నన్ను వదలకే రాక్షసి-1

నన్ను వదలకే రాక్షసి-1

అమెరికా లో ఒక పెద్ద ఆఫీస్ లోపల అంతా చాలా కోలాహలంగా ఉంది.

అందరూ ఒకరితో ఒకరు గుసగుసలు ఆడుతూ చేతిలో ఫ్లవర్ బొకేస్ తో నిల్చున్నారు.

అప్పుడే అక్కడికి ఆ కంపెనీ బాస్ సంకేత్ వస్తాడు..

బాస్ రాగానే గుసగుసలు ఆపేసి అందరూ సంకేత్

దగ్గరకి వస్తారు..

సంపత్ : గుడ్ మార్నింగ్ గయ్స్

స్టాఫ్ :గుడ్ మార్నింగ్ సార్..

సంపత్ : గయ్స్ మీకు అందరికి ముందు చెప్పాను కానీ మళ్ళీ ఒక సారి చెప్తున్నాను మన కంపెనీని ఇండియాకి చెందినపెద్ద బిజినెస్ మెన్ విక్రాంత్ వర్మ గారు కొన్నారు.

చిన్న వయసులోనే ఎంతో మంచి పేరు సంపాదించిన వ్యక్తి .. బిజినెస్ లో ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్ ఉన్నారు..

మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో ఇక మీదట కూడా అలానే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు..

విక్రాంత్ వర్మ గారు చాలా మంచి వారు మీకుఎటువంటి ఇబ్బంది

ఉండదు..

ఇంతలో డోర్ ఓపెన్ అయిన సౌండ్ వస్తుంది.

అందరూ డోర్ వైపు చూస్తారు.

బ్లాక్ సూట్, కళ్ళకి గాగుల్స్ ఆరు అడుగుల హైట్ తెల్లని మేనిచాయ ముట్టుకుంటే కందిపోతాడు ఏమో అనేలా ఉన్న విక్రాంత్ వర్మ హుందాగా నడుస్తూ లోపలికి వస్తాడు..

ఎంప్లాయిస్ అందరూ అతనిని అలా మైమరచిపోయి చూస్తూ ఉంటారు..

అమ్మాయిలు అయితే కలలలో విహరిస్తూ ఉన్నారు

అతని అందం చూసి…..

అబ్బాయిలు అయితే అమ్మాయిలను అలా చూసి ఇంకా మనకి ఒక్క అమ్మాయి కూడా పడదు అంటూ ఏడుపు మోహలు వేస్తారు…

సంపత్ : గయ్స్ వీరే విక్రాంత్ వర్మ గారు మీకు కొత్త బాస్.. అంటూ అందరికి పరిచయం చేస్తారు….

అందరూ ఒక్కొక్కరుగా విక్రాంత్ వర్మ గారికి ఫ్లవర్ బొకేస్ ఇస్తూ తమని తాము పరిచయం చేసుకుంటూ ఉంటారు..

ఇంతలో ఒక అమ్మాయి హడావిడిగా లోపలికి వస్తుంది చేతిలో బొకేతో ..

అందరి దగ్గర ఫ్లవర్ బోకేస్ తీసుకుంటున్న విక్రాంత్ వర్మ బొకేస్ తీసుకోవటం ఆపి వస్తున్న ఆమె వైపు చూస్తాడు…

ఆమె హడావాడినా లోపలికి వచ్చేస్తుంది..

సంపత్: వేదా ఇవ్వాళ ఇంత లేటు అయ్యింది ఏంటి అంటూ చిన్నగా అని..

విక్రాంత్ వైపు తిరిగి విక్రాంత్ గారు తను వేదా మీ పర్సనల్ సెక్రటరీ ఇప్పటి నుండి అంటూ వేదని పరిచయం చేస్తాడు..

విక్రాంత్ వేద ముందుకి వెళ్ళి నిల్చుంటాడు…

అప్పటి వరకు సంకేత్ వైపు చూస్తున్న వేదా విక్రాంత్ తన ముందుకి రాగానే తల పైకి ఎత్తి విక్రాంత్ ని చూసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది విక్రాంత్ వైపు..

వేద బొకే ఇవ్వకుండా అలా షాక్ గా విక్రాంత్ ని చూస్తూ ఉండటం చూసి తన కొలీగ్ ఇంకా తన రూమ్ మేట్ అయినా అను రాధ..వేదా ఏంటి అలా చూస్తున్నావు… విష్ చెయ్యి అంటూ వేద ని తన భుజం తో వేద భుజాన్ని తడుతుంది..

అను అలా తట్టటం తో ఈ లోకం లోకి వచ్చిన వేద భయం గా విక్రాంత్ ని చూస్తూ బొకే ముందుకి అని వెల్కమ్ సార్అంటుంది

విక్రాంత్ వేద వైపు ఎర్రటి కళ్ళతో చూస్తూ వేద చెంప పై గట్టిగా కొడతాడు.

విక్రాంత్ అలా వేదని కొట్టగానే అందరూ షాక్ తో భయం తో బిగుసుకొని పోతారు….

వేదా చెంపపై చెయి పెట్టుకొని విక్రాంత్ వైపు చూస్తుంది..కళ్ళ నిండా నీళ్లతో..

విక్రాంత్ వేద వైపు కోపంగా చూస్తూ సంకేత్ గారు నా క్యాబిన్ ఎక్కడ అంటాడు…

సంకేత్ కూడా ఆల్మోస్ట్ షాక్ లో ఉంటాడు..

విక్రాంత్ పిలవటం తో షాక్ నుండి బైటకి వచ్చి వేద ని ఒక సారి చూసి అను కి వేద ని చూడమని చెప్పి..

 స్టాఫ్ వైపు చూసి మీరు మీ వర్క్స్ చేసుకోండి అని చెప్పి విక్రాంత్ వైపు చూసి రండి విక్రాంత్ గారు అంటూ విక్రాంత్ ని అతని కాబిన్ కి తీసుకెళ్తాడు ..

సంకేత్ :ఇక ఇవ్వాల్టి నుండి ఇది మీ ఆఫీస్ మీకు ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చెయ్యండి విక్రాంత్ వర్మ గారు..

విక్రాంత్ : తప్పకుండా సంకేత్ గారు.. అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు..

సంకేత్: మీరు ఏమి తప్పుగా అనుకోకండి ఇలా చెప్తున్నా అని వేద చాలా మంచి అమ్మాయి తను ఈ ఆఫీస్ లో 4ఇయర్స్ గా పిన్ని చేస్తుంది ఎప్పుడు లేట్ గా రాలేదు ఇవ్వాళా ఏదో ప్రాబ్లెమ్ వచ్చి ఉంటుంది… అందుకే లేట్ అయ్యింది…

విక్రాంత్ సంకేత్ తో కాసేపు మాట్లాడతారు (ఎం మాట్లాడాడో మీకు నేను తరువాత చెప్తాను )

విక్రాంత్ చెప్పింది విని సంకేత్ వెళ్ళిపోతాడు…

సంపత్ వెళ్ళాక వెళ్లి తన చైర్ లో కూర్చుంటాడు విక్రాంత్ వర్మ…

వేద చెంపమీద చెయ్ పెట్టుకొని కళ్ళనిండా నీళ్లతో అలానే నిలబడి ఉంటుంది..

అను వేదని రెస్ట్ రూమ్ కి తీసుకెళ్తుంది..

వేద ఎం మాట్లాడకుండా అక్కడ ఉన్న చైర్ లో కూర్చొని ఉంటుంది..

అను ఎంత పిలిచినా వేద పలకదు

అలానే ఏదో ఆలోచిస్తూ చైర్ లో కూర్చొని ఉంటుంది..

అను కి ఎం అర్ధం కాదు వేద ని సార్ ఎందుకు కొట్టారు సార్ కొట్టిన కూడా వేద ఎందుకు అంతా సైలెంట్ గా ఉంది..

ఎవరైనా కొంచం ఎక్కువగా మాట్లాడినా వెంటనే వాళ్ళకి కొట్టినట్టు సమాధానం చెప్పే వేద ఇవ్వాళా సార్ కొట్టిన కూడా ఎందుకు సైలెంట్ గా ఉంది అంటూ వేద వైపు చూస్తూ ఉంటుంది..

కాసేపటికి వేద లేచి పేస్ వాష్ చేసుకొని తన కేబిన్ లోకి వెళ్ళిపోతుంది అను ని వదిలేసి…

వేద వెళ్ళటం తో ఈవెనింగ్ మాట్లాడాలి వేద తో అని అనుకుంటూ తను కూడా తన సీట్ లోకి వెళ్తుంది..

వేద వెళ్లి తన సీట్ లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది..

ఇంతలో ప్యూన్ వచ్చి వేద మేడం ఎండీ సార్ మిమ్మలిని

పిలుస్తున్నారు అంటూ చెప్తాడు…

వేద :ఓకే నువ్వు వెళ్ళు అంటూ ప్యూన్ కి చెప్పి తను లేచి విక్రాంత్ వర్మ కేబిన్ వైపు వెళ్తుంది…

 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *