన్న గిల్ట్ ఫీలింగ్ తో ప్రతీ క్షణం బాధ పడుతూనే ఉంది…… !!
అందుకే ఇప్పుడు తన దగ్గర మొబైల్ ఉన్నా ఎవరికీ కాల్ చేయకుండా ఒక్కటే ఇలా గార్డెన్ లో కూర్చుని అశోక వనంలో సీత ఏడుస్తున్నట్టు ఇలా గార్డెన్ లో కూర్చుని తన జీవితాన్ని తనే నరకం లోకి తెచ్చుకునేలా చేసిందని బాధ పడుతు ఉంది …… !!
గార్డెన్ లోకి అవేశంగా వచ్చిన నందన ఏడుస్తున్న భూమి ను చూసి కోపంగా జుట్టు పట్టుకొని పైకి లేపి ఎంటే నేను లేని టైమ్ లో నీ ఆన్న ను పిలిపించి నా కూతురికే గాయం అయ్యేలా చేస్తావా ……. ?? అని లాగి పెట్టీ కొట్టగానే భూమి బెంచ్ మీద పడి చంపన చెయ్ పెట్టుకొని కన్నీళ్ళతో నందన వైపు చూస్తూ …… !! లే….. లేదత్తయ్య నేను అన్నయ్య కి కాల్ చేయలేదు అన్నయ్య వస్తున్నట్టు కూడా నాకు తెలియదు …… !! ప్లీస్ నన్ను నమ్మండి….. !!
షట్ అప్ చేసింది చాలక మళ్లీ అబద్ధాలు కూడా చెప్తున్నావా …… ?? నీ నంగనాచి కబుర్లు చెప్పడం ఆపు ఎందుకంటే నీ మాటలు నేను నమ్మను ఫస్ట్ నా కూతురికి సారీ చెప్పు….. !! లేకపోతే ఇవాళ నువ్వు నా చేతుల్లో చస్తావ్ చెప్తున్నా….. !!
నందన ఎమ్ చేస్తున్నావ్ నువ్వు పాపం ఎందుకే అందరు భూమి మీద ఇంత కక్ష పెంచుకుని దాన్ని అలా ఎడిపిస్తున్నారు ……. !! రోజూ ఇలా దాన్ని ఏడిపించే కంటే ఒకే సారి పీక పిసికి చంపేయండి …… !! అప్పటికైనా మీ పగ చల్లారుతుందేమో అని కందిన భూమి చంప వైపు బాధగా చూసి నందన వైపు చూస్తూ కోపంగా అంటుంది …….. !!
అమ్మా నీకు ముందే చెప్పాను నువ్వేం చెప్పినా నేను నీ మాట వింటాను …… !! కానీ ఈ భూమి విషయం లో మాత్రం నువ్వు నాకు అడ్డు రాకు ……. !! నువ్వు దానికి సపోర్ట్ చేసి మాట్లాడేకొద్దీ నాలో ఇంకా కోపం పెరిగి పోతుంది …… !! అయినా దీని వల్ల నా జీవితం ఏమైందో మర్చిపోయావా …… ?? దీని కోసమే కదా ఆ కార్తిక్ నన్ను కాదన్నాడు …… !! అలాంటి దీని మీద నీకు ఇంత కన్సర్న్ ఎందుకు …… ?? నీకు నీ కూతురు & మనవరాలు కంటే ఇదే ఎక్కువనా….. ??
తప్పులు నువ్వు చేసి నింద భూమి మీద వేస్తావ్ ఎంటి నందన…… ?? మీరు విడిపోవడానికి కారణం భూమి కాదు నీ పొగరు, అహంకారం ……. !! ఇప్పటికైనా అవి తగ్గించుకుంటే అల్లుడి గారి కాళ్ళ మీద పడైనా సరే మిమ్మల్ని నేను ఒకటి చేస్తాను …… !!
అమ్మా 😬😬 అంటూ కోపంగా ఆరిచి నువ్వు ఎవరి కాళ్ళు పట్టీకోవల్సిన అవసరం లేదు ……. !! ఎందుకంటే నువ్వు ఈ నందన తల్లివి ఒకరు నీ కాళ్ళు పట్టుకోవాలి కానీ నువ్వు ఒకరి కాళ్ళు పట్టుకోవడం ఎన్టీ నాన్సెన్స్ & మళ్లీ మళ్లీ చెప్తున్నాను …… !! అతను నీకు అల్లుడు కాదు ……. !! నా శత్రువు మా మధ్య వున్న బంధం ఏనాడో తెగిపోయింది ……. !!
నువ్వు తెంచుకున్నంత సులువుగా నేను తెంచుకొలేను నందన ……. !! నాకు నువ్వు అల్లుడు గారు కలిసిపోయి మన రెండు కుటుంబాలను ఒకటిగా చూడాలని వుంది ……. !! ఇప్పటికైనా నీ పంతాన్ని పక్కన పెట్టవే నీ మంచి కోసమే చెప్తున్నా ఈ అమ్మ మాట విను……. !!
హు 😏 అది ఈ జన్మకు జరగదు & కాసేపూ నువ్వు మాట్లాడకు అంటూ బెంచ్ మీద కూర్చుని ఏడుస్తూ తల వంచుకుని కూర్చున్న భూమి వైపు పల్లు కొరుకుతూ…… !! ఏయ్ పైకి లేవ్వే అని భూమి బుజం పట్టుకుని పైకి లేపి నా కూతురి కి వెళ్ళి సారి చెప్పు లేదా నిన్ను ఇవాళ చంపేస్తాను …… !!
వ…… వద్దు అత్తయ్య సారి నే కదా నేను చెప్తాను అని నందన కి దూరంగా నుంచున్న శ్లోక ముందుకు వెళ్ళి నుంచుంటుంది….. !!
తన వైపు పొగరుగా నవ్వుతూ చూస్తున్న శ్లోక వైపు ఏడుస్తూ మొహాన్ని పెట్టుకుని ఎంటే నీకు సారి చెప్పాలా నువ్వు ఇలా మళ్ళీ నన్ను ఏడిపించావ్ అని మా అన్నయ్య కి చెప్పాను అనుకో ఈ సారి కత్తి ని మెడ దగ్గర పెట్టడం కాదు డైరెక్ట్ గా గొంతు లో దించేస్తాడు…… !! తెలుసు కదా నీకు మా అన్నయ్య గురించి తను మహాన్ కంటే పెద్ద మెంటలోడు కాబట్టి వొళ్ళు దగ్గర పెట్టుకుని ఆ మొహం లోని ఎక్స్ప్రెషన్ మార్చు లేదా చినిగిపొద్ది అంటూ ఏడుస్తూనే శ్లోక కి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇస్తుంది….. !!
ఇప్పటి వరకూ సావిత్రి లా ఉన్న భూమి సడెన్ గా అనుష్క లా చేంజ్ అవ్వడం చూసి శ్లోక కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ నందన కి ఎదో చెప్పబోతూ లాస్ట్ మినిట్ లో రాజ్ గుర్తు రాగానే చంప మీద చెయ్ పెట్టుకుని…… !! వామ్మో ఇది వాడికి నా గురించి చెప్తే నిజంగా వాడు నన్ను చంపినా చంపేస్తాడు దీని సంగతి మళ్ళీ చెప్తా అని భూమి వైపు కోపంగా చూస్తూనే సైలంట్ గా ఉంటుంది…… !!
ఆది అలా నోరు మూసి పడుండు…. !! పోనీలే అని కామ్ గా ఉంటే రెచ్చిపోతున్నావ్ ఇప్పటి నుండి నువ్వు నోరు తెరవడానికి మాత్రమే నోరు తెరవాలి అంటూ అత్తయ్య సారి చెప్పేసాను ☹️ అంటూ ఇన్నోసెంట్ గా మొహాన్ని పెట్టుకుంటుంది….. !!
అమ్మ దీనెమ్మ ఎమ్ యాక్ట్ చేస్తుంది ఇది….. !! అయినా దీనిలో సడెన్ చేంజ్ కి రీసన్ ఏంటి మార్నింగ్ వరకూ నోరు మూసుకుని ఉంది కదా ఇప్పుడేంటి దీని వెర్షన్ మార్చేసింది అని శ్లోక షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది….. !!
గుడ్ ఇంకో సారి నా కూతురుని హర్ట్ చేస్తే చంపేస్తాను గుర్తు పెట్టుకో & ఈ రోజు ఇంట్లోకి రాకూడదు అని పని తప్పించుకుందాం అనుకుంటున్నావేమో …… ?? నువ్వు ఎక్కడున్నా ఎదో ఒక పని చేస్తూనే ఉండాలి అని గార్డెన్ చుట్టూ చూస్తు ఈ గార్డెన్ లో వున్న ఫ్లవర్స్ ఆన్ని కోసి కృష్ణుడి విగ్రహం కి అలంకరించడానికి మాలలా కట్టు ……. !! అంటూ సీరియస్ గా చెప్తుంది …… !! అది విన్న శ్లోక నవ్వుకుంటూ తిక్క కుదిరిందా అని భూమి వైపు చూసి అయిపోయావే …… !! లేకపోతే నాతోనే పెట్టుకుంటారా ఆకలితో చస్తూ మమ్మీ చెప్పిన పని చెయ్యి అని పొగరుగా నవ్వి లోపలికి వెళ్ళిపోతుంది …… !!
నందన అవన్నీ దానికెలా తెలుస్తాయే పాపం …… !! భూమి కి అలాంటి పనులు ఎమ్ రావు ఎందుకంటే కార్తికేయ తనను యువరాణీ లా పెంచాడు …… !! మరి ఇలాంటి పనులు ఎలా చేస్తుంది చెప్పు…… !!
చేయాలి ఇది యువరాణి ఆ ఇంటికి కావచ్చు కానీ నా ఇంటికి మాత్రం ఇది పని మనిషి మాత్రమే …… !! పని మనుషులు ఎమ్ చెప్పిన నోరు విప్పకుండా చెప్పిన పని చేయాలి …….. !! అంటున్న నందన వైపు కోపంగా చూస్తు ఇంట్లోకి వెళ్ళిపోతుంది దేవయాని …… !!
ఎన్టీ ఇంకా నిల్చున్నావ్ …… ?? వెల్లు ఇక నీకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరు & రారు కూడా వెల్లు వెళ్ళి ఒక్క పువ్వు కూడా లేకుండా అన్ని కోయి …… !! అని కోపంగా చెప్తున్న నందన ను చూసి ఆలాగే అత్తయ్య అని తల ఊపి పూలు కోయడానికి వెళ్తుంది ……. !!
భూమి వైపు సీరియస్ గా చూస్తూ సెక్యూరిటీ గార్డ్స్ కి కాల్ చేస్తుంది …… !! వాళ్లు లిఫ్ట్ చేయగానే చూడండి ఈ రోజు రాత్రి బయట గార్డెన్ లో కానీ మన ఇంటి చుట్టూ కానీ ఒక్క లైట్ కూడా వెలగడానికి వీల్లేదు …… !! ఈవెన్ స్ట్రీట్ లైట్ కూడా ఎమ్ జరిగినా ఒక్క లైట్ కూడా ఆన్ అవ్వకూడదు …… !!
బట్ మేడం లైట్స్ లేకపోతే ఇంట్లోకి ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది ……. !! ఒక్క లైట్ అయినా వుండడం మంచిది …… !!
వొల్లెలా ఉంది నాకే సజ్జేశన్స్ ఇస్తున్నావ్ ….. ?? నేను చెప్తుంది ఈ రోజు రాత్రికి మాత్రమే …… !! ఇంట్లోకి ఎవరూ రాకుండా చూడాల్సిన డ్యూటీ మీదే సో బీ కేర్ఫుల్ అని కాల్ కట్ చేసి నీకు లైట్ లేకపోతె బయం అని నాకు తెలుసు భూమి …… !! తిండిలేక ఏడుస్తూ చీకటికి భయపడుతూ రాత్రంగా ఈ గార్డెన్ లోనే నువ్వు నరకం చూస్తావ్ ….. !! అని రాక్షసంగా నవ్వుతూ ఇంట్లోకి వెల్తుంది ……. !! ఇవేమీ తెలియని భూమి పూలు కోసి తీసుకు వచ్చి బెంచ్ మీద అల్రెడీ మాల కట్టడానికి దారం కనిపించడం తో మొబైల్ తీసుకుని మాల ఎలా కట్టాలో చూస్తూ మాల కట్టడం మొదలు పెడుతుంది ……. !!