రాజ్ బలవంతంగా భూమి ను తీసుకు వెళ్తుండడం చూసిన మహాన్ కోపంగా శ్లోక ను వదిలి రేయ్ రాజ్ ఆగు అంటూ బయటకీ పరిగెత్తి రాజ్ & భూమి కి అడ్డుగా నుంచుని సెక్యూరిటీ క్లోజ్ ద గేట్స్ అని ఆర్డర్స్ ఇచ్చి భూమి చేతిని పట్టుకుని తన మీదకు లాక్కుంటాడు …… !! తన వైపు బెదురు కళ్ళతో చూస్తున్న భూమి చేతిని పట్టుకుంటూ రాజ్ వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ వీడి సంగతేంటో చూడండి …… !! అంటూ సీరియస్ గా చెప్పి రాజ్ వైపు పొగరుగా చూస్తాడు ……… !! ఉఫ్ నేను నిన్ను కొట్టకూడదు అని నేను అనుకుంటుంటే నీకు నాతో కొట్టించుకోవాలి అని అంత ఆశగా ఉంటే నేను మాత్రం ఎందుకు కాదు అంటాను …… !! అని రెండు చేతులకు వేళ్ళు విరుచుకుంటూ బాడి స్ట్రెచ్ చేస్తూ సెక్యూరిటీ గార్డ్స్ ను 5 నిమిషాల్లో నేలకు అతుక్కునేలా చేస్తాడు…… !!
అరెరే ఎంట్రా ఇది ఇంత చచ్చు సన్నాసి వేదవలని పెట్టుకున్నావ్ …… !! నన్ను కనీసం 5 నిమిషాలు కూడా ఆపలేక పోయారు వేస్ట్ ఫెల్లోస్ అని కింద పడ్డ వాళ్లను తన్ని వీల్లేనా ఇంకా ఎవరైనా ఉన్నారా …… ?? ఉంటే లాగ్ ఎందుకు వాళ్ళను కూడా రమ్మను …… !! ఈ పోలిసోడి దెబ్బ వాళ్లకు కూడా రుచి చూపిస్తాను …… !! పైకి లేవబోతున్న సెక్యూరిటీ గార్డ్స్ ను స్పృహ కోల్పోయేలా కొట్టి మహాన్ వైపు యాటిట్యూడ్ లుక్ ఇస్తాడు …… !!
మహాన్ రాజ్ వైపు కోపంగా చూస్తు రాజ్ వైపు వెళ్తూ వుండగా భూమి మహాన్ చేతిని పట్టుకుని మహాన్ ప్లీస్ అన్నయ్య తో గొడవ పడద్దు …… !! అన్నయ్య ను నేను ఇక్కడి నుంచి పంపించేస్తాను ప్లీస్ నాకు 5 మినిట్స్ టైమ్ ఇవ్వు అంటూ ప్లీసింగ్ గా అడుగుతుంది …. !!
మహాన్ భూమి చేతిని విసిరి కొట్టి అయిదు నిమిషాలు టైమ్ ఇస్తున్నా …… !! వాడు ఇక్కడి నుండి వెళ్ళలేదో వాడ్ని ఎలా పంపించాలో అలా పంపిస్తా ……. !! అంటూ విసురుగా అక్కడి నుండి ఇంట్లోకి వెళ్తూ డాక్టర్ కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి శ్లోక ను తీసుకొని సోఫా లో కూర్చుంటాడు ……. !!
అన్నయ్య ఆ భూమి కావాలనే వాడికి కాల్ చేసి నువ్వు లేని టైమ్ లో రప్పించి నన్ను ఇలా కొట్టేలా వాడ్ని రెచ్చ కొట్టింది దాన్ని ఊరికే వదలకు అని ముక్కు చీదుతూ చెప్తుంది శ్లోక…… !!
రిలాక్స్ శ్లోక !! ఆ రాజ్ గాడు ఇక్కడి నుండి వెళ్లనివ్వు అప్పుడు భూమి కి నా స్టయిల్ లో చెప్తాను అంటూ మొహాన్ని సిరియస్ గా పెట్టుకొని చెప్తాడు …… !!
హమ్మయ్య అన్నయ్య కి బాగా కోపం వచ్చినట్టు ఉంది ….. !! ఒసేయ్ భూమి నీ అన్న వెళ్ళాక నా అన్న చేతిలో అయిపోయావే నువ్వు అంటూ కన్నింగ్ గా నవ్వుకుంటూ ఉంటుంది …… !!
పదా వెళ్దాం !! ఈ ఇంట్లో ఇంత సేపు ఉండడమే చిరాగ్గా ఉంది వెళ్ళి బాత్ చేస్తే తప్పా ఈ చిరాకు తగ్గేలా లేదు అని భూమి చేతిని పట్టుకున్న రాజ్ ను ఆపి అన్నయ్య ప్లిస్ 5 నిమిషాలు నేను చెప్పేది విను …… !! అంటూ రాజ్ చేతిని పట్టుకుని గార్డెన్ లోకి తీసుకుని వెళ్లి రాజ్ వైపు చూస్తుంది ….. !!
భూమి నువ్వు నాకేం చెప్పినా నేను వినను …… ?? అసలు నిన్ను నువ్వు అద్దం లో చూసుకున్నావా భూమి ……. ?? ఏలా అయిపోయావో మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రిన్సెస్ లా ఉండే నువ్వు ఈ ఇంటికి వచ్చిన 2 డేస్ లోనే నిన్ను మెయిడ్ లా చేంజ్ చేసారు …… !! నిన్ను ఇలా చూస్తే మమ్మీ , అమ్మమ్మ ఎంత బాధ పడతారో ఆలోచించావా ……. ?? అసలు ఇదంతా కాదు వాడు నిన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నాడో అర్తం అయ్యింది కదా ……. !! ఇంకా ఎందుకు ఇక్కడే ఉండాలి అని పిచ్చిగా అనుకుంటున్నావ్ …… ??
మావయ్య కోసం 🥺
ఎంటి మావయ్య కోసమా …… ?? నీకేమైనా మతి పోయిందా ?? ఆయన కి నువ్వు ఇక్కడ ఉండడం ఏ మాత్రం ఇష్టం లేదు ……. !! అలాంటిది మావయ్య కోసం ఉంటున్నా అంటావేంటీ …… !! దేవయాని నానమ్మ తప్పా ఈ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరిలో మానవత్వం అనేది లేదు …… !! అదే ఉంటే నిన్ను ఈ విదంగా టార్చర్ చేయరు …… !! కనీసం ఆడపిల్లవి అన్న జాలి కూడా లేదు వాడికి అంటూ మహాన్ ను గుర్తు చేసుకుని కోపంగా పిడికిలి బిగిస్తాడు…… !!
అన్నయ్య నేను ఇక్కడ ఉంటుంది కేవలం మహాన్ ను మార్చుకోవడానికి మాత్రమే కాదు …… !! విడిపోయిన అత్తయ్య మావయ్య లను కలపడానికి …… !! ప్లీస్ వీలైతే నాకు హెల్ప్ చెయ్ తప్పా నన్ను ఇక్కడి నుండి తీసుకు వెళ్ళాలి అని చూడకు …… !! ఎందుకంటే నేను అనుకున్నది సాధించే వరకు ఈ ఇల్లు వదిలి రాను ……. !! ఎప్పటికైనా నేను ఉండాల్సింది ఇక్కడే & ఇదే నా ఇల్లు & నా ప్రపంచం కూడా…… !!
రాజ్ కోపంగా చూస్తూ భూమి నాకు అనవసరంగా కోపం తెప్పించకు …… !! ఆవిడ ఏనాడో మావయ్య ను వద్దు అనుకుని ఈ ఇంటికి వచ్చేసింది …… !! వాళ్ళు బార్య భర్తలుగా విడిపోయి కూడా పాతిక సంవత్సరాలు అవుతుంది …… !! అలాంటిది ఇప్పుడు వాళ్ళని కలుపుతాను అంటావేంటి నీది పిచ్చి అనాలా లేక అమాయకత్వం అనాలా …….??
వాళ్ళ శరీరాలు మాత్రమే దూరంగా వున్నాయి అన్నయ్య మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాయి ……. !! అందుకే వాళ్ళు విడిపోయినా మరొకరిని పెళ్లి చేసుకోలేదు ……. !! మావయ్య కి కూడా అత్తయ్య అంటే ప్రేముంది కానీ అది తెలుసుకోలేక పోతున్నాడు ……. !!
చూడు భూమి నువ్వు చెప్పేది బానే వున్నా అది ప్రాక్టికల్ గా ఎప్పటికీ జరగదు ……. !! నీకు ఆవిడ గురించి సరిగ్గా తెలియక పోయినా నాకు బాగా తెలుసు & ఆవిడ వొళ్లంతా అహంకారం, పొగరు తప్పా ……. !! ప్రేమ, అభిమానం, ఆప్యాయత లాంటివి లేవు …… !! ఆవిడ లాగే వీళ్ళను ( మహాన్, శ్లోక) కూడా తయారు చేసింది …… !! మహాన్ కి చిన్నప్పటి నుండి మావయ్య మీద ద్వేషం పెరిగేలా చేసి ఇప్పుడు మావయ్య కి బిజినెస్ లో గట్టి పోటీ ఇచ్చే వరకు తెచ్చింది …… !! ఇక శ్లోక అది నా దృష్టిలో ఆడది కాదు ఇన్ఫాక్ట్ అది నాకు మనిషి లా కూడా అనిపించదు దానికి కూడా ఆవిడ లాగే వొళ్ళంతా కొవ్వు, బలుపు….. !!
మావయ్య కూడా వీళ్ళ గురించి తెలిసి పట్టించకోవడం ఎప్పుడో మానేశాడు ….. !! నువ్వు వాళ్ళను కలపాలి అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది …… !! నీకోటి చెప్పనా భూమి , ఆకాశం దూరం నుండి చూడడానికి కలిసినట్టే వుంటాయి ……. !! బట్ అవి ఎప్పటికి కలవవు …… !! వీళ్ళు కూడా అంతే ఎప్పటికీ కలవరు ……. !! అనవసరమైన ప్రయత్నాలు ఆపి నాతో పదా …… !! నీకు మహాన్ కంటే గొప్ప వ్యక్తి తో ఘనంగా పెళ్ళి జరిపించి వాడు రీగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తాను …… !! అయినా ఈ డిస్కషన్ నాకు అనవసరం ముందు ఇంటికి వెళ్ళాక అన్నీ క్లియర్ గా మాట్లాడుకుందాం పదా……. !!
అన్నయ్య ప్లీస్ 🥺నాకు ఒక్క అవకాసం ఇవ్వు నా వల్ల విడిపోయిన వీళ్ళను నేనే కలిపి నాకు తెలియకుండా నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను …… !! వీళ్ళను కలిపిన తర్వాత నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను …… !! ఆ తర్వాత నిజంగా నువ్వు చెప్పినట్టే వింటాను ……. !! ప్లీస్ రా ఒక్క ఛాన్స్ ఇవ్వు…… !!
నా కోసం కాకపోయినా మన ఇద్దరి కోసం ప్రతీ క్షణం తపన పడే మావయ్య కోసం అయినా ఇవ్వు ప్లీస్ అన్నయ్య అంటూ రాజ్ ను హగ్ చేసుకుంటూ నువ్వు నేను మమ్మీ ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాం కదా అన్నయ్య….. !! మనల్ని ప్రతి క్షణం అంత హ్యాపీగా చూసుకున్న మావయ్య మాత్రం తన భార్య & పిల్లలకు 25 ఇయర్స్ నుండి దూరంగా ఉంటున్నాడు 🥺…… !!
మనకు తెలియకుండా మావయ్య తన పిల్లలను మిస్ అవుతూనే ఉంటాడు రా…… !! ప్లీస్ అన్నయ్య అత్తయ్య, మావయ్య కలిస్తే మనది కంప్లీట్ ఫ్యామిలీ అవుతుంది….. !! మన మావయ్య హ్యాపీనెస్ కోసం ఒక్క సారి ఆలోచించు అంటూ రాజ్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది…… !!
కార్తికేయ తమ కోసం చిన్నప్పటి నుండి ఎన్నో చేశాడు….. !! ఇన్ఫాక్ట్ తమకు నాన్న లేడు అన్న థాట్ కూడా రానివ్వకుండా ఇద్దరిని గుండెల మీద పెట్టుకుని పెంచాడు….. !! చాలా మంది తర్వాత మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేసినా కార్తికేయ నో చెప్పేవాడు అందుకు కారణం నందన మీద ప్రేమేనా అనిపిస్తూ ఆలోచనలో పడతాడు….. !!
ఏదో ఆలోచిస్తున్న రాజ్ ను చూసి ఇక్కడ నేను మావయ్య & అత్తయ్య ను కలపడానికే మాత్రమే ఉంటున్నా అన్నయ్య…… !! మహాన్ కోసం కాదు అంటూ రాజ్ చేతిని పట్టుకుంటూ నాకు కొంచెం టైమ్ ఇవ్వు….. !! ఆ టైం లోగా నేను సక్సెస్ అవ్వకపోతే అప్పుడు నేనే వచ్చేస్తాను…… !!
రాజ్ కాసేపు ఆలోచించి సరే నువ్వు ఇక్కడ వుండడం నాకు సెంట్ పర్సెంట్ కూడా ఇష్టం లేకపోయినా మావయ్యా కోసం నీకు 3 మంత్స్ టైమ్ ఇస్తున్నా …… !! ఆ తర్వాత ఒక్క రోజూ కాదు కదా ఒక్క క్షణం నువ్వు ఇక్కడ వుంటాను అన్నా నేను ఒప్పుకోను …… !! మెయిన్ థింగ్ ఆ మహాన్ గాడికి ఎంత వీలైతే అంత దూరంగా వుండు …… !! వాడేమైనా ఎక్స్ట్రాస్ చేస్తే నాకు కాల్ చెయ్ బొక్కలో వేసి కుళ్ళ బొడిచేస్తా అంటూ పాకెట్ లో నుండి మొబైల్ తీసి ఇది నీ కోసమే తీసుకున్నా …… !! న్యూ మొబైల్ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని తీసుకున్నా బట్ ఇలా ఇవ్వాల్సి వస్తుంది అనుకోలేదు……!!
ఇందులో కొత్త సిం కూడా వేసాను ….. !! నీకు ఏ అవసరం వచ్చినా ఎనీ టైమ్ కాల్ చెయ్ ….. !! అంటూ భూమి ను హత్తుకుని వదిలి ప్రేమగా నుదుటిన ముద్దు పెడుతూ కాల్ చేస్తావ్ కదా అంటూ భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా అడుగుతున్న రాజ్ ను చూసి ఏడుస్తూ చేస్తాను అన్నయ్య ఐ మిస్ యూ రా అంటున్న భూమి ను గట్టిగా హత్తుకుని మీ టూ 🥺 అంటూ వెనక్కి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ….. !!
వెళ్తున్న రాజ్ ను చూసి మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని ఏడుస్తూ నాకు తెలుసు అన్నయ్య …… !? నన్ను ఇక్కడ వదిలి వెళ్తున్నందుకు నువ్వు ఎంత బాధ పడుతున్నావో …… !! బట్ తప్పక నా కోసం వెళ్తున్నావ్ ఐ నో దట్ జస్ట్ 3 మంత్స్ అన్నయ్య …… !! ఈ లోగా వీళ్ళ గతం తెలుసుకుని ఇద్దరిని ఎలా అయినా ఒక్కటి చేసి మన రెండు ఫ్యామిలీస్ మళ్లీ ఒకటి అయ్యేలా చేస్తా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది …… !!
భూమి ఇంట్లోకి రావడం చూసిన మహాన్ సోఫా నుండి ఆవేశంగా పైకి లేచి ఇంట్లోకి అడుగు పెడుతున్న భూమి ను మెడ పట్టుకుని ఇంటి బయటకి అంటే గార్డెన్ వైపు నెడతాడు….. !! ఇవాళ మొత్తం బయటే ఉండు ఇంట్లోకి వచ్చావో నా చేతుల్లో చచ్చావే అని కోపంగా చెప్పి గుమ్మం తలుపులు మూసి వేస్తాడు అది చూసిన భూమి కన్నీళ్లతో మహాన్ వైపు చూస్తూ ఉండగానే మహాన్ డోర్స్ క్లోజ్ చేస్తాడు….. !!